workers union leaders
-
పవన్, బాబు పై కార్మిక సంఘాలు ఆగ్రహం
-
ఏడవ రోజూ కొనసాగిన సమ్మె
ఆర్టీసీ కార్మికుల మౌన ప్రదర్శన అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మంగళవారం ఏడవ రోజూ కొనసాగింది. నేతలు, కార్మికులు ఆర్టీసీ బస్టాండు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు ఎస్.నాగముని, ఏఆర్ మూర్తి, పీవీ శివారెడ్డి, రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే తమ డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నారు. తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్లను నియమించుకుని వారికి వేలాది రూపాయలు వేతనంగా ఇస్తూ కార్మికులు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. కొందరు తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన డబ్బును పూర్తిగా క్యాష్ కౌంటర్లో కట్టకుండా స్వాహా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ సమ్మెకు సీఐటీయూసీ మద్దతు
మెదక్ : తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మెదక్ జిల్లా సంగారెడ్డిలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు సీఐటీయూసీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం మద్దతు తెలిపారు. ఆయన శనివారం సంగారెడ్డి డిపో కార్మికులను కలసి వారి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఆర్టీసీ ఆందోళనకు పలు పార్టీల మద్దతు
పట్నంబజారు(గుంటూరు) : తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో శనివారం ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ,సీపీఎంలతో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, ఏపీ ఎన్జీవో, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ తమ న్యాయమైన కోర్కెల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని, ప్రజలపై చార్జీల భారం మోపేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించిన తనకు కార్మికుల కష్టాలు తెలుసని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న టీడీపీ నేతలు, ఇక్కడ లాఠీచార్జీ చే యించడంపై మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ 16 డిగ్రీల ఏసీ బాక్సుల వద్ద కూర్చుని కార్మికులు ఉద్యోగాలు చేయటం లేదని, 43 డి గ్రీల ఎండలో కష్టం చేస్తున్నారన్న సంగతి గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు మాట్లాడుతూ లాఠీచార్జీలకు భయపడేది లేదని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మెకు పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారీ రాస్తారోకో, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, పలు రాజకీయ పార్టీల నాయకులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, కోటా మాల్యాద్రి, నళినీకాంత్, వై.నేతాజీ, షేక్ అమీర్‌వలి, శివరాత్రి శ్రీనివాసరావు, ఎన్వీకే రావు, భగ వాన్దాస్, చల్లా చిన ఆంజనేయులు పాల్గొన్నారు. -
నాలుగో రోజూ ప్రశాంతంగా ఆర్టీసీ సమ్మె
పట్నంబజారు(గుంటూరు) : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం ఆర్టీసీ బస్టాండ్ నందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌తో పాటు పలు కార్మిక సంఘాల నేతలు, కార్మికులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా కార్మిక సంఘాల నేతలు సమన్వయం పాటించారు. రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి శనివారం 785 సర్వీసులు తిరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు కేవలం రీజియన్ పరిధిలోనే తిరుగుతుండడంతో సుదూర ప్రాంతాల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. వినుకొండతోపాటు జిల్లాలో పలు చోట్ల ఆర్టీసీ కార్మికుల వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. -
పదండి ముందుకు.. ప్రభుత్వం దిగొచ్చే వరకు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆపకుండా ముందుకు వెళ్దాం అని భీష్మించారు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు. ఈ మేరకు నిరవధిక సమ్మె చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వీసీహెచ్ వెంగల్ రెడ్డి, కన్వీనర్ క్రిష్టఫర్ దేవకుమార్, కో-చైర్మన్ సంపత్‌కుమార్, కోశాధికారి శ్రీరాములు నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, ట్రెజరీ, పశుసంవర్ధక శాఖ, సహకార శాఖ, వ్యవసాయ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ తదితర శాఖల ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించింది. వివిధ ఉద్యోగ సంఘాలు ర్యాలీ, ధర్నాలు నిర్వహించి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వివిధ ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-చైర్మన్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సోనియా చేతిలో కీలుబొమ్మలుగా మారారన్నారు. వారి చేతగానితనంతోనే రాష్ట్రం రెండు ముక్కలయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రం రెండు ముక్కలు కాకుండా ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పదవులను త్యాగం చేసి ప్రజా ఉద్యమంలో కలసిరావాలని పిలుపునిచ్చారు. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే కేసీఆర్, తెలంగాణ ఉద్యోగ సంఘాలు సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ విడిచి వెళ్లాలని బెదిరిస్తున్నారని, రాష్ట్రం విడిపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చైర్మన్ వీసీహెచ్.వెంగల్రెడ్డి మాట్లాడుతూ ఒక్కరోజు, రెండు రోజుల సమ్మెతో లక్ష్యాన్ని సాధించలేమని, కేంద్రం దిగివచ్చేంతవరకు పాలనను స్తంభింపజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంతో సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరసనలో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సర్దార్ అబ్దుల్ హమీద్, నాగేశ్వరరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నేత ఉస్మాన్, జేఏసీ నేతలు లక్ష్మన్న, జయరామకృష్ణారెడ్డి, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జవహర్లాల్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.