వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికే వైఎస్ అని పేరుపెట్టుకుని ప్రజల ముందుకు వస్తే తమలాంటి అభిమానులు వదిలిపెట్టరని, తస్మాత్ జాగ్రత్త అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను హెచ్చరించారు వైఎస్సార్‌టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి. వైఎస్సార్‌జిల్లాలో పర్యటిస్తున్న కొండా రాఘవరెడ్డి.. షర్మిలపై మండిపడ్డారు. వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చే కుట్రలను ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్ అభిమానిగా షర్మిల చర్యలు తమనెంతో బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘మురుసుపల్లి షర్మిలగా నువ్వు ఏ ఫుట్‌పాత్‌పై తిరిగినా మాకు అభ్యంతరం లేదు. మేము రాజశేఖర్‌రెడ్డి గారి వీరాభిమానులము. రాజశేఖర్‌రెడ్డిగారంటే మాకు ప్రాణం. రాజశేఖర్‌రెడ్డిగారు చనిపోయిన తర్వాత రెండు పుష్కరాలు వస్తే.. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో పిండాలు పెట్టినటువంటి బిడ్డలం మేము. మాలాంటి వారు లక్షలమంది తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికి వైఎస్ అని పేరు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నావ్ చూడు. మా లాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి కడప ప్రజలను జాగృతం చేస్తున్నాం.
అక్కడ ఉన్నప్పుడు(తెలంగాణలో) ఆడ(అక్కడ) బిడ్డ అని అంటివి. ఇక్కడకొచ్చి(ఏపీ) ఈడ బిడ్డ అంటివి. దానికోసం సామెతలు. రక్తసంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్ కట్టాల్సిన అన్నకు నువ్వు రాక్షస రూపంలో ఆయన స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలివో మాకు అర్థమైతాంది.నేను ఇవాళ జగన్‌మోహన్‌రెడ్డిగారిని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవాలి. ఏం తప్పు చేసిండు జగన్‌మోహన్‌రెడ్డిగారు. నీకు ఏమి ఎరుక. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావా?
నీకు తెలుసా నాడు-నేడు, తెలుసా నీకు అమ్మ ఒడి, తెలుసా నీకు గోరుముద్ద. ఏం తెలుసు నీకు. రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్నప్పుడు 850 రుగ్మతలు ఆరోగ్య శ్రీలో ఉంటే, ఈరోజు రెండు వేల ఐదువందల రుగ్మతలను ఆరోగ్య శ్రీలో పెట్టిన మహానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిగారు. నీది నాలుకనా.. తాటిమట్టనా? అని అడగదల్చుకున్నాం. ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖరరెడ్డిగారి కూతురిగా అంగీకరించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తెలుసుకో షర్మిలా.
నువ్వు మురుసుపల్లి షర్మిలవు. నువ్వు మురుసుపల్లి అనిల్‌కుమార్ భార్యవు. అసలు నీకు ఏం కావాలి. నీకు ఆశ ఎక్కువ. ఆశయం మాత్రం లేదు. ఓర్వలేని తనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? అని ధ్వజమెత్తారు కొండా రాఘవరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment