వైఎస్ వారసుడినని చెప్పుకునే అర్హత మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు లేదని వైఎస్ఆర్సీపీ నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు.
వైఎస్ వారసుడినని చెప్పుకునే అర్హత మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు లేదని వైఎస్ఆర్సీపీ నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ఓట్ల కోసమే ఆయన చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని, వైఎస్ పేరు ఎఫ్ఐఆర్లో పెట్టినప్పుడు దామోదర ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
వైఎస్ విగ్రహం ధ్వంసం చేసినప్పుడు నిందితుడ్ని విడిచిపెట్టడం వాస్తవం కాదా అని నిలదీశారు. మీరెన్ని మాటలు చెప్పినా దళిత, బలహీనవర్గాలు మాత్రం వైఎస్ఆర్సీపీ వెంటే ఉంటాయని నల్లా సూర్యప్రకాశ్ ధీమా వ్యక్తం చేశారు.