
ఆ భయంతోనే దళితులపై ప్రేమ
గో సంరక్షణ పేరుతో దేశంలో పలు చోట్ల దళితులపై ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల దాడులతో ఉత్తర భారతంలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్
హైదరాబాద్: గో సంరక్షణ పేరుతో దేశంలో పలు చోట్ల దళితులపై ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థల దాడులతో ఉత్తర భారతంలో బీజేపీ పునాదులు కదులుతున్నాయని.. ఆ భయంతోనే మోదీకిదళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని తార్నాకలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గోసంరక్షణ పేరుతో దళితులపై జరుగుతున్న దాడిని మోదీ ఖండించడం హర్షణీయం అన్నారు.
అయితే గుజరాత్‌లో దళితులపై దాడి జరిగినప్పుడు ప్రధాని ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నిం చారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో త్వరలో ఎన్నికలు ఉండడంతో మోదీకి దళితులు గుర్తొచ్చారని చెప్పారు. ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా దళితులపై జరిగిన దాడుల సంఘటనలపై విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రాల సంతోష్‌రెడ్డి తదితరులున్నారు.