‘ఫీజు’ మహాధర్నాకు తరలిరండి
విద్యార్థులకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ నెల 24న జరిగే మహాధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తరలిరావాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి కోరారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం రూపొందించిన ‘ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం చేపట్టే మహాధర్నాని జయప్రదం చేయండి’ అనే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మహానేత దివంగత ముఖ్యమంతి వైఎస్సార్ మానసపుత్రిక అని ఆయన పేర్కొన్నారు.
మంచి ఉద్దేశంతో వైఎస్సార్ దీన్ని ప్రవేశపెట్టారన్నారు. వైఎస్సార్ మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు, ఆ తర్వాత విభజన అనంతరం గద్దెనెక్కిన ప్రభుత్వాలు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. ఇప్పటికీ రూ.3 వేలకోట్లు బకాయిలు ఉన్నాయంటే ప్రభుత్వానికి విద్యార్థులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఆందోళనతోనే ప్రపంచ వ్యాప్తం అయిన విషయం, ఉద్యమానికి గుండెకాయగా విద్యార్థులు నిలచారన్నా విషయం టీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మరవటం ఆశ్చర్యకర మన్నారు. ఫీజు పోరు వైపు రాష్ట్రంలోని విద్యా ర్థులు, తల్లిదండ్రులు అడుగులు వేస్తే సీఎం కేసీఆర్ పలాయనం చిత్తగించాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హితవు పలికారు.
ఈ ఆందోళన ఆరంభం మాత్రమే..
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్య క్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద 24న జరిగే మహాధర్నాకు విద్యార్థులు వేలాదిగా తరలిరావాలని కొండా రాఘవరెడ్డి కోరారు. ఉదయం 11 గంటలకు ధర్నా ప్రారంభమవుతుందన్నారు. ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని.. ప్రభుత్వం కళ్లు తెరవకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శు లు కె. శివకుమార్, మతీన్, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, యూత్ విభాగం అధ్యక్షుడు అవి నాష్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథచారి తదితరులు పాల్గొన్నారు.