ఆర్టీసీకి రూ. 70 లక్షల నష్టం
కర్నూలు(రాజ్‌విహార్) : ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) లతోపాటు వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల నాయకులు బస్‌స్టేషన్‌లో ఆందోళన నిర్వహించారు. ఈయూ రాష్ట్ర కార్యదర్శులు ఏవీ రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, ఎన్‌ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి కుమార్, జిల్లా నాయకులు ఎంబీఎన్ శాస్త్రీ పాల్గొన్నారు.
ఈ సమ్మెకు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి, సమ్మె కారణంగా జిల్లాలోని 11 డిపోల్లో 609 బస్సులు నిలిచిపోయాయి. 361 బస్సులు నడపగా ఇందులో ఆర్టీసీ బస్సులు 182, అద్దెబ బస్సులు 179 ఉన్నాయి. దీంతో సంస్థకు రూ.70 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టీవీ రామం పేర్కొన్నారు.
మూడో రోజు కొనసాగిన సమ్మె
Published Sat, May 9 2015 5:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM
Advertisement