
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో గుర్తింపు కోసమే చంద్రబాబు రైతు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, మంత్రి బొత్స మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అమరావతి రైతుల విషయంలో కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది. అమరావతిలో పేదలకు స్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు నష్ట పరిహారంపై ప్రత్యేక అధికారులను నియమించాం. ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుంది. అలాగే, మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చాం. ఇంకెవరైనా ఉంటే తీసుకువచ్చేందుకు ఏపీ భవన్ అధికారులతో టచ్‌లో ఉన్నాం’ అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment