బ్యాటిల్‌ గ్రౌండ్‌ గేమ్‌ని నిషేధించండి.. తెలంగాణ హైకోర్టులో పిల్‌ | PIL filed in Telangana High Court to impose Ban On Battleground Mobile India | Sakshi
Sakshi News home page

బ్యాటిల్‌ గ్రౌండ్‌ గేమ్‌ని నిషేధించండి.. తెలంగాణ హైకోర్టులో పిల్‌

Published Tue, Feb 8 2022 2:43 PM | Last Updated on Tue, Feb 8 2022 2:50 PM

PIL filed in Telangana High Court to impose Ban On Battleground Mobile India - Sakshi

యూత్‌లో ఎంతో క్రేజ్‌ ఉన్న వివాస్పద గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్‌ని నిషేధించాలంటూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది. మొబైల్‌, కంప్యూటర్‌ వెర్షన్లలో ఈ గేమ్‌ని నిషేధించడంతో పాటు ఆన్‌లైన్‌ గేమ్‌ సేఫ్టీ రేటింగ్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఈ పిటిషన్‌లో కోరారు. అదేవిధంగా గేమ్‌లకు నియమ నిబంధనలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. 

బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా గతంలో పబ్‌జీ పేరుతో యూత్‌లో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. అయితే చైనాతో సరిహద్దు వివాదం మొదలైన తర్వాత డేటా ప్రైవసీ లేదంటూ కేంద్రం ఈ గేమ్‌ను నిషేధించింది. ఆ తర్వాత కాలంలో పలు నియమ నిబంధనలు విధించి 2021 జులైలో ఈ గేమ్‌ను అనుమతించగా .. బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా పేరుతో మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 

ఇప్పటికే బాంబే హైకోర్టులో కూడా ఈ గేమ్‌పై కేసు విచారణలో ఉంది. ఈ కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆరు వారాల గుడువు ఇవ్వాలంటూ కేంద్రం న్యాయస్థానాన్ని కోరింది. ఇంతలో తెలంగాణ హైకోర్టులో మరో వాజ్యం దాఖలైంది. 2022 మార్చి 14న తెలంగాణ హైకోర్టు ఈ వాజ్యంపై విచారణ చేపట్టనుంది. ఇండియాలోనే కాకుండా బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లలో కూడా ఈగేమ్‌ని నిషేధించాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement