
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్ష పదవుల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, శ్రేణులు పనిచేయడం కోసమే ఈ ప్రక్షాళన చేపట్టామని ఆయన తెలిపారు.