ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం ఆర్టీసీ బస్టాండ్ నందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
పట్నంబజారు(గుంటూరు) : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం ఆర్టీసీ బస్టాండ్ నందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌తో పాటు పలు కార్మిక సంఘాల నేతలు, కార్మికులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా కార్మిక సంఘాల నేతలు సమన్వయం పాటించారు.
రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి శనివారం 785 సర్వీసులు తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు కేవలం రీజియన్ పరిధిలోనే తిరుగుతుండడంతో సుదూర ప్రాంతాల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. వినుకొండతోపాటు జిల్లాలో పలు చోట్ల ఆర్టీసీ కార్మికుల వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు.