సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ముగిసింది. జీపీఎస్ విధానాలపై ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. భేటీ అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయి. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాం అని అన్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ గేట్లు తెరవాలని తిరుగుతున్నాడు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడు. ఉగాది తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుచూపుమేరలో కనపడదు. చంద్రబాబు మతిపోయి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ముసలి జిత్తులమారి నక్క. చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలి. మాజీ సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలి. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.
ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది. చంద్రబాబు వంటి దుష్టశక్తులు రాష్ట్ర అభివృద్ధిన అడ్డుకుంటున్నారు. ఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తాం. చంద్రబాబు ఎవరితో కలుస్తారో మాకు అనవసరం. ఎన్టీఆర్ చావుకు కారణం చంద్రబాబు కాదా?. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సంక్షేమ పథకాల వల్లే ధైర్యంగా ఈ విషయం చెబుతున్నాం అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment