
కల్లూరు రూరల్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని తన స్వగ్రామమైన నారాయణపురంలో గురువారం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొనగా, పొంగులేటి కేక్ కట్‌చేసి అనంతరం మాట్లాడారు. గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment