7న మిర్యాలగూడలో లక్ష మందితో దీక్ష
Published Tue, Sep 3 2013 3:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన మిర్యాలగూడలోని రాజీవ్‌చౌక్ వద్ద రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మందితో దీక్ష నిర్వహించనున్నట్టు నియోజకవర్గ రాజకీయ జేఎసీ కన్వీనర్ మాలి ధర్మపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక శాంతినికేతన్ బీఈడీ కళాశాలలో రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును సీమాంధ్రులు అడ్డుకునే కుట్ర చేస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు.
లక్ష దీక్ష కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. తెలంగాణలో నిర్వహించే శాంతి ర్యాలీలు ఇరు ప్రాంతాల మధ్య శాంతిని నెలకొల్పేవిధంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా జేఎసీ నాయకులు తెలంగాణ నినాదాలు చేశారు. సమావేశంలో జేఏసీ నాయకులు మువ్వా రామారావు, డాక్టర్ రాజు, తిరునగరు భార్గవ్, వనం మదన్‌మోహన్, అన్నబీమోజు నాగార్జునచారి, గాయం ఉపేందర్‌రెడ్డి, బండి యాదగిరిరెడ్డి, రేపాల పురుషోత్తంరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, కుందూరు శ్యాంసుందర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, కృష్ణారెడ్డి, అమరావతి సైదులు, కొత్త వెంకట్, ఉదయభాస్కర్‌గౌడ్, చందుయాదవ్, రాములు, అంజయ్య, సత్యనారాయణ, నాగభూషణం, కమలాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement