సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు పీఆర్‌సీ ఇస్తామని ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖామాత్యులు యనమల వాగ్దానం చేశారు. ఒకటి జూలై 2013న ఇవ్వాల్సిన పీఆర్‌సీ ఇప్పటికీ ఇవ్వకుండా జాగు చేస్తూ ఉండటంతో అంబరాన్నంటిన ధరలతో సామాన్య ఉద్యో గులు, పెన్షనర్లు ఇక్కట్ల పాలవుతున్నారు. మంత్రిగారు ఆ మాటే మరిచారు. ఉద్యోగ సంఘాల నాయకులు, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నారు గదా మారాడని ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాలతో నమ్మబలికి బాబును అధికారంలోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు మేలు మరచి ఉద్యోగులను పురుగులా చూస్తు న్నారు.
చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంది. మళ్లీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందంటూ ఆర్థిక మంత్రి మరో ఉచిత వాగ్దానం చేశారు. మరోసారి పీఆర్‌సీని వాయిదా వేసినా ఆశ్చర్యం లేదని ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పెట్టడం, చట్టాలు చేయడం వరకే నాయకుల పాత్ర ఉంటుంది. తర్వాత వాటిని అమలుచేయాల్సింది, ప్రభు త్వానికి మంచి పేరు తేవలసింది వీరేనని ప్రభుత్వం గ్రహించాలి. ఇప్పటికే చాలా లేటైంది. ఇక వాయిదాలు ఆపి తక్షణం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణ యం తీసుకోవాలి. వేతన జీవులను ఉసూరు పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. తక్షణం పీఆర్‌సీ ప్రకటించాలి.
- ఎన్.రఘునాథరావు కొత్తపల్లి
తక్షణం పీఆర్‌సీ ప్రకటించాలి
Published Sun, Feb 1 2015 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM
Advertisement