పీఆర్సీ పేరిట దోపిడీ
కాసులివ్వని శాఖల్లో అందని వేతనాలు
కొత్త పీఆర్సీకి రూ.కోట్లలో వసూళ్ల పర్వం
యూడీసీలదే దందా..
{sెజరీ పేరిట వసూళ్లు..
అగ్రస్థానంలో ఆరోగ్య శాఖ..
ఒక్కొక్కరి నుంచి రూ.1000
సంక్షేమంలో అందని బకాయిలు
హన్మకొండ అర్బన్ : రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీలో 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. కొన్ని శాఖల్లో ఇది కాగితాలకే పరిమితమైంది. అవినీతికి అలవాటు పడ్డ ఉద్యోగులు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. పెరిగిన వేతనాలు, మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. జూన్ నెల మొదలై 12 రోజులవుతున్నా ఒకటో తారీఖు రావాల్సిన వేతనాలు చాలా శాఖల్లోని ఉద్యోగుల ఖాతాల్లో జమకాలేదు. ఇందుకు కారణం.. ఖజానా చెల్లింపుల కార్యాలయంలో వేతనాల బిల్లులు చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన మామూళ్ల వ్యవహారం సెటిల్ కాకపోవడమే. జిల్లాలో ట్రెజరీ అధికారులు స్థానిక సౌలభ్యం కోసం ముందుగా వేతనాలు తీసుకుని తరువాత మార్చి, ఏప్రిల్ నెలల పీఆర్సీ బకాయిల బిల్లులు ఎస్టీవోలకు అందజేయాలని చెప్పారు. ఇదే అదనుగా భావించిన కొందరు యూడీసీలు ఖజానా అధికారుల పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపారు.
ఇష్టారాజ్యంగా వసూళ్లు
కొన్ని శాఖల్లో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నా రు. తమకు నెలసరి వేతనాలు, రెండు నెలల బకాయిలు ఇచ్చేందుకు ఖజానా పేరు చెప్పి వేధించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ మొదటి స్థానంలో ఉంది. ఈ శాఖ యూడీసీలు ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.1500 వరకు.. విద్యాశాఖలో పీఆర్సీ పేరిట వసూళ్ల దందా రూ.400 నుంచి రూ.1000 వరకు వసూళ్ల పర్వం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సిబ్బందికి ఇంకా కొత్త వేతనాలు, బకాయిలు అందలేదు. వసూళ్ల వ్యవహారం సెటిల్ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీసీ సంక్షేమ శాఖలో కూడా నాల్గో తరగతి ఉద్యోగులకు కొత్త వేతనాలు ఇవ్వలేదు.
ఖజానాలో కేటుగాళ్లు
పీఆర్సీ వసూళ్ల విషయంలో యూడీసీలు ఉద్యోగుల నుంచి ఎంత వసూలు చేసినా ఖజానాలో ఇచ్చింది తక్కువ అని తెలుస్తోంది. అయితే జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఒక ఎస్టీవో, స్టేషన్‌ఘన్‌పూర్‌లో అడిగినంత ఇస్తేనే బిల్లులు పాస్ చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కేటుగాళ్లు
Published Fri, Jun 12 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement