43% ఫిట్‌మెంట్‌పై స్పందించిన హైకోర్టు
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్: పీఆర్‌సీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు స్పందించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. 43 శాతం ఫిట్‌మెంట్ ఉత్తర్వులపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలంటూ ‘ఫోరం ఫర్ బెటర్ లివింగ్ ’ సంస్థ చైర్‌పర్సన్ డి.పద్మజ ఇటీవల హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.