ఆర్టీసీ కార్మికుల మౌన ప్రదర్శన
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మంగళవారం ఏడవ రోజూ కొనసాగింది. నేతలు, కార్మికులు ఆర్టీసీ బస్టాండు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు ఎస్.నాగముని, ఏఆర్ మూర్తి, పీవీ శివారెడ్డి, రామాంజనేయులు తదితరులు మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే తమ డిమాండ్లు నెరవేర్చాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నారు. తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్లను నియమించుకుని వారికి వేలాది రూపాయలు వేతనంగా ఇస్తూ కార్మికులు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. కొందరు తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణీకుల నుంచి వసూలు చేసిన డబ్బును పూర్తిగా క్యాష్ కౌంటర్‌లో కట్టకుండా స్వాహా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడవ రోజూ కొనసాగిన సమ్మె
Published Wed, May 13 2015 3:05 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement