CHANDRANNA
-
మావోయిస్టు నేత మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మూడు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్ మావోయిస్టు నేత ఒకరు చనిపోయారు. అతడిని మావో డివిజినల్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించారు. ఈయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నాయి. -
మళ్లీ మావోల పాగా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణలో ఎన్నికల బహిష్కరణ నినా దం వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు సమాయత్తమవుతోంది. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణలో పాగా వేసేందుకు సరైన సమయంగా పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి చేరే అవకాశం ఉందని పోలీసులను రాష్ట్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా పేరూరు శివారు కర్రెగుట్ట ప్రాంతంలో బుధవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరగడం గమనార్హం. చంద్రన్న నేతృత్వంలో సాయుధ దళాలు.. రాష్ట్ర విభజనకు ముందు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న నేతృత్వంలో సాయుధ దళాలు మళ్లీ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడిగా, తెలంగాణ ఇన్చార్జ్గా ఉన్న చంద్రన్న.. రాబో యే ఎన్నికలే లక్ష్యంగా భారీ దాడులకు వ్యూహరచనతో తెలంగాణలో ప్రవేశించే క్రమంలో పేరూరు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో 30–40 మంది మావోయిస్టులు ఈ నెల 26న సమావేశమైనట్లు చెబుతున్నారు. బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్‌లతోపాటు ఓగోలపు మల్లయ్య, భద్ద్రు, ముచ్చకి ఉంగల్ (రఘు), కొవ్వాసి గంగ (మహె‹Ù, జనార్దన్), నల్లమారి అశోక్ (విజెందర్), సాంబయ్య (అజాద్), ముస్సాకి దేవల్ (కరుణాకర్), పొడియం కొసయ్య అలియాస్ మాసాలతోపాటు సుమారు 40 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనిపై కచి్చతమైన సమాచారం అందుకున్న ములుగు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలతో 2రోజులు అడవులను జల్లెడ పట్టారు. పేరూరు అటవీ ప్రాంతం కర్రెగుట్ట వద్ద వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పు లు జరగ్గా ఆయుధాలతో మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే పెద్ద మొత్తంలో కిట్ బ్యాగులు, మందులు, బ్యాటరీ చార్జర్లు, వాట ర్ క్యాన్లు, సోలార్ ప్లేట్లు, సుతిలి బాంబులు, పార్టీ సాహిత్యం, వంట సామగ్రి లభ్యం కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అగ్రనేతలు లక్ష్యంగా కూంబింగ్ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మళ్లీ తెలంగాణ సరిహద్దుకు చేరారన్న సమాచారంతో పోలీసులు ఆ పార్టీ సాయు«ధ దళాల కదలికలపై దృష్టి పెట్టారు. ఉత్తర తెలంగాణ నుంచి మొత్తం 82 మంది వివిధ నక్సల్స్ గ్రూపులలో పనిచేస్తుండగా 8 మంది ప్రజాప్రతిఘటన, ఇద్దరు న్యూడెమోక్రసీలలో, మావోయిస్టు పారీ్టలో 72 మంది పనిచేస్తుండగా, 54 మంది ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏవోబీ తదితర ప్రాంతాలలో వివిధ కేడర్లలో ఉన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పనిచేస్తున్న వారిలో 16 మంది పూర్వ వరంగల్‌కు చెందినవారు కాగా, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ (కేకేడబ్ల్యూ), డివిజన్ కమిటీలను ఎత్తేసి ఎన్‌టీఎస్‌జడ్‌సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ)గా మార్చింది. రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతి తర్వాత చంద్రన్న పర్యవేక్షణలో ఆ బాధ్యతలను బడే దామోదర్ చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతోపాటు కంకనాల రాజిరెడ్డి, బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి అలియాస్ ప్రభాత్, మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య తదితర నేతల నిర్బంధం కారణంగా దండకారణ్యానికి మారారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో సాయుధ దళాల రక్షణతో మళ్లీ తెలంగాణలో అడుగిడుతుండగా పోలీసులు ఆ దళాలు లక్ష్యంగా కూంబింగ్ ముమ్మరం చేశాయి. -
కలకలం.. చంద్రన్న అరెస్ట్
ఇల్లెందు : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి పాతూరి ఆదినారాయణ స్వామి అలియాస్ పెద్ద చంద్రన్న, గుంటూరు జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య, మరో నాయకుడు దుర్గాప్రసాద్‌ను గుంటూరులో జంగారెడ్డిగూడెం పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. దీంతో జిల్లాలోని ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఎన్డీ అగ్రనేతల్లో చంద్రన్న ఒక్కరే అజ్ఞాతంలో ఉన్నారు. చంద్రన్న వెంట పార్టీ ఖమ్మం – వరంగల్ ఏరియా కార్యదర్శి అశోక్ సైతం ఉన్నారనే సమాచారంతో పోలీసులు వల విసిరారని, కానీ చంద్రన్న ఒక్కరే పోలీసులకు చిక్కారని ప్రచారం సాగుతోంది.1967 నుంచి అజ్ఞాతంలో ఉంటున్న పెద్ద చంద్రన్నకు ఆదర్శ విప్లవ కమ్యూనిస్టుగా పేరుంది. పార్టీలో నిస్వార్థంగా పని చేసేందుకు తమకు సంతానం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో దంపతులిద్దరూ కు.ని. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. 1967లో ఆవిర్భవించిన సీపీఐ (ఎంఎల్).. గోదావరి పరీవాహక ప్రాంతంలో బలమైన విప్లవ ఉద్యమాన్ని నడుపుతున్న క్రమంలో 1984లో పార్టీలో సైద్ధాంతిక విభేదాల నేపథ్యంలో చీలిక ఏర్పడింది. దీనికి ముందు విప్లవ మేధావి చండ్ర పుల్లారెడ్డి (సీపీరెడ్డి)ని సిద్ధాంతపరంగా ఎదుర్కొన్న వారిలో రాయల సుభాష్‌చంద్రబోస్‌తోపాటు చంద్రన్న కూడా ఉన్నారు. చీలిక అనంతరం ప్రజాపంథాగా ఆవిర్భవించిన పార్టీకి చంద్రన్న, రాయల బోస్, పైలా వాసుదేవరావు నాయకత్వం వహించారు. సీపీ రెడ్డి నేతృత్వంలోని మరో వర్గం విమోచన గ్రూపుగా ఏర్పడింది. ఇందులో కూర రాజన్న, మ«ధు, అమర్, సత్తెన్న, ప్రసాదన్నలు సీపీకి అండగా నిలిచారు. ఇక ప్రజాపంథా కొంత కాలం తర్వాత ఎన్డీగా ఆవతరించింది. ఒక దఫా ఉమ్మడి ఎన్డీకి చంద్రన్న కేంద్ర కమిటీ కార్యదర్శిగా కూడా పని చేశారు. అయితే ఎన్డీలోనూ సిద్ధాంత పర విభేధాలు సంభవించి 2013లో చీలిక ఏర్పడింది. ఈ క్రమంలో పెద్ద చంద్రన్న నాయకత్వంలో ‘ఎన్డీ చంద్రన్న వర్గం’, రాయల బోసు నాయకత్వంలో ‘ఎన్డీ రాయల వర్గం’గా ఏర్పడ్డాయి. చంద్రన్న వర్గానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఇల్లెందుకు చెందిన సాధినేని వెంకటేశ్వరరావు, ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా చంద్రన్న సతీమణి పి.లక్ష్మి(టాన్యా) పని చేసున్నారు. అయితే చీలిక అనంతరం ఎన్డీలోని రెండు వర్గాలు కూడా మరింత క్షీణ దశకు చేరుకున్నాయి. మూడో తరానికి మిగిలింది అశోకే.. ప్రస్తుతం 73 సంవత్సరాల వయసున్న చంద్రన్న దాదాపు 53 ఏళ్లు రహస్య జీవితమే గడిపారు. ఆయన అరెస్ట్‌తో తొలితరం విప్లవకారుల్లో ఇక ఎవరూ అజ్ఞాతంలో లేనట్టే. ఇక మూడో తరం నేతల్లో వరంగల్–ఖమ్మం ఏరియా కార్యదర్శి అశోక్ ఒక్కరే అజ్ఞాతంలో ఉన్నారు. అయితే రెండు జిల్లాల్లో పోలీసుల కూంబింగ్ తీవ్రం కావడంతో వేసవికి ముందే ఆయన ఏపీకి వెళ్లినట్లు ప్రచారం సాగింది. అశోక్ గత కొంత కాలంగా పెద్ద చంద్రన్నతో కలిసి సంచరిస్తున్నారని కూడా వాదనలు వినిపిస్తుండడంతో తెలంగాణ–ఏపీ పోలీసులు అశోక్‌పై దృష్టి సారించారని, ఈ క్రమంలోనే చంద్రన్న చిక్కారని తెలుస్తోంది. అరెస్టు పట్ల పలువురి ఖండన.. ఎన్డీ అఖిల భారత కార్యదర్శి ప్రధాన కార్యదర్శి చంద్రన్నను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్ ఖండించారు. 73 ఏళ్ల వయసులోనూ పీడిత ప్రజల కోసం పోరాడుతున్న చంద్రన్న విప్లవ యో«ధుడని పేర్కొన్నారు. పార్టీ నాయకులు వై.సత్యం, రమేష్, రాసుద్ధీన్, సాంబ, గణేష్ తదితరులు ఆందోళన నిర్వహించారు. కాగా, చంద్రన్న అరెస్టును ఎన్డీ(రాయల) రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు మధు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు చండ్ర అరుణ, ఎన్టీ పట్టణ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎన్. రాజు తదితరులు ఖండించారు. చంద్రనన్ను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇల్లెందులోని పార్టీ కార్యాలయంలో గుమ్మడి నర్సయ్య, మధు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. -
నేడు చంద్రన్న సంస్మరణ
తెలుగునేల మీద అలలు, అలలుగా ఎదిగిన అనేక ప్రజా ఉద్యమాలతో అర్ధ శతాబ్దం పైబడి నడిచిన దళిత సామాజిక ఉద్యమకారులు, నాటి ఇఫ్టూ కార్మిక నాయకులు, 2004లో నాటి ప్రభుత్వంతో విప్లవ పార్టీ తరఫున శాంతి చర్చల ప్రతినిధి, కల్లెపు చంద్రన్న అలియాస్ చర్చల చంద్రన్న అలియాస్ ఐడీపీఎల్ చంద్రన్న ఈ నెల 12న అమరులైనారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు దగ్గర టంగుటూరులో 1945 మే, 15న నిరుపేద దళిత కుటుంబంలో ముత్తమ్మ, ఎల్లయ్యలకు జన్మించిన పెద్దకొడుకు చంద్రన్న. చదువుల కోసం అష్టకష్టాలు పడి జనగామలో పదో తరగతి ముగించుకొని పొట్ట చేతపట్టు కుని సికింద్రాబాద్ చిలకలగూడలోని చింతబాయి బస్తీ చేరిండు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న కాలంలో ఈశ్వరీ బాయిగారి వెంట ఉండి ఆందోళనలో పొల్గొంటూ ఐడీపీఎల్ ఉద్యోగిగా, ప్రాగాటూల్స్, ఆల్విన్, తుంగభద్ర ఇండస్ట్రీస్, బిర్లాప్లాంట్ సహా అనేక ఫ్యాక్టరీలలో విప్లవకార్మిక నాయకుడిగా ఎదిగాడు. దేశం నలు మూలల జాతీయ కార్మిక సంఘాల సభల్లో పాల్గొని, విప్లవ పార్టీ నిర్మాణంలోకి వెళ్ళి అడ్డగుట్ట, పార్సీగుట్ట, జగద్గిర్గుట్ట బతుకమ్మకుంట, భగత్‌సింగ్ నగర్ ఒకటేమిటి మురికివాడల పేదలకోసం, అసంఘటిత కార్మికుల కోసం అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించి జనశక్తి పార్టీ తరఫున 2004లో శాంతి చర్చలో పాల్గొన్న చర్చల చంద్రన్నగా మనకు తెలుసు. ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో బహుజన నాయకత్వం ఎదగాలని రాజకీయ ఆచరణకు శ్రీకారం చుట్టి మాదిగ ఉప కులాల ఫ్రంట్ ఏర్పాటుచేశారు చంద్రన్న. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేసి, అసంఘటిత కార్మిక సంఘాల ఫ్రంట్ నడిపి, తెలంగాణ కోసం పోరా డిన యోధులకు ఒక సంఘం ఉండా లని ‘తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం’ నడిపిన చంద్రన్నను స్మరించుకోవడం మన బాధ్యత. సంస్మరణ సభకు జెండా మనమే, ఎజెండా మనమే. నిన్న అంతిమ యాత్రలో కదిలింది మనమే, సంస్మరణ సభలో కదం తొక్కాల్సింది మనమే. జనం కొరకు నిలబడ్డ యోధుడు ‘అన్సంగ్ హీరో’గా కాల గర్భంలో కలిసిపోవద్దు. మన యోధుల చరిత్ర మనమే ఎత్తి పట్టాలి. ఈ సంస్మరణ సభను ఇంటి పార్టీ సమన్వయం చేస్తున్నది. చంద్రన్న అందరివాడు... సభను జయప్రధం చేద్దాం. (నేటి సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లెపు చంద్రన్న సంస్మరణ సభ) -పోతిరెడ్డిపల్లి రామన్న మాదిగ, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర సెక్రటరీ మొబైల్ : 90006 00744 -
జనశక్తి మాజీ నేత చంద్రన్న మృతి
ముషీరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన చర్చల్లో జనశక్తి పక్షాన ప్రతినిధిగా పాల్గొన్న జనశక్తి మాజీ నేత కె.చంద్రన్న (75) గురువారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. కొంతకాలంగా మధుమేహం, శ్వాసకోశ వ్యాధులతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల విద్యానగర్‌లోని ఆంధ్ర మహాసభ ఆస్పతిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. యాదాద్రి జిల్లా టంగుటూర్ గ్రామానికి చెందిన చంద్రన్న ఈసీఐఎల్ ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగం చేసే సమయంలో విప్లవ కార్మిక సంఘాలతో పరిచయం ఏర్పడి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఇఫ్టో), జనశక్తిల రాష్ట్రస్థాయి నేతగా ఎది గారు. బీడీ, సింగరేణి కార్మికుల అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాంనగర్‌లోని స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతి పట్ల న్యూడెమోక్రసీ తీవ్ర సంతాపం ప్రకటించింది. -
‘హిందుత్వ ప్రచారంతోనే బీజేపీ గెలుపు’
సాక్షి, హైదరాబాద్: దేశభక్తి ఉన్మాదం, కార్పొరేట్ సహకారం, హిందుత్వ ప్రచారపు పరాకాష్టతో బీజేపీ మరోసారి గెలుపొందిందని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ఒక ప్రకటనలో విమర్శించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాల నిర్వహణ, ఐక్యంగా ప్రతిఘటించడంలోనూ ప్రతిపక్షాలు విఫలం అయ్యాయని పేర్కొన్నారు. 2014 మేనిఫెస్టో అమల్లో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. విపక్షాల ఓట్లను లక్షల సంఖ్యలో తొలగించడం వంటి వ్యవహారాలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సగం స్థానాలే సాధించిందని చంద్రన్న వివరించారు. -
గోల్మాల్
ఇది చంద్రన్న విలేజ్ మాల్స్‌లో లభిస్తున్న బెల్లం. కేవలం 450 గ్రాముల నల్లటి బెల్లం ఎంఆర్పీ ఏకంగా రూ.42 ఉంది. దీన్ని ఆఫర్ కింద రూ.37కు అమ్ముతున్నారు. అదే బహిరంగ మార్కెట్లో మొదటి రకం బెల్లం కిలో రూ.48కే లభిస్తోంది. ఒక్క బెల్లమే కాదు.. చింతపండు, ఇతర నిత్యావసర వస్తువులదీ ఇదే పరిస్థితి. కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 54 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. డీలర్లు ముందుకు రాకపోవడంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాల్ ఏర్పాటు చేయాలంటే డీలరుకు 200 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన షాపు ఉండాలి. అది కూడా రోడ్డుకు వంద మీటర్లలోపు ఉండాలి. ఇప్పటివరకు అతికష్టం మీద ఆరు మాల్స్ ఏర్పాటు చేశారు. వీటిని కర్నూలు, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆలూరు, పాణ్యం, కోడుమూరులో ప్రారంభించారు. ఇవి కూడా వినియోగదారులు రాక వెలవెలబోతున్నాయి. ఈ మాల్స్‌కు రిలయన్స్ సంస్థ సరుకులు సరఫరా చేస్తోంది. నాణ్యమైన నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువులనూ మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే..వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మాల్స్‌కు సరఫరా అవుతున్న సరుకుల్లో కొన్ని నాణ్యతగా ఉండడం లేదు. ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మరీముఖ్యంగా బెల్లం, చింతపండు, శనగపప్పు, మినపపప్పు, చక్కెర, పామోలిన్ ప్యాకెట్లు తదితర వస్తువుల నాణ్యత, ధరల పట్ల వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. నాణ్యత బాగుంటే ఒకటి, రెండు రూపాయలు ఎక్కువ ఉన్నా తీసుకుంటారు. అయితే.. సరుకులు నాసిరకంగా ఉండడం, ధర కూడా ఎక్కువ కావడంతో వినియోగదారులు మాల్స్ వైపు వెళ్లడం లేదు. దీంతో డీలర్లు వాటిని మూసి ఉంచుతున్నారు. ఊరించి నష్టాల ఊబిలోకి.. చంద్రన్న విలేజ్ మాల్స్‌ను నిర్వహించే డీలర్లకు సరుకుల అమ్మకాలపై ఎనిమిది శాతం కమీషన్ ఇస్తామని మొదట్లో ఊరించారు. షాపును మాల్గా తీర్చిదిద్దేందుకు అయ్యే ఖర్చును వంద శాతం భరిస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేవలం మూడు శాతం కమీషన్‌తో సరిపుచ్చుతున్నారు. కర్నూలు ప్రకాశ్‌నగర్‌లోని రేషన్‌షాపు నంబరు 50లో చంద్రన్న విలేజ్ మాల్‌ను మూడు నెలల క్రితం ఏర్పాటు చేశారు. దీన్ని డిజైన్ చేసిన వ్యయంలో 50 శాతం మొత్తాన్ని ఎనిమిది శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని రిలయన్స్ సంస్థ ఒత్తిడి తెస్తోంది. డీలర్‌కు ఎనిమిది శాతం కమీషన్ ఇస్తామని మభ్యపెట్టి మూడు శాతంతో సరిపుచ్చుతోంది. పైగా బయటి మార్కెట్ కంటే తక్కువ ధర ఉండి.. డిమాండ్ ఉన్న వస్తువులను సరఫరా చేయడం లేదు. నాణ్యత లేని, అధిక ధరలు ఉన్న సరుకులను మాత్రమే సరఫరా చేస్తోందని డీలర్లు వాపోతున్నారు. ఇదెలా సాధ్యమో? చంద్రన్న విలేజ్‌మాల్‌కు సరఫరా చేసే 25 గ్రాముల సబ్బు ఎంఆర్పీ రూ.5గా నిర్ణయించారు. దీన్ని ఆఫర్ కింద రూ.4.70కి విక్రయించాల్సి ఉంది. డీలరుకు వేస్తున్న ధర రూ.5.40. పైగా నెలకు రూ.2 లక్షల విలువైన వస్తువులను సరఫరా చేస్తామని చెప్పిన రిలయన్స్ సంస్థ అడ్డగోలుగా ధరలు పెంచి తూతూ మంత్రంగా సరుకులు ఇస్తోంది. నిర్వహణ భారంగా మారింది షాపు డిజైన్ చేసిన ఖర్చు మొత్తం భరిస్తామని మొదట్లో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మొత్తం ఖర్చులో 50శాతం 8శాతం వడ్డీతో చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. 8శాతం కమీషన్ ఇస్తామని చెప్పి 3శాతం మాత్రమే ఇస్తున్నారు. మార్చిలో రూ.1,193, ఏప్రిల్‌లో రూ.3,002 మాత్రమే కమీషన్ వచ్చింది. కరెంటు బిల్లు రూ.800 దాకా వస్తోంది. షాపును శుభ్రం చేయడానికి రూ.1,200 ఇవ్వాల్సి వస్తోంది. కమీషన్ ఏ మూలకూ చాలడం లేదు. పైగా డిమాండ్ ఉన్న వస్తువులు సరఫరా చేయరు. డిమాండ్ లేని సరుకులు మాత్రం అడగకపోయినా ఇస్తున్నారు. ఇలాగైతే ఈ మాల్‌ను నిర్వహించడం కష్టం. – కరుణాకర్గుప్త, 50వ షాపు డీలర్, కర్నూలు -
ఎట్టకేలకు పెళ్లికానుక
విజయనగరం అర్బన్ : నిరుపేద వర్గాలకు చెందిన మహిళల వివాహానికి భరోసా కల్పిస్తామంటూ జనవరిలో ప్రకటించిన ‘చంద్రన్న పెళ్లి కానుక’ ఎట్టకేలకు ప్రభుత్వం శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో లబ్ధిదారులకు సహాయం అందేలా కార్యాచరణ చేపడుతున్నట్టు అప్పట్లో ప్రకిటించింది. పెళ్లిళ్లు సీజన్ పూర్తయినంత వరకు దాని ప్రస్తావనే లేదు. దీంతో ఈ పథకం అమలుపై పలు అనుమానాలు రేగాయి. పథకానికి సంబంధించి జీవో నంబబర్ 45ని గురువారం ప్రభుత్వం జారీచేసి శుక్రవారం నుంచి లాంఛనంగా అమల్లోకి తెచ్చింది. పెళ్లిళ్ల సీజన్ దాదాపు చివరిదశకు చేరిన తరువాత ఇప్పుడు ప్రారంభించిన ఈ పథకం ప్రయోజనం పొందినవారు అల్పసంఖ్యలోనే ఉంటారని తెలుస్తోంది. ‘విజయనగరం మండలం జొన్నవలసకు చెందిన లెంక అప్పలస్వామి కుమార్తె సత్యవతికి ‘చంద్రన్న పెళ్లికానుక’ వర్తించే అర్హత ఉంది. జనవరిలో ప్రభుత్వం ప్రకటన చూసి పెళ్లి ఆర్థిక భారం తగ్గుతుందని సంబరపడ్డారు. ఫిబ్రవరిలో పథకం అమలు అవుతుందని మార్చి నెలలో మూహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి నాటికి అమలు కాకపోవడంతో అప్పుచేసి పెళ్లి చేశారు’. అప్పలస్వామి లాగానే వెళ్లికానుక ప్రోత్సాహంపై ఆశపడి పెళ్లినిర్ణయించుకొని అప్పులు పాలయిన వారు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది ఉండడం గమనార్హం. అర్హులు వీరే.... పెళ్లి చేసుకునే మహిళ వయసు 20, వరుడి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చంద్రన్న పెళ్లికానుక వర్తిస్తుంది. ప్రోత్సాహం ఇలా... కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీ, ఎస్టీలకు రూ.75 వేలు, బీసీలకు రూ.50 వేలు, దివ్యాంగులకు రూ.లక్ష చెల్లిస్తారు. చంద్రన్న పెళ్లి కానుకలో ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు, మైనారిటీ ముస్లింలకు దుల్హన్ పథకం కింద రూ.50 వేలు అందజేస్తారు. భవన నిర్మాణ కార్మికుల మండలిలో సభ్యులుగా చేరిన కార్మికులకు కూడా వివాహ ప్రోత్సాహనగదును అందజేస్తారు. ఎస్టీలు, మైనారిటీలకు రూ.50 వేలు, ఎస్సీలకు రూ.40 వేలు, బీసీలకు రూ.35 వేలు, ఓసీలకు రూ.20 వేలు చొప్పున అందజేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు.. వివాహం చేసుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానిని ఆధార్ నంబరుతో చేయవచ్చు. దానికి అనుసంధానం చేయకపోతే 1100 పరిష్కార వేదిక, మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. దీని కోసం జిల్లాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ‘డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.సీహెచ్పీకే.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయి. దానిలో మాత్రమే దరఖాస్తుల చేసుకోవాలి. బాల్యవివాహాల నియంత్రణకు మంచి అవకాశం బాల్య వివాహాల నియంత్రణకు చంద్రన్న పెళ్లికానుక అద్భుత అవకాశమని కలెక్టర్ వివేక్‌యాదవ్ అన్నారు. స్థానిక మహిళా ప్రాంగణలో శుక్రవారం చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చంద్రన్న పెళ్లి కానుక వధూవరుల రిజస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. నమోదయిన లబ్ధిదారులకు వారం రోజుల్లోగా వివాహ ధ్రువపత్రాన్ని అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సుబ్బారావు, మెప్మా పీడీ లకు‡్ష్మనాయుడు, ఏపీడీ మురళి, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, కళ్యాణ మిత్రలు పాల్గొన్నారు. 121 మంది కల్యాణ మిత్రల ఎంపిక.... జిల్లాలో చంద్రన్న పెళ్లికానుకను రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ (సెర్ప్) పర్యవేక్షిస్తుంది. పదోతరగతి విద్యార్హత గల స్వయం సహాయక సంఘ మహిళలను కళ్యాణ మిత్రలుగా ఎంపిక చేశారు. మండలానికి ఒక రిజర్వడ్తో కలిసి ముగ్గురు వంతున 112 మంది, ఐదు మున్సిపాలిటీల్లోని 19 మంది కలిపి జిల్లాలో మొత్తం 121 మందిని ఎంపిక చేశారు. కళ్యాణ మిత్రలు ఎవరైనా సెలవు పెడితే రిజర్వు కళ్యాణ మిత్రలు విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు జిల్లాలోని 923 పంచాయతీలకు చెందిన 923 మంది వీఏఓలకు శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్లో వివాహం చేసుకునే వారు తమ వివరాలను నమోదు చేసుకున్న తర్వాత వివరాలను సేకరించేందుకు కళ్యాణ మిత్రలు క్షేత్ర సందర్శనలు చేయాల్సి ఉంటుంది. -
పెళ్లి కానుకేదీ!
ఏలూరు (మెట్రో): చంద్రన్న పెళ్లికానుక.. పథకంపై సర్కారు కినుక వహించింది. ఈ పథకాన్ని ప్రకటించి నెలలు కావస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా సంది గ్ధం నెలకొంది. పేదకుటుంబాల్లోని యువతుల వివాహం వారి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనికి చంద్రన్న పెళ్లికానుకగా నామకరణ చేసింది. కానుక ఇలా పెళ్లికానుకగా.. బీసీ, మైనారిటీలకు రూ.35 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, కాపులకు రూ.30 వేలు పెళ్లి పందిట్లోనే ఇవ్వాలని నిర్ణయించింది. 7 నెలల కిందటే దీనిని ప్రకటించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పథకం పట్టాలెక్కుతుందని చెప్పింది. అయినా ఇప్పటికీ స్పష్టమైన విధివిధానాలు ఖరారు కాలేదు. పెళ్లిళ్ల జోరు ప్రస్తుతం పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి. దీంతో పెదిళ్లలో చంద్రన్న పెళ్లికానుకపై అయోమయం నెలకొంది. దరఖాస్తు, లబ్ధి కోసం పేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పష్టత రావడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచే వివాహాల సందడి మొదలైంది. మార్చి నెలాఖరు వరకూ పెళ్లిళ్లు జరగనున్నాయి. కల్యాణ మిత్రల ఎంపికకే పరిమితం చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని అమలు చేసేందుకు మండలానికి ముగ్గురు చొప్పున కల్యాణ మిత్రలను నియమించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలను ఎంపిక చేశారు. ఆయా మండలాల పరిధిలో ముగ్గురుని ఎంపిక చేసి వారిలో ఇద్దరిని శాశ్వతంగా.. మరొకరిని అదనంగా నియమించారు. వీరిలో శాశ్వతంగా నియమించిన వారికి మండలంలోని పంచాయతీలను సమానంగా కేటాయిస్తారు. ఏ పంచాయతీలో కల్యాణమిత్ర పనిచేయకుంటే అక్కడ అదనంగా ఏర్పాటు చేసిన కల్యాణమిత్రకు ఆ వివాహ బాధ్యతను అప్పగిస్తారు. ఈ విధంగా జిల్లాలో 48 మండలాల్లో 144 మందిని ఎంపిక చేశారు. వీరికి గౌరవ వేతనంగా ఒక్క పెళ్లికి రూ.300 చొప్పున నిర్ణయించారు. అదే పెళ్లి రాత్రి సమయాల్లో నిర్వహిస్తే ఆ పెళ్లికి వెళ్లేందుకు రూ.500 కల్యాణమిత్రకు అందించనున్నారు. అయినా ఎదురుచూపులకే పథకం పరిమితమైంది. గత రెండు రోజులుగా అంటే ఈనెల 16, 17 తేదీల్లో ఎంపిక చేసిన కల్యాణ మిత్రలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో పెళ్లి జంటలను ఏ విధంగా గుర్తించాలి, ధరఖాస్తులను ఏవిధంగా అప్లోడ్ చేయాలనే వాటిపై శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే 246 జంటలు జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇప్పటి వరకూ 246 జంటలు ఒక్కటయ్యాయని తెలుస్తోది. ఈ పెళ్లిళ్లల్లో సుమారు 200 జంటలు పేద వర్గాల వారే ఉన్నట్లు అంచనా. అయితే వీరందరూ చంద్రన్న పెళ్లి కానుకను కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఉద్దేశం ఇదీ.. ప్రధానంగా బాల్యవివాహాలను అరికట్టేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో లబ్ధిపొందాలంటే వధువుకు 18, వరునికి 21 సంవత్సరాలు నిండడం తప్పనిసరి. ఆధార్‌కార్డును ఈ వివరాల కోసం పరిగణలోకి తీసుకుంటారు. బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయడం ద్వారా పెళ్లికానుక లబ్ధిదారుల ఖాతాలోకి చేరుతుంది. ఇప్పటి వరకూ ప్రతి వివాహాన్ని రిజస్ట్రేషన్ చేయించాలన్న ఆదేశాలు అమలు కావడం లేదు. తాజాగా చంద్రన్న పెళ్లికానుక పొందాలంటే తప్పక పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కావాలి. 2019వ సంవత్సరం నుంచి పదోతరగతి కూడా వధూవరులు పూర్తి చేయాలనేది నిబంధనగా విధించారు. దీనివల్ల అక్షరాస్యత పెరుగుతుందనేది ప్రభుత్వ వాదన. అయితే ఇంతటి కీలకమైన పథకం అమలులో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. త్వరగా ఈ పథకం అమలు చేయాలని పేదలు కోరుతున్నారు. శిక్షణ పూర్తి చేశాం ఇప్పటికే కల్యాణమిత్రల ఎంపిక పూర్తి చేశాం. ఎంపికైన వారికి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చాం. వీరికి డివైజ్‌లు అందించాం. పథకం ఎప్పటి నుంచి అమలు చేయాలో ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తారని సమాచారం. ప్రభుత్వం పథకం ఆచరణలో పెట్టాలని ఆదేశించిన మరుక్షణం జిల్లాలో అమలుకు సిద్ధంగా ఉన్నాం. కె.శ్రీనివాసులు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ -
మాల్స్‌కు ‘చంద్ర’ గ్రహణం!
సాక్షి,విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన చంద్రన్న మాల్స్‌కు గ్రహణం పట్టింది. తగినంత ఆదాయం రాదని భావిస్తున్న డీలర్లు వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదో విధంగా మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. స్పందన నిల్ జిల్లాలో 2,229 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. చంద్రన్న మాల్స్ వల్ల ఆదాయం బాగా ఉంటుందని డీలర్లు భావిస్తే.. ఇప్పటికే ఈ 2,229 మంది డీలర్లు తమకు చంద్రన్న మాల్ ఇప్పించాలంటూ దరఖాస్తు చేసుకునే వారు. డిమాండ్‌ను బట్టి ప్రజాప్రతినిధుల చేత అధికారులుపై ఒత్తిడి చేయించేవారు. వాటికి అంత సీను లేకపోవడంతో అధికారులే రంగంలోకి దిగి డీలర్ల చేత మాల్స్ పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలోని డీలర్ల అందరితోనూ పౌరసరఫరాలశాఖాధికారులు సమావేశాలు పెట్టి మాల్ ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనాలను ఏకరువు పెట్టారు. మాల్స్ పెట్టుకోవాలంటూ ప్రోత్సహించినా ఇప్పటివరకు 160 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 10 మండలాల నుంచి కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని సమాచారం. కనీసం రెండు దుకాణాలు విజయవాడలో రెండు నెలల కిందట మాల్ ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల మాల్స్ ఏర్పాటు చేయించాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకొక్క నియోజకవర్గంలో కనీసం రెండు దుకాణాలు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుచేయించేందుకు కసరత్తు జరుగుతోంది. రెండవ విడతలో విజయవాడలో మూడు, ఆగిరిపల్లి, కలిదిండి, జీ.కొండూరులలో ఒకొక్కటి చొప్పున ఏర్పాటు చేయిస్తున్నారు. వీటిని మరో పక్షం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. దుకాణం చూపిస్తే... డీలర్లు 180 అడుగులు నుంచి 200 అడుగుల దుకాణం చూపిస్తే చాలు.. రిలయన్స్ సంస్థ ఆ దుకాణానికి టైల్స్ ఫ్లోరింగ్, సీలింగ్, ఎలక్ట్రిఫికేషన్, ర్యాక్స్ సమకూర్చుతుంది. ఇందులో విక్రయిం చేందుకు రూ.2లక్షలు సరుకు ఇస్తుంది. చౌకధరల దుకాణం ద్వారా విక్రయించే బియ్యాన్ని, ఇతర వస్తువులు డీలర్ విక్రయించుకోవచ్చు. డీలర్‌కు 8శాతం కమీషన్ ఇస్తారు. ఒకొక్క దుకాణం ఏర్పాటుకు కనీసం 25 రోజులు వ్యవధి పడుతుంది. ప్రతి రెండు మూడు రోజులకు విక్రయించిన సొమ్మును రిలయన్స్ సంస్థకు జమచేయాలి. నెల గడిచిన తరువాత కమీషన్ డీలర్ అకౌంట్‌కు వస్తుంది. ప్రతిబంధకాలు ఇవే.. నగరం, పట్టణాలలోనూ 200 అడుగుల దుకాణం దొరకడం కష్టంగా వుంది. కనీసం రూ. 7 నుంచి రూ.10వేలు అద్దె చెల్లిస్తేనే అంత దుకాణం దొరుకుతుంది. డీలర్ రోజంతా దుకాణంలో కూర్చుని బేరం చూసుకోవాల్సి ఉంటుంది. 8శాతం మాత్రమే కమీషన్ ఇస్తున్నందున నెలకు కనీసం 2.5 లక్షల అమ్మితే రూ.20వేలు ఆదాయం వస్తుంది. అందులోనే దుకాణం అద్దె, కరెంటు బిల్లులు, డీలర్ జీతం చూసుకోవాల్సి ఉంటుంది. నగరాల్లో నెలకు రూ.2.5 లక్షలు అమ్మినా వచ్చే కమీషన్ సరిపోదు. గ్రామాల్లో ప్రతినెల రూ.2.5లక్షలు అమ్మడం కష్టమని డీలర్లు వాపోతున్నారు. అందువల్ల కమీషన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రిటైల్స్ దుకాణాలతో పోల్చితే మాల్స్‌లో ధరలు ఎక్కువగా వుండటంతో ఎక్కువ మొత్తంలో విక్రయించడం కష్టమని అంటున్నారు. చౌకధరల దుకాణాలు నిర్వహించుకుంటే నెలకు 15 రోజులే పని ఉంటుంది. తరువాత ఖాళీయే కావడంతో ఇతర వనరుల ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు. మాల్స్‌లో ఈ సౌకర్యం లేకపోవడంతో డీలర్లు ఆసక్తి చూపడం లేదు. అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయిస్తాం 16 నియోజకవర్గాల్లోనూ 32 చంద్రన్న మాల్స్ పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే డీలర్లతో సమావేశాలు పెట్టాం. మాల్స్ పెట్టమని ఒత్తిడి చేయడం లేదు. అవగాహన కల్పిస్తున్నాం. డీలర్లు ఎంత కష్టపడి పనిచేసుకుంటే అంత ఆదాయం వస్తుంది. పెట్టుబడి అవసరం లేదు. కేవలం దుకాణం ఉంటే చాలని చెబుతున్నాం. –నాగేశ్వరరావుజిల్లా పౌరసరఫరాలశాఖాధికారి -
రైతును కొట్టి చంపిన ఎన్డీ చంద్రన్న వర్గం
పాల్వంచ రూరల్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన సాయుధ నక్సల్స్ ఓ రైతును కొట్టి చంపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నర్సంపేటలో బుధవారం జరిగింది. నర్సంపేటకు చెందిన రైతు, టీడీపీ నేత రాయల భాస్కర్‌రావు (53) బుధవారం ఉదయం తన ఇంటి బయట ఉండగా నాలుగు వైపుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి చుట్టుముట్టారు. అనుమా నం వచ్చిన భాస్కర్‌రావు ఇంట్లోకి పరుగెత్తాడు. ఆ సమయంలో 20 మంది సాయుధులు వచ్చి భాస్కర్‌రావును పట్టుకున్నారు. సమీపంలోని జామాయిల్ తోటలోకి భాస్కర్‌రావును ఈడ్చు కుంటూ తీసుకెళ్లి ఛాతీపై తీవ్రంగా కొట్టారు. అడ్డుకోబోయిన ఇద్దరు గ్రామస్తులను సైతం చితకబాదారు. ఛాతీ భాగంలో దెబ్బలు తగిలి భాస్కర్‌రావు మృతిచెందాడు. -
కార్మికుల సంక్షేమానికి తూట్లు
చంద్రన్న బీమాకు నిధుల మళ్లింపు బాబు తీరుపై నేడు ‘చలో కలెక్టరేట్’కు కార్మిక సంఘాల పిలుపు కపిలేశ్వరపురం (మండపేట) : ఆయనో మాటల మాంత్రికుడు..చేసేవన్నీ పాత పనులే అయినా కొత్తవని చెప్పేందుకు తాపత్రయపడతాడు. అందుకు తన అనుభవాన్నంతా రంగరించి కొత్త పథకాలను తయారు చేస్తాడు. దానికి తన పేరు జోడించుకుని ప్రచారం ఊదరకొడతాడు.. అలా పుట్టుకొచ్చిందే చంద్రన్న బీమా పథకం...దీని ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ములు ప్రభుత్వం కొత్తగా కేటాయించిన సొమ్ములు కావు. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డువి. బోర్డు నిధులు ఆ కార్మికులు కోసం మాత్రమే ఖర్చు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం పక్కనపెట్టి నిధులను మళ్లింపునకు పాల్పడ్డాడు. ఇదేం ఘోరమంటూ భవన నిర్మాణ కార్మికులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో జీపు జాతా నిర్వహిస్తూ ప్రభుత్వం మోసకారితనాన్ని ఎండగడుతున్నారు. కార్మికులంతా సోమవారం ఛలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు. భవనం నిర్మాణానికి మట్టి తీసే కూలి నుంచి పూర్తయ్యాకా రంగు వేసే కార్మికుని వరకూ గల 33 రకాలు పనివారు భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి వస్తారు. జిల్లాలో ఈ పనివారు సుమారు ఐదు లక్షలు మంది ఉన్నారు. అత్యధికంగా తాపీ, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, రాడ్ బెండింగ్, టైల్స్, మార్బుల్ పనివారు, కూలీలు ఉంటారు. వీరి సంక్షేమం కోసం కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పలు విధాల ఆదుకునే ఏర్పాటు చట్టం కల్పించింది. సంక్షేమ బోర్డు నిధులు మళ్లింపు ఇలా.. 318/2011 నంబరుగల కేసులో 2013 నంబరులో సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని తీర్పు చెప్పింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు తగిన ఉత్తర్వులు కూడా అందాయి. రాష్ట్ర ప్రభుత్వం 2015లో ట్రాన్స్‌పోర్టు బీమా కోసం రూ.71 కోట్లను, చంద్రన్న బీమా పేరుతో రూ.241 కోట్లను ఇన్సూరెన్స్æ కంపెనీకి చెల్లించింది. చంద్రన్న బీమా పథకం ప్రచారానికి రూ.31 కోట్లు ఖర్చు చేసింది. చలివేంద్రాలు పేరుతో రూ.20 కోట్లు ఆస్పత్రుల్లో డెలివరీ కిట్లు పేరుతో మరో రూ. 20 కోట్లు మళ్లించింది. రూ.1300 కోట్ల సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం ఖజానా పీడీ అకౌంట్‌కు మళ్లించేందుకు ప్రయత్నం జరుగుతుందంటూ సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రన్న బీమా సంగతి ఇదీ.. సంక్షేమ బోర్డు చట్టపరిధిలోనిది కావడంతో శాశ్వత ప్రయోజనాలను కార్మికులు పొందే వీలుంటుంది.. చంద్రన్న బీమా కేవలం ఓ పథకం మాత్రమే. అందుకే చంద్రన్న బీమా పేరుతో సంక్షేమ బోర్డును తమకు దూరం చేయవద్దంటూ కార్మికులు ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. అందుకు వారు చెప్పే వివరాలు ఇలా ఉన్నాయి...2016 అక్టోబరు రెండున ప్రారంభమైన చంద్రన్న బీమా పథకం అమలుతో భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం ప్రారంభం కారణంగా సంక్షేమ బోర్డులో నుంచి ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత అంగవైకల్యాలకు సాయమందించడం తొలగించి చంద్రన్న బీమా పథకం ద్వారా క్లెయిం చేసుకోమని మెమో 3549ను జారీ చేశారు. సంక్షేమ బోర్డులో సహజ మరణానికి రూ.80 వేలు పొందే వీలు కాస్తా చంద్రన్న బీమా రూ.30 వేలుకు తగ్గిపోతుంది. రూ.50 వేలు నష్టపోతున్నాడు. సంక్షేమ బోర్డులో శాశ్వత అంగ వైకల్యానికి రూ.ఐదు లక్షలు వరకూ అందే సాయం కాస్తా ఈ బీమాలో రూ.3,62,500 మాత్రమే అందుకుంటాడు. అధికారుల నిర్లక్ష్యం పథకాల లబ్దికి కార్మికుడు ఉన్న సమీపంలోని లేబర్ కార్యాలయంలో తన పేరుతును నమోదు చేయించుకుని గుర్తింపు కార్డు పొందాలి . దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోగా గుర్తింపుకార్డు ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఆరేడు నెలలకు కానీ కార్డు రాని పరిస్థితి. కాన్పు ఖర్చులు పొందేందుకు బర్త్ సర్టిఫికెట్ జత చేయాలంటూ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న వాదన ఉంది. సమరానికి సన్నద్ధం సీఈటీయూ అనుబంధ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుంచి జీపు జాతాను నిర్వహిస్తూ ప్రజా వ్యతిరేక చంద్రబాబు విధానాలపై ప్రచారం చేస్తున్నారు. సోమవారం చలో కాకినాడ పేరుతో కలెక్టరు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని రూపొందించారు. కార్మికుల డిమాండ్లు ఇవే.. చంద్రన్న బీమా పథకానికి మళ్లించిన రూ.241 కోట్లను సంక్షేమ బోర్డుకు తిరిగి చెల్లించాలి. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలి. 60 ఏళ్లు నిండిన కార్మికునికి రూ.మూడు వేలు గ్యారంటీ పింఛను ఇవ్వాలి. ఈఎస్ఐ, గృహ నిర్మాణ రుణాలను అందజేయాలి. పెద్ద నోట్లు సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ. పదివేల చొప్పున సంక్షేమ బోర్డు నిధుల్లోంచి అందజేయాలి. జాతీయ కార్మిక సంఘాల దృష్టికి తీసుకెళ్తాం చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలను జాతీయ కార్మిక సంఘాల దృష్టికి తీసుకెళ్తాం. వారితో ఉమ్మడి కార్యాచరణ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చే ఆలోచన చేస్తున్నాం. సోమవారం నిర్వహించే చలో కలెక్టరేట్‌కు కార్మికులను సన్నద్ధం చేస్తున్నాం. - చెక్కల రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ -
అభాసుపాలైన సంక్రాంతి చంద్రన్న కానుక
-
జిల్లాలో 3.77 లక్షల మందికి చంద్రన్నబీమా
మెప్మా ఏడీఎంసీ మోహన్ కుమార్ పిఠాపురం : జిల్లాలో 3.77 లక్షల మందికి చంద్రన్న బీమా కల్పించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచినట్టు మెప్మా ఏడీఎంసీ కె.మోహన్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో బీమా రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 576 చంద్రన్న బీమా క్లెయిమ్‌లు నమోదు కాగా 441 క్లెయిమ్‌లు ఎల్ఐసీకి అప్పగించామన్నారు. వీటిలో 331 మందికి సొమ్ములు అందజేసినట్లు ఆయన తెలిపారు. జనవరి 31 నుంచి లబ్ధిదారుల ఎంపిక నిలిపివేశామన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులు ఎవరైనా మృతి చెందితే 48 గంటలలోపు సంబంధిత కార్యాలయంలో మరణ వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. అలా కాకుండా ఆలస్యం అయితే క్లెయిమ్‌లు రావడం ఆలస్యం అవుతుందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే నియమించిన బీమామిత్రల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. అభయహస్తం పథకంలో గతంలో ఇచ్చే దహన సంస్కార ఖర్చులు రూ.5 వేలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అభయహస్తం లబ్ధిదారులు రూ.385 చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు అభయహస్తంలో 2,61,600 మంది ఉండగా విద్యార్థులకు రూ.1200 చొప్పున స్కాలర్షిప్పులు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 2440 విద్యార్థులకు రూ.29,28,000 స్కాలర్షిప్పులు ఇస్తున్నామన్నారు. -
‘కానుక’ బెల్లంలో పురుగులు
కొవ్వూరు : క్రిస్మస్, సంక్రాంతికి అందించే చంద్రన్న కానుకల్లో నాణ్యత లేదని పదేపదే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మ కు నిరెత్తి్తనట్టు వ్యవహరిస్తోంది. గతనెలలో క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన కానుక సరుకుల్లో నాణ్యత లేదని నాసిరకం బెల్లం పంపిణీ చేశారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో సం క్రాంతి కానుకల్లో అదే పరిస్థితి కొనసాగుతుండటంపై రేషన్ లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రులు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో షాప్ నెం.5 లో సంక్రాంతి చంద్రన్న కానుకలో భాగంగా పంపిణీ చేసిన బెల్లంలో పురుగులు, నల్లమట్టి ఉండటంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. కార్దుదారులు వెంటనే సంబంధిత డీలర్‌కు బెల్లం తిరిగి ఇచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై డీలర్ అధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఈ బెల్లాన్ని తీసుకుని కొత్త బెల్లాన్ని అందించినట్టు సమాచారం -
