PRC to employees
-
TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పీఆర్సీతో కూడిన వేతనాలు జూన్ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నాయి. కాగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నాం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16 శాతం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. కొత్త పీఆర్సీ జూన్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. 2017 నుంచి 21 శాతం పీఆర్సీతో పే స్కేలు అమలు చేస్తాం. 21 శాతం పీఆర్సీ పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 418.11 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా నడుస్తోంది అని వ్యాఖ్యలు చేశారు. -
ఉద్యోగులకు 11వ పీఆర్సీ
సాక్షి, అమరావతి: ఉద్యోగుల జీతాల పెంపునకు ఉద్దేశించిన 11వ వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఉద్యోగు లకు పీఆర్సీ పాత బకాయిల్లో ప్రస్తుతానికి ఒక వాయిదా ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మంత్రివర్గం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు సహచర మంత్రులతో కలిసి మీడియాకు వివరించారు. పీఆర్సీ బకాయిలు రూ.3,999 కోట్లు ఉండగా, వీటిని విడతల వారీగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఎన్ని విడతలనేది ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని తెలిపారు. పెన్షనర్లకు నగదు రూపంలో, ఉద్యోగులకు జీపీఎఫ్ రూపంలో చెల్లింపులు జరపాలని నిర్ణయించారు. కొత్త పీఆర్సీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగా నివేదికను అందజేయాలని గడువు విధించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై కేబినెట్లో చర్చించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి వివరించారు. యూజర్ చార్జీలకు అనుమతి అమృత్ పథకం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పురపాలక సంఘాల్లో యూజర్ చార్జీల వసూలు పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ యాక్ట్‌లో మార్పులు చేయడానికి మంత్రివర్గం అనుమతి తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు... - ఏపీ వర్చువల్ క్లాస్రూమ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని విద్యాలయాల్లో వర్చువల్ క్లాసురూమ్‌ల ఏర్పాట్లను కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. - మచిలీపట్నం పోర్టు అభివృద్దికి, అక్కడ డీప్ వాటర్ పోర్ట్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు రూ.1,092 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉండి వివిధ బ్యాంకుల నుంచి సమకూర్చుకోవాలన్న ప్రతిపాదనకు ఆమోదం. - అనంతపురం జిల్లా గౌనివారిపల్లిలో బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. - అనంతపురం జిల్లాలోని రామగిరి, కనగానపల్లిలో 160 మెగావాట్ల సామర్థ్యం గల విండ్ సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పడానికి అనుమతి. - అంతర్గత జలరవాణాలో భాగంగా ఇబ్రహీంపట్నం– లింగాయ పాలెం మధ్య ఫెర్రీ సర్వీసులు నిర్వహించడానికి ప్రైవేట్ ఆపరేటర్ కు అనుమతి. తాత్కాలిక జెట్టీల ఏర్పాటుకు ట్రాన్స్‌పోర్టు కాంట్రా క్టరు జీటీ రామారావుకు అనుమతి. - కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 161 ఎకరాల భూమిని టనాచు కార్పొరేషన్ స్టీల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయింపు. ఎకరం ధర రూ.మూడున్నర లక్షలు. - సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు 51.92 ఎకరాల కేటాయింపు. - గతంలో బ్రహ్మకుమారీస్ సొసైటీ పేరుతో కేటాయించిన 10 ఎకరాల భూమి, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ పేరుతో కేటాయించిన 50 ఎకరాల భూమి పేరు మార్పునకు అంగీకారం. - కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్యపేటలో 5.57 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన విష్ణు సేవాశ్రమం, యోగాశ్రమం నెలకొల్పేందుకు శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర స్వామీ ట్రస్టుకు అప్పగిస్తూ ఆమోదం. - ప్రకాశం బ్యారేజ్ నుంచి పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువ ద్వారా వరద నీటి మళ్లింపు ప్రాజెక్టు నివేదిక కోసం వాప్కోస్ సంస్థకు రూ.3.59 కోట్లు కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించేందుకు పరిపాలనపరమైన అనుమతికి ఆమోదం. -
