సమ్మెపై సర్కార్ జోక్యం చేసుకోవాలి
టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
తాండూరు: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినందున వేతన సవరణ చేయాలన్నారు. ఉద్యోగాలను పణంగా పెట్టి సమ్మె చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు వారికి జేఏసీ అండగా నిలుస్తుందని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తాండూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నాలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో ఆర్టీసీ యాజమాన్యం మొండివైఖరి మానుకోవాలని చెప్పారు. కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని, చెప్పారు. ఈ తేడాను పూర్తి చేసే బాధ్యత యాజమాన్యానిదేనని కోదండరాం పేర్కొన్నారు. ఇటు యాజమాన్యం, అటు కార్మికులు ఒక మెట్టు దిగి సమస్యకు పరి ష్కారం దొరికిలా దోహదపడాలని సూచించారు.