నెల్లూరు: తమ డిమాండ్ల పరిష్కారానికై జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో గురువారం విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపో వద్ద పోలీసులకు, కార్మికులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంలో డ్రైవర్ శ్రీనివాస్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. తొలుత డ్రైవర్ శ్రీనివాస్ కు గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే యత్నం చేశారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచాడు.
పోలీసుల సాయంతోబస్సులు నడపాలని భావిస్తున్న ఆర్టీసీ యాజమాన్యపు చర్యలను అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి,