హైదరాబాద్: చంద్రన్న సంక్రాంతి గిప్ట్ తంతులో మరో వివాదం తెర మీదికి వచ్చింది. తాజాగా బెల్లం స్కాం వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి మార్కెట్లో కేజీ బెల్లం గరిష్ట ధర 30 రూపాయిలు ఉండగా, పౌర సరఫరాల శాఖ మాంత్రం కేజీ రూ.54కు టెండర్ ఖరారు చేసింది. కేజీకి రూ.20 అదనంగా చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. టెండర్దారులు రిటైల్ మార్కెట్ కంటే అదనపు ధరను దక్కించుకోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ధరను చూసి బెల్లం వ్యాపారులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు చంద్రన్న కానుక అందుకునేందుకు జనాలు రేషన్ షాపులు వద్ద బారులు తీరారు. అయితే సంగమందికే సరిపడా సరుకులు రావటంతో అధికారుల్లో హైరానా మొదలైంది.
చంద్రన్న గిప్ట్ తంతులో మరో వివాదం
Published Mon, Jan 12 2015 12:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM
Advertisement