Mazdoor Union
-
'అశ్వత్థామరెడ్డి మమ్మల్ని బెదిరించలేదు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్ రెడ్డి సోమవారం నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. తాజాగా థామస్‌రెడ్డి వ్యవహారతీరుపై మండిపడుతూ టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డే కొనసాగనున్నట్లు ఆర్టీసీ కేంద్ర కమిటీ మరోసారి పత్రికా ప్రకటనను విడుదల చేసింది. (చదవండి : రెండుగా చీలిన ఆర్టీసీ కార్మిక సంఘం) ' రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామ రెడ్డి కొనసాగాలని (ఆదివారం 27) రోజున కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా తిర్మానించడం జరిగింది. ఈ కేంద్ర కమిటీ కి గ్రేటర్ హైదరాబాద్ జోనల్ అధ్యక్షుడు.బి. వెంకటేష్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.పి.రెడ్డి, హైదరాబాద్ రీజినల్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, ఎస్.యచ్.కె.రెడ్డి, సికింద్రాబాద్ రీజినల్ కార్యదర్శి నర్సింహులు హాజరై అశ్వత్థామ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. కాని నిన్న థామస్ రెడ్డి పదవి కాంక్షతో అశ్వత్థామరెడ్డిపై చేసిన తప్పుడు ఆరోపణలను గ్రేటర్ హైదరాబాద్ జోనల్, రీజినల్ నాయకులుగా తాము ముక్త కంఠంతో ఖండిస్తూన్నాం. థామస్ రెడ్డి ఆరోపించినట్టుగా అశ్వత్థామరెడ్డి మమ్మల్ని ఎవరిని బెదిరించలేదు. మేము అతని నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది.'అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి : అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది) -
తీవ్ర విభేదాలు.. రెండుగా చీలిన టీఎంయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్ రెడ్డి నేడు మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. అయితే ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న థామస్‌రెడ్డి సహా ఆయన మద్దతుదారులు ఈ భేటీకి గైర్హాజరయ్యారు. (చదవండి: అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది) ఇక ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ ఈ భేటీలో మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిన తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ అసత్య ప్రచారం చేసి లబ్ధి పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ రెండు చీలిపోయింది. -
అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డిపై ఆ సంఘం పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. హైదరాబాద్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఈ మేరకు చర్చించారు. అశ్వత్థామరెడ్డి సంఘం నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానం లో మరొకరు ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. కోవిడ్ నిబంధనల్లో మినహాయింపులు ఇస్తూ వంద మందితో సమావేశాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రావటంతో ఈ భేటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలపై అనధికార నిషేధం విధించి కార్యకలాపాలు లేకుండా చేయటాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు కార్మికులను తీవ్రంగా వేధిస్తున్నారని, వెంటనే కార్మిక సంఘాలను మళ్లీ అధికారికంగా కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల పరిస్థితి సరిగా లేని తరుణంలో, అశ్వత్థామరెడ్డి తప్పుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందొద్దని సమావేశంలో నేతలు అదే సంఘంలోని మరికొందరు నేతలకు సూచించారు. ఇలాంటి పరిస్థితిలో సంఘం దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకు అశ్వత్థామరెడ్డి నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఒకవేళ అశ్వత్థామరెడ్డి తప్పుకోవాలని నిర్ణయిస్తే, కార్మిక సంఘాలు పునరుత్తేజం పొందేవరకు అదే స్థానంలో ఉండాలని పేర్కొనటం విశేషం. అశ్వత్థామరెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. -
‘ఆ ఘనత ఆయనకే దక్కుతుంది’
సాక్షి, విశాఖపట్నం: ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాజువాకలో వైఎస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ స్టీల్ సిటీ డిపోలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. పేద విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే నాలుగు లక్షలు ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. పేద,బడుగు బలహీన వర్గాలు ఆనందంగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్టీసీని మరింత బలోపేతం చేయాలని కార్మికులకు రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. -
స్థాయి మరిచిన అచ్చెన్నాయుడు
అల్లిపురం (విశాఖ): ఆర్టీసీ ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇక్కడి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఒక యూనియన్ నాయకుడిగా ప్రచారం చేశారని, మంత్రి ప్రచారం చేసినా ఎన్ఎంయూ ఓడిపోయినందున నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. లేకుంటే ముఖ్యమంత్రే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరం చుట్టుపక్కల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, ప్రభుత్వం వాటిని కాపాడి ప్రజా అవసరాలకు వినియోగించాలని సీపీఐతో పాటు ప్రతిపక్ష పార్టీలు అనేక పోరాటాలు నిర్వహించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిందన్నారు. సిట్ నివేదిక అందజేసి మూడు నెలలు కావస్తున్నా దర్యాప్తు వివరాలు బయటపెట్టలేదని, అందుకు కారణం అధికార పార్టీ మంత్రులు, శాసనసభ్యులకు సంబంధాలు ఉండడమేనని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదకను బయటపెట్టాలని, కబ్జాదారులు ఎంతటి వారైనా వారిపై పీడీ యాక్ట్ పెట్టి నగర బహిష్కరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఐ పరిశీలనలో వెల్లడైన కబ్జాదారుల వివరాలను ఆయన వెల్లడించారు. ♦ కొమ్మాది సర్వే నంబరు 28/8లో 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాతంత్ర సమరయోధుడు దాకవరపు రాములు పేరిట ఉంది. ఆ భూమి కె.శ్రీనివాసరెడ్డి ఆక్రమణలో ఉంది. ♦ సర్వేనంబర్ 161/1లో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి బుద్ద మహాలక్ష్మీ, వై.పార్వతిల అధీనంలో ఉంది. ♦ 7 పార్టులో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి మాజీ సైనికుడు కె.రామారావు పేరిట ఉంది. ♦ సర్వే నంబరు 154/35లో 5 ఎకరాల భూమిని మంత్రి గంటా శ్రీనివాసరావు శాడో ఎమ్మెల్యే పరుచూరి భాస్కరరావు ఆక్రమించారు. ♦ సర్వే నంబరు 7లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి మైటాస్ సంస్థ ఆధీనంలో ఉంది. ♦ పీఎంపాలెం పరిధిలో సర్వే నంబరు 20/4లో 2.82 ఎకరాల ప్రభుత్వ భూమి తిరుమల రాణి పేరిట ఆక్రమణలో ఉంది. ♦ గాజువాక సర్వేనంబరు 87లో వెయ్యి గజాల ప్రభుత్వ భూమి మాజీ శాసనసభ్యులు పల్లా సింహాచలం కుటుంబీకులు స్వాధీనంలో ఉంది. -
ఆర్టీసీలో అప్పుడే ఎన్నికల వే‘ఢీ’..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల వేడి మొదలైంది. ప్రస్తుతం ఉన్న గుర్తింపు యూనియన్ పదవీకాలం ఈనెల 7వ తేదీతో ముగిసింది. దీంతో తిరిగి ఎన్నికల హడావుడి మొదలైంది. ఏపీలో ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయిన దరిమిలా ఇక్కడా అదే వాతావరణం నెలకొంది. దీంతో కొందరు యూనియన్ నేతలు అపుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు. మంగళవారం అన్ని యూనియన్లు మోటారు వాహన సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నాయి. సాయంత్రానికి సమ్మె ముగియగానే పలు యూనియన్ల నేతలు ఎన్నికలపై దృష్టిసారించారు. కీలక నిర్ణయాల్లో..! ఆర్టీసీలో ప్రతీ రెండేళ్లకోసారి గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో విజయం సాధించిన యూనియన్ గుర్తింపు యూనియన్‌గా రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఆర్టీసీ తీసుకునే పలు కీలక నిర్ణయాలు, చర్చలు, వివిధ కార్యక్రమాల్లో ఈ యూనియన్ సభ్యులకు అధికారికంగా ఆహ్వానం లభిస్తుంది. ఫలితంగా కార్మికుల సమస్యలు, ఇబ్బందులను నేరుగా సంస్థ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యూనియన్‌కు దక్కుతుంది. పదవీకాలం ముగిసినా.. ఎన్నికలు నిర్వహించే వరకు ఈ యూనియనే ఆపద్ధర్మ గుర్తింపు యూనియన్‌గా కొనసాగుతుంది. 2013 నుంచి టీఎంయూనే..! ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ 2013 నుంచి ఆర్టీసీలో తన హవా కొనసాగిస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పురుడుపోసుకున్న టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కలసి 2012 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. 2013 జనవరి 3న అధికారిక యూనియన్‌గా ఉత్తర్వులు వచ్చాయి. 2015 జనవరి 2తో వీరి పదవీకాలం ముగిసింది. తరువాత 2016 జూలైలో మరో సారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఎంయూ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. మొత్తానికి ఐదున్నరేళ్లుగా టీఎంయూ అధికారిక యూనియన్‌గా ఉండటం విశేషం. గతానుభవాల దృష్ట్యా ఈ మారు ఎన్నికలు సకాలంలో జరుగుతాయా..లేదా వాయిదా పడుతాయా అనే చర్చకూడా కార్మికుల్లో సాగుతోంది. ఎందుకైనా మంచిదని కొన్ని సంఘాలు అప్పుడే సామాజిక మాధ్యమాల్లో తమ ప్రచారం ముందస్తుగానే ప్రారంభించేశాయి. ఎన్నికలు వాయిదా వేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి. -
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల ప్రతిఘటనకై నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం సికింద్రాబాద్‌లోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో హింద్ మజ్దూర్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, బ్యాంకు, ఇన్సూరెన్స్, రక్షణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు..ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నదన్నారు. దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని ఉద్యోగ సంఘాల ఫెడరేషన్ ఐక్యంగా ప్రభుత్వం ముందుంచిన 12 డిమాండ్లను మొండిగా నిరాకరిస్తుందని ఆరోపించారు. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ వర్గాలకు ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందువల్ల కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మె భేరీ మోగించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకై నిర్వహించ తలపెట్టిన ఈ సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. -
ఆర్టీసీకి సీఎం తీరని నష్టం చేస్తున్నారు: ఈయూ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి అన్నివిధాలుగా నష్టం చేస్తున్నారని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి అన్నారు. రాబోయే ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియాన్‌ను భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎంప్లాయిస్ యూనియన్ కార్మికుల పక్షాన పోరాడుతుంటే, టీఎంయూ కార్మికులకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీకి అండగా ఉంటానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సంస్థను అణగదొక్కుతున్నారని అన్నారు. కండక్టర్ పోస్టులు తగ్గించి, డ్రైవర్లపై భారం మోపుతున్నారని.. అద్దెబస్సులతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అన్యాయం చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. -
మూడో రోజు కొనసాగిన సమ్మె
ఆర్టీసీకి రూ. 70 లక్షల నష్టం కర్నూలు(రాజ్‌విహార్) : ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) లతోపాటు వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల నాయకులు బస్‌స్టేషన్‌లో ఆందోళన నిర్వహించారు. ఈయూ రాష్ట్ర కార్యదర్శులు ఏవీ రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి కుమార్, జిల్లా నాయకులు ఎంబీఎన్ శాస్త్రీ పాల్గొన్నారు. ఈ సమ్మెకు పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి, సమ్మె కారణంగా జిల్లాలోని 11 డిపోల్లో 609 బస్సులు నిలిచిపోయాయి. 361 బస్సులు నడపగా ఇందులో ఆర్టీసీ బస్సులు 182, అద్దెబ బస్సులు 179 ఉన్నాయి. దీంతో సంస్థకు రూ.70 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టీవీ రామం పేర్కొన్నారు.