వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు ప్రజా సంఘాల మద్దతు రోజు రోజుకు పెరుగు తోంది. లోక్‌సత్తా, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కంప్యూటర్ టీచర్స్ అసోసియేషన్, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ, గిరిజనుల సంక్షేమ సంఘంతోపాటు వాణిజ్య సంఘాలు మద్దతు పలికాయి. వివిధ విద్యాసంస్థల అధినేతలు, కొందరు ప్రముఖులు జగన్‌ను వేదికపై కలిసి చర్చలు జరిపారు. జగన్‌తో విజ్ఞాన్ యూనివర్శిటీ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కొంతసేపు చర్చలు జరిపారు.
శిబిరంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూ రు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, నేతలు మేరుగ నాగార్జున, ఆతుకూరి ఆంజనేయులు, ఎండీ నసీర్‌అహ్మద్, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురంరాము), కావటి మనోహర్‌నాయుడు, పోలూరి వెంకటరెడ్డి, బండారు సాయిబాబు, దేవళ్ల రేవతి, నూనె ఉమాహేశ్వరరెడ్డి, షేక్ గులాం రసూల్, మొగిలి మధు, సయ్యద్‌మాబు, కొత్తా చిన్నపరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, అంగడి శ్రీనివాసరావు, కొలకలూరి కోటేశ్వరరావు, డైమండ్‌బాబు, శిఖా బెనర్జీ, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, కోట పిచ్చిరెడ్డి, ఆతుకూరి నాగేశ్వరరావు, గనిక ఝాన్సీరాణి, పల్లపు రాఘవ, పానుగంటి చైతన్య, షేక్ జానీ, ఉప్పుటూరి నర్సిరెడ్డి, ఆవుల సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెరుగుతున్న ప్రజా సంఘాల మద్దతు
Published Sat, Oct 10 2015 12:47 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement