సాక్షి, తాడేపల్లి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక సూచనలు చేశారు. ఈ భేటీపై పారదర్శత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల సమావేశం ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు.
కాగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా..‘విభజన సమస్యల పరిష్కారానికి నేడు రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
1.విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల CMల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు AP ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
— Botcha Satyanarayana (@BotchaBSN) July 6, 2024
ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.
2.పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను.
— Botcha Satyanarayana (@BotchaBSN) July 6, 2024
Comments
Please login to add a commentAdd a comment