Sankranti gift
-
ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక
సాక్షి, విజయవాడ: ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు 2,006 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశారు. లక్ష 77 వేల రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, 4 లక్షల 9 వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు మొత్తం రూ.ఐదు వేల కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించింది. 21 రోజులు దాటకుండానే నిధులు చెల్లించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు 2024: వైఎస్సార్సీపీ కీలక సమావేశాలకు ముహూర్తం ఖరారు -
జయ సంక్రాంతి కానుక
చెన్నై: తమిళనాడులో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు అందుకుంటున్న వారికి సీఎం జయలలిత సంక్రాంతి కానుక ఇవ్వనున్నారు. రెండుకోట్ల మందికి ‘పొంగల్ గిఫ్ట్ ప్యాక్’ ఇవ్వనున్నారు. ఇందులో ఈ నెల సరుకుల (కిలో బియ్యం, పంచదార) తోపాటు రెండు చెరకుగడ ముక్కలు (పండగ సాంప్రదాయం) రూ. 100 నోటుఉంటాయని జయ తెలిపారు. కాగా, మదురైలోని మీనాక్షి గుడి పరిసరాల్లో దుండగులు మంగళవారం అర్ధరాత్రి మూడు పెట్రోల్ బాంబులు విసిరి పారిపోయారు. ఎవరికీ హాని జరగలేదు. ఒక బాంబే పేలింది. -
నాసిరకం కానుకలు..!
* కందిపప్పులో రాళ్లు, పురుగులు * నెయ్యి,బెల్లం తూకంలో అవకతవకలు * రెండు డిపోలకు చేరని సరుకులు * అందని సంచులు * అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు లక్కవరపుకోట: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న క్రిస్మస్,సంక్రాంతి కానుకల్లో నాసిరకం సరుకులను అందజేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. పేదలే కదా ఇచ్చింది తీసుకుంటారు,..అదికూడా ఉచితంగానే కదా ఎలాంటి సరుకులు ఇస్తే ఏమిటి అనుకున్నారో ఏమో.పురుగులు పట్టి,పుచ్చిపోయిన కందిపప్పు.నాసిరకమైన బెల్లం అందజేస్తున్నారని లబ్ధిదారులు అవేదన చెందుతు న్నారు. ప్రతి తెల్లరేషన్ కార్డు దారుడికి కేజీ గోధుమపిండి,వంద గ్రాముల నెయ్యి,అరకేజీ బెల్లం,కందిపప్పు, శనగపప్పు,పంచదార అరకేజీ చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వస్తువులను వాటి తూకాల ప్రకారం ప్యాకింగ్ చేసి కోట్లు రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఫొటోతో ముద్రించిన సంచుల్లో అబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే ఈ సరుకుల్లో బెల్లం అరకేజీకి బదులు 450 గ్రాములు,వంద గ్రాముల నెయ్యికి 90 గ్రాముల నెయ్యి మాత్రమే వస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.అలాగే కందిపప్పులో రాళ్లు, పెంకిపురుగులతో పూర్తిగా నాసిరకం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని చెబుతున్నారు.ఈ సరుకులు అందజేసే సంచులు మాత్రం ఒక్కో డిపోకు కేవలం 50 చొప్పున అందజేశారు. ఆ సంచుల్లో ఎవరికి ఇవ్వాలో తెలియక డీలర్లు అయోమయంలో ఉన్నారు. క్రిస్మస్ పూర్తయినా అందని సరుకులు ప్రస్తుతం అదికారులు ముందస్తుగా క్రైస్తవ మతస్తులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను క్రిస్మస్ పర్వదినానికి అందజేసేందుకు సిద్ధమయ్యారు. కాగా నేటికీ వేపాడ మండలంలోని చిన్నదుంగాడ,వేపాడ డిపోలకు సరుకుల సరఫరా జరగేదు.మరికొన్ని డిపోల్లో సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ జరగలేదు. లక్కవరపుకోట మండలంలోని 15,834కార్డులు,వేపాడ మండలంలో 14,633కార్డులు ఉన్నాయి. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో శుక్రవారం నాటికి కేవలం 5శాతం మందికి మాత్రమే సరుకులను అందజేశారు. లబ్ధిదారుల్లో అసహనం ప్రభుత్వం అందజేస్తున్న సరుకుల్లో తూకాలు సక్రమంగా లేవని అదికూడా నాసిరకమైన సరుకులు అందజేయడంతో పలువురు లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రచారం తప్ప సరుకుల్లో నాణ్యత లేదని వాపోతున్నారు. ఇచ్చింది గోరంత అయితే ప్రచారం మాత్రం కొండంతగా ఉందని అంటున్నారు. దీపావళికి కేజీ పంచదార అందజేస్తామని ప్రకటించారు. కాగా ఆరకేజీ చొప్పునే అందజేశారని పలువురు వాపోతున్నారు. ఈ విషయమై సీఎస్‌డీటీ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా..సరుకుల కొలతలో తేడాలు వస్తున్నట్లు,నాణ్యత విషయంపై పలువురి దగ్గరనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అంగీకరించారు. ఈ విషయాలను పై అధికారులకు తెలియజేశామని చెప్పారు. మేము చేసిన ప్యాకింగ్‌లు కావు చంద్రన్న కానుకకు సంబంధించిన సరుకులు మేము ప్యాకింగ్ చేయలేదు. ప్యాకింగ్ చేసిన వస్తువులే మాకు అందజేశారు.ఆసరుకులే లబ్ధిదారులకు అందజేస్తున్నాం. తూకంలో కొద్దిపాటి తేడాలు రావడము వాస్తవమే. - ఐ.ముత్యాలు,ఆర్.జి.పేట డీలర్ సరుకులు బాగోలేవు ప్రస్తుతం కోటాలో ఇస్తున్న పండగ సరుకులు బాగోలేవు. బెల్లం,నెయ్యి తూకం వేస్తే తక్కువ వస్తున్నాయి.డీలర్లను అడిగితే వారు ఇచ్చిందే పంచుతున్నామంటున్నారు. -ఆర్.సత్యవతి,శ్రీరాంపురం -
తక్షణం పీఆర్సీ ప్రకటించాలి
సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖామాత్యులు యనమల వాగ్దానం చేశారు. ఒకటి జూలై 2013న ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటికీ ఇవ్వకుండా జాగు చేస్తూ ఉండటంతో అంబరాన్నంటిన ధరలతో సామాన్య ఉద్యో గులు, పెన్షనర్లు ఇక్కట్ల పాలవుతున్నారు. మంత్రిగారు ఆ మాటే మరిచారు. ఉద్యోగ సంఘాల నాయకులు, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నారు గదా మారాడని ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాలతో నమ్మబలికి బాబును అధికారంలోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు మేలు మరచి ఉద్యోగులను పురుగులా చూస్తు న్నారు. చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంది. మళ్లీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందంటూ ఆర్థిక మంత్రి మరో ఉచిత వాగ్దానం చేశారు. మరోసారి పీఆర్సీని వాయిదా వేసినా ఆశ్చర్యం లేదని ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పెట్టడం, చట్టాలు చేయడం వరకే నాయకుల పాత్ర ఉంటుంది. తర్వాత వాటిని అమలుచేయాల్సింది, ప్రభు త్వానికి మంచి పేరు తేవలసింది వీరేనని ప్రభుత్వం గ్రహించాలి. ఇప్పటికే చాలా లేటైంది. ఇక వాయిదాలు ఆపి తక్షణం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణ యం తీసుకోవాలి. వేతన జీవులను ఉసూరు పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. తక్షణం పీఆర్సీ ప్రకటించాలి. - ఎన్.రఘునాథరావు కొత్తపల్లి -
చంద్రన్న గిప్ట్ తంతులో మరో వివాదం
హైదరాబాద్: చంద్రన్న సంక్రాంతి గిప్ట్ తంతులో మరో వివాదం తెర మీదికి వచ్చింది. తాజాగా బెల్లం స్కాం వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి మార్కెట్లో కేజీ బెల్లం గరిష్ట ధర 30 రూపాయిలు ఉండగా, పౌర సరఫరాల శాఖ మాంత్రం కేజీ రూ.54కు టెండర్ ఖరారు చేసింది. కేజీకి రూ.20 అదనంగా చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. టెండర్‌దారులు రిటైల్ మార్కెట్ కంటే అదనపు ధరను దక్కించుకోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ధరను చూసి బెల్లం వ్యాపారులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు చంద్రన్న కానుక అందుకునేందుకు జనాలు రేషన్ షాపులు వద్ద బారులు తీరారు. అయితే సంగమందికే సరిపడా సరుకులు రావటంతో అధికారుల్లో హైరానా మొదలైంది. -
కానుకకు దారేది
గుంటూరు సిటీ: చంద్రన్న సం‘క్రాంతి’ కానుక మసకబారేలా కనిపిస్తోంది. పండుగకు ఇంకా ఏడు రోజులే సమయం ఉన్నా, ఇప్పటికీ సరుకులు రాలేదు. సరుకులు ఉచితంగా రవాణా చేయాలని ప్రభుత్వం ఆదేశించిన కారణంగా కాంట్రాక్టర్ల కినుకతో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ పథకాన్ని బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పేదలకు సంక్రాంతి నాటికి సరుకులందే మార్గం కనిపించడం లేదు. సంక్రాంతికి రాష్ట్రంలోని పేదలందరికీ కానుక అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయానికి సైతం బాలారిష్టాలు తప్పలేదు. ఆయన మనోభీష్టం మేరకు ఉచితంగా ఆరు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజల దరి చేర్చాలని కూడా భావించింది. ఈ మేరకు పది రోజుల ముందే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. 5వ తేదీ నాటికి ఆయా సరుకులన్నీ చౌక డిపోలకు చేరాల్సి ఉంది. అయితే పౌర సరఫరాల శాఖ ఉదాశీనం, ప్రభుత్వాధికారుల అత్యుత్సాహం కారణంగా ఆరవ తేదీ నాటికి కూడా వాటి జాడ లేదు. రూ. 230 విలువ గల కిలో గోధుమ పిండి, కిలో శనగలు, అర కిలో చొప్పున కందిపప్పు, బెల్లం, పామాయిల్, వంద గ్రాముల నెయ్యి ఉచితంగా తెల్ల రేషన్‌కార్డుదారులకు అందించాల్సి ఉంది. ఈ నెల 14వ తేదీ లోపు లబ్ధిదారుల ఇళ్లకు సరుకులు చేరితేనే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరినట్లు లెక్క. జిల్లాలో 12,72,390 తెల్ల కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ 2,173 చౌక డిపోల ద్వారా సంక్రాంతి కానుక చేరాల్సి ఉంది. ఉచితంగా సరుకులను రవాణా చేయాలన్న అధికారుల ఆదేశంతో కాంట్రాక్టర్లు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయానుకూలంగా వ్యవహరిస్తే తప్ప సంక్రాంతి నాటికి చంద్రన్న కానుక పేదలకు అందే సూచనలు దాదాపు లేనట్లేనని పలువురు చౌకడిపో డీలర్లు చెబుతున్నారు. -
సంక్రాంతి కానుక
సాక్షి, చెన్నై: సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో 3.45 కోట్ల మందికి ధోవతులు, చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆదేశించింది. సంక్రాంతి పండగ (పొంగల్)ను పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రతిఏటా కార్డుదారులకు ఉచితంగా ధోవతులు, చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతోంది. కుటుంబ కార్డుదారులతో పాటు పేదలకు వీటిని అందజేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ పండగ సందర్భంగా బియ్యం, చక్కెర లేదా బెల్లం పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది 3.45 కోట్ల మందికి వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పండుగ సమీపిస్తుండడంతో వీటి ఉత్పత్తిని వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 1.52 కోట్ల ధోవతులు సిద్ధమయ్యాయి. 56 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి. మరో వారం, పది రోజుల్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందరికీ పంపిణీ చేస్తాం ఉచిత ధోవతులు, చీరల పంపిణీ గురించి జౌళి, చే నేత శాఖ మంత్రి ఎస్.సుందరరాజ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఏడాది అత్యధిక శాతం మందికి వీటిని పంపిణీ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. చీరలు, ధోవతుల ఉత్పత్తికి నాణ్యమైన నూలును ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. సంక్రాంతి పర్వదినం లోపు ఆయా జిల్లాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాల ద్వారా రేషన్ డీలర్లకు అందజేస్తామని తెలిపారు. పండుగ నాటికి లబ్ధిదారులందరికీ వాటిని పంపిణీ చేస్తామని చెప్పారు. చేనేత ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాది రూ.217 కోట్ల ఉత్పత్తి జరగ్గా, ఈ ఏడాది రూ.246 కోట్ల మేరకు ఉత్పత్తి జరిగిందని వివరించారు. తేని, కన్యాకుమారి, అరంతాంగి, ఎట్టయాపురం, కృష్ణగిరిలోని నూలు ఉత్పత్తి కర్మాగారాల్ని మరింత బలోపేతం చేయనున్నామన్నారు. వీటి అభివృద్ధికి రూ.104 కోట్లు కేటాయించామని చెప్పారు.