కేటుగాళ్లు
పీఆర్సీ పేరిట దోపిడీ కాసులివ్వని శాఖల్లో అందని వేతనాలు కొత్త పీఆర్సీకి రూ.కోట్లలో వసూళ్ల పర్వం యూడీసీలదే దందా.. {sెజరీ పేరిట వసూళ్లు.. అగ్రస్థానంలో ఆరోగ్య శాఖ.. ఒక్కొక్కరి నుంచి రూ.1000 సంక్షేమంలో అందని బకాయిలు హన్మకొండ అర్బన్ : రాష్ర్ట ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీలో 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. కొన్ని శాఖల్లో ఇది కాగితాలకే పరిమితమైంది. అవినీతికి అలవాటు పడ్డ ఉద్యోగులు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. పెరిగిన వేతనాలు, మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. జూన్ నెల మొదలై 12 రోజులవుతున్నా ఒకటో తారీఖు రావాల్సిన వేతనాలు చాలా శాఖల్లోని ఉద్యోగుల ఖాతాల్లో జమకాలేదు. ఇందుకు కారణం.. ఖజానా చెల్లింపుల కార్యాలయంలో వేతనాల బిల్లులు చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన మామూళ్ల వ్యవహారం సెటిల్ కాకపోవడమే. జిల్లాలో ట్రెజరీ అధికారులు స్థానిక సౌలభ్యం కోసం ముందుగా వేతనాలు తీసుకుని తరువాత మార్చి, ఏప్రిల్ నెలల పీఆర్సీ బకాయిల బిల్లులు ఎస్టీవోలకు అందజేయాలని చెప్పారు. ఇదే అదనుగా భావించిన కొందరు యూడీసీలు ఖజానా అధికారుల పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇష్టారాజ్యంగా వసూళ్లు కొన్ని శాఖల్లో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నా రు. తమకు నెలసరి వేతనాలు, రెండు నెలల బకాయిలు ఇచ్చేందుకు ఖజానా పేరు చెప్పి వేధించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ మొదటి స్థానంలో ఉంది. ఈ శాఖ యూడీసీలు ఒక్కొక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.1500 వరకు.. విద్యాశాఖలో పీఆర్సీ పేరిట వసూళ్ల దందా రూ.400 నుంచి రూ.1000 వరకు వసూళ్ల పర్వం కొనసాగుతోంది. బీసీ సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సిబ్బందికి ఇంకా కొత్త వేతనాలు, బకాయిలు అందలేదు. వసూళ్ల వ్యవహారం సెటిల్ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీసీ సంక్షేమ శాఖలో కూడా నాల్గో తరగతి ఉద్యోగులకు కొత్త వేతనాలు ఇవ్వలేదు. ఖజానాలో కేటుగాళ్లు పీఆర్సీ వసూళ్ల విషయంలో యూడీసీలు ఉద్యోగుల నుంచి ఎంత వసూలు చేసినా ఖజానాలో ఇచ్చింది తక్కువ అని తెలుస్తోంది. అయితే జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఒక ఎస్టీవో, స్టేషన్‌ఘన్‌పూర్‌లో అడిగినంత ఇస్తేనే బిల్లులు పాస్ చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
తక్షణం పీఆర్సీ ప్రకటించాలి
సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖామాత్యులు యనమల వాగ్దానం చేశారు. ఒకటి జూలై 2013న ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటికీ ఇవ్వకుండా జాగు చేస్తూ ఉండటంతో అంబరాన్నంటిన ధరలతో సామాన్య ఉద్యో గులు, పెన్షనర్లు ఇక్కట్ల పాలవుతున్నారు. మంత్రిగారు ఆ మాటే మరిచారు. ఉద్యోగ సంఘాల నాయకులు, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నారు గదా మారాడని ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాలతో నమ్మబలికి బాబును అధికారంలోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు మేలు మరచి ఉద్యోగులను పురుగులా చూస్తు న్నారు. చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంది. మళ్లీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందంటూ ఆర్థిక మంత్రి మరో ఉచిత వాగ్దానం చేశారు. మరోసారి పీఆర్సీని వాయిదా వేసినా ఆశ్చర్యం లేదని ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పెట్టడం, చట్టాలు చేయడం వరకే నాయకుల పాత్ర ఉంటుంది. తర్వాత వాటిని అమలుచేయాల్సింది, ప్రభు త్వానికి మంచి పేరు తేవలసింది వీరేనని ప్రభుత్వం గ్రహించాలి. ఇప్పటికే చాలా లేటైంది. ఇక వాయిదాలు ఆపి తక్షణం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణ యం తీసుకోవాలి. వేతన జీవులను ఉసూరు పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. తక్షణం పీఆర్సీ ప్రకటించాలి. - ఎన్.రఘునాథరావు కొత్తపల్లి