సమ్మెపై సర్కార్ జోక్యం చేసుకోవాలి | RTC workers' strike On Government intervention | Sakshi
Sakshi News home page

సమ్మెపై సర్కార్ జోక్యం చేసుకోవాలి

Published Mon, May 11 2015 1:35 AM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM

సమ్మెపై సర్కార్ జోక్యం చేసుకోవాలి - Sakshi

సమ్మెపై సర్కార్ జోక్యం చేసుకోవాలి

టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
తాండూరు: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినందున వేతన సవరణ చేయాలన్నారు. ఉద్యోగాలను పణంగా పెట్టి సమ్మె చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు వారికి జేఏసీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తాండూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం మొండివైఖరి మానుకోవాలని చెప్పారు. కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని, చెప్పారు. ఈ తేడాను పూర్తి చేసే బాధ్యత యాజమాన్యానిదేనని కోదండరాం పేర్కొన్నారు. ఇటు యాజమాన్యం, అటు కార్మికులు ఒక మెట్టు దిగి సమస్యకు పరి ష్కారం దొరికిలా దోహదపడాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement