పార్లమెంట్‌లో వయనాడ్‌ విలయంపై కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటన | Parliament Monsoon Session 30 July 2024 Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో వయనాడ్‌ విలయంపై కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటన

Published Tue, Jul 30 2024 10:21 AM | Last Updated on Tue, Jul 30 2024 12:41 PM

Parliament Monsoon Session 30 July 2024 Updates

updates:

  • ప్రతినేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడారు.ఈరోజు తెల్లవారుజామున, వయనాడ్ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు  70 మందికి పైగా మరణించారు. ముండక్కై గ్రామం ఊడ్చిపెట్టుకుపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

  • ప్రమాదం స్థాయిని అంచనా వేయడానికి రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. మరణించిన వారికి తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని  కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ పరిహారాన్ని కూడా పెంచండి.

  • రవాణా, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించండి. వీలైనంత త్వరగా సహాయాన్ని అందించండి. బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయండి. పశ్చిమ కనుమల్లో గత కొన్నిఏళ్లుగా  కొండచరియలు విరిగిపడటం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.

  • వయనాడ్‌ విలయంపై పార్లమెంట్‌లో కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటన
  • ప్రధాని మోదీ కేరళ సీఎం విజయన్‌ మాట్లాడారు. 
  • కేంద్ర అండగా ఉంటుందని భోరోసా ఇచ్చారు.
  • కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తోంది. 
  • ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ రంగంలోకి దిగాయి
  • ఘటానాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం.

     

 

  •  

  • వయనాడ్‌లో  కొండచరియలు విరిగిపడ్డ విపత్తుపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది
     
  • జనగణన ఆలస్యంపై చర్చ జరపాలని లోక్‌భలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు.  

  • జన గణన ఆలస్యం వల్ల మహిళా రిజర్వేషన్ అమలు ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ నోటీసులో పేర్కొంది.

     

  • కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

  • సరిహద్దు పరిస్థితి, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని కోరారు.

     

  • ఇవాళ లోక్ సభలో బడ్జెట్‌పై చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement