ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి అన్నివిధాలుగా నష్టం చేస్తున్నారని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి అన్నారు. రాబోయే ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియాన్‌ను భూస్థాపితం చేయడం ఖాయమన్నారు.
ఆదివారం ఆయన నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎంప్లాయిస్ యూనియన్ కార్మికుల పక్షాన పోరాడుతుంటే, టీఎంయూ కార్మికులకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీకి అండగా ఉంటానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సంస్థను అణగదొక్కుతున్నారని అన్నారు.
కండక్టర్ పోస్టులు తగ్గించి, డ్రైవర్లపై భారం మోపుతున్నారని.. అద్దెబస్సులతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు అన్యాయం చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.