‘కానుక’ బెల్లంలో పురుగులు
కొవ్వూరు : క్రిస్మస్, సంక్రాంతికి అందించే చంద్రన్న కానుకల్లో నాణ్యత లేదని పదేపదే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మ కు నిరెత్తి్తనట్టు వ్యవహరిస్తోంది. గతనెలలో క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన కానుక సరుకుల్లో నాణ్యత లేదని నాసిరకం బెల్లం పంపిణీ చేశారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో సం క్రాంతి కానుకల్లో అదే పరిస్థితి కొనసాగుతుండటంపై రేష¯ŒS లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రులు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో షాప్ నెం.5 లో సంక్రాంతి చంద్రన్న కానుకలో భాగంగా పంపిణీ చేసిన »ñ ల్లంలో పురుగులు, నల్లమట్టి ఉండటంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. కార్దుదారులు వెంటనే సంబంధిత డీలర్‌కు బెల్లం తిరిగి ఇచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై డీలర్ అధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఈ బెల్లాన్ని తీసుకుని కొత్త బెల్లాన్ని అందించినట్టు సమాచారం -
చంద్రన్న కానుకలో గుట్కా ప్యాకెట్లు
-
రాష్ట్రంలో రాక్షసపాలన
చందన్న కానుకలోనూ కక్కుర్తే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శ జీలుగుమిల్లి : రాష్ట్రంలో చంద్రబాబు రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. శుక్రవారం ఆయన జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంలో పార్టీ మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం నోట్ల రద్దు కారణంగా పల్లెలో ప్రజలు కన్నీరు పెడుతున్నారన్నారు. ప్రజలను రోడ్ల పాలు చేసి ప్రభుత్వం రోజుకో మాట చెబుతుందని తెలిపారు. చంద్రబాబు ద్వం«ధ్వ వైఖరి వల్ల రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అధికార పార్టీ నాయకులు వచ్చిన కాడికి దోచుకోవడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని పేర్కొన్నారు. పండగలకు ఇచ్చే చంద్రన్న కానుకలో కూడా కక్కుర్తిపడి నాసిరకం సరుకులు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ వైఎస్సార్ పథకాలను చంద్రబాబు తుంగలో తోక్కుతన్నారని, పేదల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలన్నా, సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలుపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అ«ధ్యక్షురాలు వందనపు సాయి బాలపద్మ, అధికార ప్రతినిధి పాల్నాటి బాబ్జి, రాష్ట్ర నాయకుడు సుధీర్ బాబు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాశం రామకృష్ణ, బీసీ సెల్ చలమల శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి దాకే శ్రీదేవి, పార్టీ మండల శాఖ అ««ధ్యక్షుడు గూడవల్లి శ్రీనివాసరావు, సరిపల్లి సత్యనారాయణ రాజు, బోదా శ్రీనివాసరెడ్డి, బూరుగు ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. -
చంద్రన్నా...ఇవేమి కానుకలు
క్రిస్మస్ పండుగకూ నిరాశే ∙ 20 నుంచి ప్రారంభమైనా çపూర్తి స్థాయిలో పంపిణీకి చుక్కెదురు సరిపడా సరుకు కూడా జిల్లాకు రాని వైనం l శెనగ పప్పు అరకొరే సంక్రాంతికీ అనుమానమే ఇబ్బందుల్లో కార్డుదారులు ∙ ‘చంద్రన్న’ ‘కానుక’ల తీరిదీ... సాక్షి ప్రతినిధి, కాకినాడ : చంద్రన్న కానుకల పంపిణీ ఆదిలోనే అపహాస్యం పాలైంది. డిసెంబరు, జనవరి నెలల్లో వచ్చే క్రిస్మస్, సంక్రాంతి పండుగల కోసం చంద్రన్న కానుకలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.జిల్లాలో బుధవారంæనుంచే పంపిణీ ఆర్భాటంగా చేపట్టినా అరకొరగానే విడుదలచేసి ఎప్పటిలానే మళ్లీ అభాసుపాలైంది. ఈ నెల 25న క్రిస్మస్. గురువారం నాటికి కూడా పూర్తి స్థాయిలో సరుకులు చౌక ధరల దుకాణాలకు చేరలేదు. ఇస్తామన్న ఆరింటిలో కందిపప్పు, శెనగపప్పు, బెల్లం అరకేజీ వంతున, గోధుమపిండి కేజీ, పామాయిల్ అర లీటరు, నెయ్యి 100 గ్రాములు ప్యాకింగ్‌తో పంపిణీ చేసేందుకు సరుకులు విడుదల చేసింది. చౌక ధరల దుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేయాల్సి ఉంది. క్రిస్మస్కు ముచ్చటగా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంతవరకు క్రిస్మస్ సరుకులు కార్డుదారుల దరిచేరలేదు. వాస్తవానికి ఈ నెల 20 నుంచి 26లోపు క్రిస్టమస్ లబ్థిదారులకు, జనవరి ఒకటి నుంచి 15వ తేదీ వరకు మిగిలిన కార్డుదారులకు సంక్రాంతి సందర్భంగా సరుకులు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. తీరా విడుదల్లో జాప్యంతో ఇప్పటి వరకు కూడా సరుకులు పూర్తిగా రేష¯ŒSకార్డుదారులకు అందలేదు. జిల్లాలో 2,643 చౌక దుకాణాల పరిధిలో 15 లక్షల 26 వేల 674 మంది రేష¯ŒS కార్డుదారులున్నారు. వీరిలో క్రిస్మస్ సందర్భంగా కానుకలు ఇచ్చే లబ్ధిదారులు మూడు లక్షలు వరకు ఉన్నారు. ప్రభుత్వం జిల్లాకు సరుకులు కేటాయింపులకు, విడుదలకు అసలు ఎక్కడా పొంతన లేని పరిస్థితి నెలకుంది. ఆరు సరుకుల్లో ఐదు సరుకులు ప్రస్తుతం క్రిస్మస్ కార్డుదారులకు సరిపడా విడుదలైనా శెనగపప్పు మాత్రం పూర్తి స్థాయిలో జిల్లాకు విడుదల కాలేదు. ఫలితంగా గురువారం జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, రంపచోడవరం తదితర నియోజకవర్గాల్లో చంద్రన్న కానుకల పంపిణీని ప్రారంభించారు. శెనగపప్పు అరకొరగానే కేటాయింపులు రావడంతో చౌకధరల దుకాణాలకు అంతంత మాత్రంగానే విడుదల చేశారు. పండుగ పేరుతో సరుకులు ఇస్తామని చెప్పి పూర్తిగా ఇవ్వకుండా తరువాత ఇస్తే ఉపయోగమేమిటని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు కాకినాడ నగరాన్నే తీసుకుంటే 60 వేల కార్డుదారులున్నారు. గత క్రిస్మస్ సరుకు పంపిణీ లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం కాకినాడలో 13 వేల రేష¯ŒS కార్డుదారులు క్రిస్మస్ కానుకకు అర్హులుగా ఉన్నారని లెక్క తేల్చారు. కానీ వీరిలో సగానికి సగం ఆరువేల మందికి సరిపడా శెనగపప్పు మాత్రమే జిల్లాకు వచ్చింది. జిల్లా అంతటా చూసుకుంటే మూడు లక్షల మంది క్రిస్మస్ కానుకలకు అర్హులుగా ఉన్నారని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. వీరిలో ప్రస్తుతం విడుదలైన కోటా 15శాతం కార్డుదారులకు మాత్రమే సరిపోయేలా కనిపిస్తోంది. క్రిస్మస్ లబ్దిదారులకు పంపిణీ కోసం రేష¯ŒS షాపులకు 30 శాతం సరుకులు చేరవేయాల్సింది. కానీ శెనగపప్పు అరకొరగా రావడంతో షాపులకు పూర్తి స్ధాయిలో చేరవేయలేని పరిస్ధితి నెలకుంది. మిగిలిన సరుకులు రేష¯ŒS దుకాణాలకు సరఫరా చేసినా శెనగపప్పు లేకుండా మిగిలిన వాటిని తీసుకునే పరిస్థితి ఉండదని డీలర్లు పేర్కొంటున్నారు. కనీసం సంక్రాంతి నాటికైనా పూర్తి స్థాయిలో అందరికీ సరుకులు అందేటట్టు చూడాలంటున్నారు. కేటాయింపు (మెట్రిక్ టన్నుల్లో) సరుకులు కేటాయింపు వచ్చినది శనగపప్పు 763.337 122 కందిపప్పు 763.337 374 బెల్లం 763.337 334 నెయ్యి 152.667 8 లక్షల 28వేల ప్యాకెట్లు గోధుమపిండి 1526.674 1427 పామాయిల్ 763.337 439 -
చంద్రన్న బీమా జీవో కాపీలు దహనం
ప్రభుత్వ ఆదేశాలపై భగ్గుమన్న భవన నిర్మాణ కార్మికులు పెద్దాపురంలో నిరసన ప్రదర్శన పెద్దాపురం : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును చంద్రన్న బీమా పథకంలో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై పెద్దాపురం అర్బన్, రూరల్ ప్రాంతాల భవన నిర్మాణ కార్మికులు మండిపడుతున్నారు.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కార్మికులంతా రోడెక్కారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనం నుంచి శోభా థియేటర్, నువ్వులగుంట వీధి, పాత ఆసుపత్రి మీదుగా మెయిన్ రోడ్డు వరకూ వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గడిగట్ట సత్తిబాబు, సీపీఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఎత్తివేసేందుకే ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసిందన్నారు. సంక్షేమ బోర్డును చంద్రన్న బీమాలో కలిపితే భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను వారు దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, కంచుమర్తి కాటంరాజు, మాగాపు నాగు, రాజమహేంద్రపు రామారావు, సిద్ధాంతపు వెంకటరమణ, పాలిపర్తి భద్రరావు, కర్రి వీరశివ, ముమ్మన శ్రీను, బల్ల రాంబాబు, బుడత రవీంద్ర, గంగాధర్ పాల్గొన్నారు. -
ఆ ఒక్కటీ అడగొద్దు!
– నిరుద్యోగులంతా ఉద్యోగుల కిందే లెక్క! – అరకొర సంపాదన ఉన్నా అంతే సంగతులు – పల్స్ సర్వేలో ఎంప్లాయ్‌గా నమోదుపై ఆందోళన – చంద్రన్న బీమాతో లింక్ పెట్టేస్తున్న సిబ్బంది – నిరుద్యోగ భృతి ఎగవేతకేనని యువత ఆవేదన – శ్రీనివాసరావు... బీటెక్ పూర్తి చేశాడు. అతని వయసు 24 సంవత్సరాలు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏవీ రాలేదు. ఖాళీగా ఉండలేక స్థానికంగా ఉన్న ఓ చిరువ్యాపార సంస్థలో నెలకు రూ.5 వేల జీతానికే పనికి వెళ్తున్నాడు. ఇప్పుడు అతను ఉద్యోగా? నిరుద్యోగా? అంటే... ప్రభుత్వం దృష్టిలో అతను ఉద్యోగే! పల్స్ సర్వేలో నమోదు చేసిన వివరాల ప్రకారం అతను ఉద్యోగి కాబట్టి... నిరుద్యోగి భృతి పొందడానికి అర్హత కోల్పోయినట్లే! – రాజ్యలక్ష్మి... బీఎస్సీ, బీఈడీ చదివింది. కొన్నాళ్లు ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసింది. తక్కువ జీతానికి పనిచేయలేక ఇంటి దగ్గరే ఉండిపోతోంది. ఇప్పుడామె ఉద్యోగా? నిరుద్యోగా? వాస్తవానికి ఆమె వివరాల్లో నిరుద్యోగిగానే పల్స్ సర్వేలో నమోదు చేయాలి. అలా చేస్తే నిరుద్యోగ భృతి వస్తుందో, లేదో తెలియదు కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న చంద్రన్న బీమాకు అర్హత లేకుండా పోతుంది. ఇదీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వేతో నిరుద్యోగుల పరిస్థితి. ఇప్పటికే ఈ సర్వేపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు నిరుద్యోగుల వర్గం కూడా చేరుతోంది. సర్వేలో కొన్ని వివరాలు తమ భవిష్యత్తు ప్రయోజనాలకు ముప్పు కలిగించేవిధంగా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. గత సర్వేలకు భిన్నంగా ఆర్థిక, వ్యక్తిగత వివరాలు లోతుగా అంటే 52 అంశాలతో గుచ్చిగుచ్చి ప్రశ్నించడం, వాటి నమోదు తర్వాత వాటిని ధ్రువీకరిస్తూ బొటనవేలి ముద్ర తీసుకోవడం వారిని మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా పూర్తిగా వ్యవసాయాధారమైనది. మరోవైపు విద్యకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చే జిల్లా. దీంతో ఇంటికో రైతు ఉన్నట్లే... ఇప్పటి పరిస్థితుల్లో ఇంటికో నిరుద్యోగి కూడా ఉన్నారు. దాదాపు 28 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ జిల్లాలో 20 శాతం యువతే. ఆ లెక్కన 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారే. అంటే దాదాపు 5.60 లక్షల మంది. వారిలో ప్రస్తుతం బీటెక్ తదితర డిగ్రీలు, వివిధ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్నవారు 60 వేల వరకూ ఉంటారని అంచనా. ఇక 23 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు మధ్యనున్నవారంతా ప్రభుత్వ ఉద్యోగాల ఎదురుచూస్తున్నారు. కానీ గత మూడు నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు లేవు. దీంతో ఈ యువత అంతా ప్రచ్ఛన్న నిరుద్యోగులుగానే ఉన్నారు. సర్వేతో గందరగోళం... ‘బాబు వస్తే జాబొస్తుంది... జాబు వచ్చే వరకూ నెలనెలా నిరుద్యోగ భృతి వస్తుంది’ అంటూ గత సాధారణ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా ఊరూరా ఊదరగొట్టారు. అందులో ఎంత వాస్తవమెంతో ఇప్పుడుప్పుడే యువత గ్రహిస్తున్నారు. రెండేళ్లు గడిచిపోతున్నా నోటిఫికేషన్లు అవిగో ఇవిగో అంటూనే నాయకులు చెబుతున్నారు. ఇక నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్వహిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వే యువతను మరింత గందరగోళంలోకి నెట్టేస్తోంది. సర్వే వివరాల్లో ఉద్యోగి (ఎంప్లాయ్), నిరుద్యోగి (అన్ఎంప్లాయ్) అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఎంప్లాయ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే గవర్నమెంట్, ప్రైవేట్, ఆర్గనైజేషన్స్... అని మూడు సబ్ ఆప్షన్స్ వస్తున్నాయి. వాటిలో ఏ ఒక్కదానిలో క్లిక్ చేసినా ఉద్యోగి కిందే లెక్క. ప్రభుత్వం ఒకవేళ భవిష్యత్తులో నిరుద్యోగి భృతి ఇస్తే... వీరికి ఆ ప్రయోజనం దక్కదు. ఇక అన్ఎంప్లాయ్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే స్టూడెంట్, హౌజ్‌వైఫ్ తదితర సబ్ఆప్షన్లు ఉన్నాయి. అంటే వారికి ఏ రకంగానైనా సంపాదన ఉండకూడదు. యువత అంతా ఉద్యోగులే సర్వే, చంద్రన్న బీమా ఏకకాలంలో చేస్తుండటంతో నిరుద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది పరిస్థితి. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం రాక ఏదొక రకమైన తాత్కాలిక ఉపాధి వెతుక్కున్న వారంతా తమను ఉద్యోగులుగానే నమోదు చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించింది. ఏదొక సంపాదన ఉందని చెబితే వారిని ఉద్యోగిగానే సర్వేలో నమోదవుతుంది. కాదు తాము నిరుద్యోగి అని చెబితే... ఎలా బతుకుతున్నావో చెప్పాలనే సర్వే సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు నిరుద్యోగి అని నమోదు చేస్తే చంద్రన్న బీమా పథకం వర్తించదని చెప్పేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక నిరుద్యోగులైనవారు తమను ఉద్యోగులుగా సర్వేలో నమోదు చేయించుకుంటున్నారు. ఈ లెక్కన జిల్లాలో యువత దాదాపుగా ఉద్యోగులగానే పరిగణించాల్సి వస్తుంది. అయితే విద్యార్థులు లేదంటే ఉద్యోగులు ఉన్నప్పుడు జిల్లాలో ఎవ్వరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరమేమి ఉంటుందనేది ప్రభుత్వం లెక్క! సంక్షేమ పథకాలకూ తూట్లు... పల్స్ సర్వేలో సొంత ఇల్లు తదితర ఆస్తులతో పాటు వాహనం, టీవీ, ఫ్రిజ్, ఏసీ మిషన్ వంటి వస్తువల వివరాలను నమోదు చేస్తున్నారు. వాటి ఆధారంగా ప్రభుత్వం తమకు సబ్సిడీ వంటగ్యాస్, తెల్లరంగు రేషన్‌కార్డు, ఉచిత వైద్యసేవ వంటి సంక్షేమ పథకాలు రద్దు చేసే ప్రమాదం ఉందని ఇప్పటికే పలువురిలో ఆందోళన నెలకొంది. అలాగే తమ పిల్లలకు ఉపకార వేతనాలు కూడా రద్దు చేస్తారేమోననే భయం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులను ఎంప్లాయ్ ఆప్షన్లో నమోదు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలోనూ నష్టం జరగవచ్చనే ఆందోళన యువతలో కనిపిస్తోంది. దీనికితోడు అధికార పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ సర్వేపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. -
రూటు మార్చిన ‘చంద్రన్న’
- కాపు భవనాలు, పథకాలకు చంద్రన్న పేరుపై బాబును కలిసిన నేతలు - వ్యతిరేకత పెరుగుతోందని మాట మార్చిన ఏపీ సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: కాపుల కోసం ప్రకటించిన పథకాలు, నిర్మించనున్న భవనాలకు చంద్రన్న పేరు పెట్టడంపై అభ్యంతరాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు రూటు మార్చారు. ఈ వ్యవహారంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని ఆదివారం సీఎంను కలిసిన కాపు నేతలు స్పష్టం చేయగా తనకు తెలియకుండా జరిగిందని సర్దిచెప్పారు. ఈ నేపధ్యంలోనే ఇకపై పథకాలకు పేర్లు పెట్టేటప్పుడు తన కార్యాలయం అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సీఎంవో మీడియా విభాగం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు కాపు నేతలు పిళ్లా వెంకటేశ్వరరావు, బేతు రామ్మోహనరావు తదితరులు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసి కాపు భవనాలకు చంద్రన్న భవన్, పథకాలకు చంద్రన్న పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమ సామాజికవర్గంలో పెల్లుబికుతున్న ఆందోళనను వారు చంద్రబాబుకు వివరించారు. కాపుల పథకాలు, భవనాలకు కాపు నేతలైన శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా తదితరుల పేర్లు పెట్టాలని నేతలు కోరారు. ఈ వ్యవహారం తనకు తెలియకుండా జరిగిందని, మార్పిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. వెనువెంటనే సీఎంవో నుంచి ఇప్పటివరకూ పలు పథకాలకు తన పేర్లు పెట్టడాన్ని తప్పుపడుతూ ప్రకటన జారీ చేయించారు. మొదటి నుంచి వివిధ పథకాలకు పలువురు మంత్రులు అత్యుత్సాహంతో చంద్రన్న పేరు పెడుతున్నా ముఖ్యమంత్రి వారించకుండా పరోక్షంగా ప్రోత్సహించారు. చివరికి కాపుల కోసం నిర్మిస్తున్న భవనాలకు, పథకాలకు చంద్రన్న పేరు పెట్టారు. మొదట్లో దీనిపైనా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. అయితే ఆ సామాజికవర్గం నుంచి వ్యతిరేకత పెరగడంతో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. రెండేళ్ల నుంచి చంద్రన్న పేర్ల తంతు నడుస్తున్నా ఇప్పుడు అభ్యంతరాలు రావడంతో తనకు తెలియకుండా పథకాలకు పేర్లు పెట్టొద్దని ప్రకటన విడుదల చేయడం విశేషం. పథకాలకు చంద్రన్న పేర్లు పెట్టే విషయం ఇప్పుడే బయటకు వచ్చినట్లు నటిస్తూ ఇప్పటివరకూ పెట్టినవి తనకు తెలియకుండా జరిగాయనే కలరింగ్ ఇచ్చుకోవడం విశేషం. -
చంద్రన్న కానుకల గౌడన్లు ఆకస్మిక తనిఖీలు
-
చంద్రన్న సంక్రాంతి కానుకలో అవినీతి
-
చంద్రన్న సంక్రాంతి కానుకలో అవినీతి
హైదరాబాద్: చంద్రన్న సంక్రాంతి కానుకలో అవినీతి నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 400 నమూనాలను పరిశీలించిన అధికారులు భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు నిర్థారించారు. నాసిరకం సరుకులు, తూకంలో మోసాలతో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు తొమ్మిది జిల్లాల్లో 40 కేసులు నమోదు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునిత సొంత జిల్లా అనంతపురంతో సహా కృష్ణ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరులలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తిచారు. కందిపప్పు, గోదుమపిండి, శేనగపప్పు, నెయ్యిలో నాణ్యత మరీ నాసి రకంగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. -
జనవరి 1 నుంచి చంద్రన్న సంక్రాంతి కానుకలు
-
చంద్రన్న గిప్ట్ తంతులో మరో వివాదం
హైదరాబాద్: చంద్రన్న సంక్రాంతి గిప్ట్ తంతులో మరో వివాదం తెర మీదికి వచ్చింది. తాజాగా బెల్లం స్కాం వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి మార్కెట్లో కేజీ బెల్లం గరిష్ట ధర 30 రూపాయిలు ఉండగా, పౌర సరఫరాల శాఖ మాంత్రం కేజీ రూ.54కు టెండర్ ఖరారు చేసింది. కేజీకి రూ.20 అదనంగా చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. టెండర్‌దారులు రిటైల్ మార్కెట్ కంటే అదనపు ధరను దక్కించుకోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ధరను చూసి బెల్లం వ్యాపారులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు చంద్రన్న కానుక అందుకునేందుకు జనాలు రేషన్ షాపులు వద్ద బారులు తీరారు. అయితే సంగమందికే సరిపడా సరుకులు రావటంతో అధికారుల్లో హైరానా మొదలైంది. -
సంక్రాంతి కానుక కావాలంటే ఆధార్ కావాలి
-
సంక్రాంతి గిప్ట్ ప్యాక్‌లో గోల్మాల్
-
మావోయిస్టులు వారోత్సవాలు
మంచిర్యాల సిటీ : డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. బుధవారం మందమర్రిలో పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు జిల్లా కార్యదర్శి బండి ప్రకాష్ స్వగ్రామమైన మందమర్రిలోని మున్సిపాలిటీ నోటీసు బోర్డుపై పోస్టర్లు వెలియడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వారోత్సవాలు నిర్వహించాలని జిల్లాలో పనిచేస్తున్న మంగి, ఇంద్రవెల్లి దళాలు నిమగ్నమయ్యాయి. ఈ రెండు దళాలే కాకుండా జిల్లా కార్యదర్శి ప్రకాష్‌తోపాటు వరంగల్ జిల్లా నుంచి వచ్చిన సాంబయ్యకు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. జిల్లా నుంచి 23 మంది జిల్లా, రాష్ట్ర, కేంద్ర కమిటీలో బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 400 మంది లొంగిపోయారు. 300 మంది ప్రస్తుతం జిల్లాలో సానుభూతిపరులు పనిచేస్తున్నారని నిఘా వర్గాల అంచనా. వారోత్సవాలు జిల్లాలో వీలుకాని నేపథ్యంలో ప్రాణహిత అవతల చేపట్టాలని మావోలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రాణహిత అవతల చేపడితే ఇబ్బంది ఉండదనేది పోలీసుల అభిప్రాయం. ఉనికి చాటేందుకు.. వారోత్సవాలను నేపథ్యంలో జిల్లాలో ఏదో ఒక విధం గా తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నట్లుగా నిఘా వర్గాలకు సమాచారం అందింది. తమ ఉనికిలో భాగం గా పోలీసులకు సమాచారం అందిస్తూ ఇబ్బందికరంగా మారిన ఇన్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వారిని ఈ పాటికే రక్షణ ప్రాంతాలకు తరలించారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పోలీస్ బలగాలు తమ వ్యూహానికి పదునుపెట్టినట్టు తెలిసింది. రెండు సార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నా.. ఈసారి వారోత్సవాల్లో ఎదురుపడితే గురితప్పరాదనే లక్ష్యంతో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. కాగా.. జిల్లా కార్యదర్శి బండి ప్రకాష్ స్వస్థలం మందమర్రి పట్టణం. తన సొంత ఊరిలోనే పీఎల్జీఏ వారోత్సవాల పోస్టర్లను మంగళవారం రాత్రి వేయించి తన ఉనికిని చాటుకున్నాడు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం, కూరగాయల మార్కెట్టు, కేకే-5 గని ప్రాంతాల్లో వారోత్సవాల పోస్టర్లు వేయడం గమనార్హం. పోస్టరు వెలసిన మార్కెట్టు ప్రాంతం మందమర్రి పోలీస్ స్టేషన్‌కు కేవలం అర కిలోమీటరు దూరంలో ఉండటం ఆశ్చర్య పోవాల్సిన అంశం. పీజీఏ టు పీఎల్జీఏ.. పీఎల్జీఏ వారోత్సవాలు ప్రతి ఏటా డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదట పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీజీఏ) డిసెంబర్2, 2000 సంవత్సరంలో ప్రారంభించింది. కేంద్ర కమిటీ సభ్యులైన నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ కరీంనగర్ జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో మరణించారు. వీరి మృతికి సంతాపంగా పీజీఏను ప్రారంభించారు. అనంతరం పీజీఏను సెప్టెంబర్ 21, 2004న పీఎల్‌జీఏగా మార్చారు. రాష్ట్ర కమిటీలోకి బండి ప్రకాష్.. మావోయిస్టు జిల్లా కార్యదర్శిగా, అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న బండి ప్రకాష్‌ను కొత్తగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తీసుకున్నట్లు సమాచారం. పోలీసులకు మింగుడుపడని ప్రకాష్ సింగరేణి గనులపై కొంత మేర పట్టు సాధించాడని, రెండు నుంచి మూడు గనులకు ఒకరిని తన అనుచరులను తయారు చేసుకున్నారని తెలిసింది. వీరంతా గతంలో మావోయిస్టులో పనిచేసి లొంగిపోయిన వారేనని నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఎదురుకాల్పుల నుంచి తప్పించుకుని.. జిల్లాలో మే 24న కాసిపేట మండలం వెంకటాపూర్ శివారు అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున మావోల డంప్ బయట పడింది. జూలై 31న తిర్యాణి-కాసిపేట మండలాల సమీపంలో ఉన్న మంగీ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగడంతో మావోలు తప్పించుకున్నారు. సెప్టెంబర్ 14న తిర్యాణి మండలం పంగిడి మాదారం అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరోసారి మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈ రెండు ఘటనల్లో జిల్లా కార్యదర్శి బండి ప్రకాష్, చార్లెస్, ఆడెల్లు వంటి ముఖ్యమైన నాయకులు తప్పించుకున్నారు. ఎవరీ ఆజాద్..? జిల్లాపై మరింత పట్టు సాధించడానికి వరంగల్లు జిల్లా కు చెందిన సీనియర్ మావోయిస్టు సాంబయ్య అలియా స్ ఆజాద్ కొత్తగా జిల్లాలో సంచరిస్తున్నట్లు నిఘా వర్గా లు గుర్తించాయి. ఆజాద్ ఎత్తులను చిత్తు చేయడానికి పోలీస్ శాఖ అతని కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. పీఎల్జీఏ వారోత్సవాలను జరిపి తీరాల్సిందేనని కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ఆజాద్‌తోపాటు బండి ప్రకాష్‌కు బాధ్యతలు అప్పగించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కోల్‌బెల్ట్ ఎమ్మెల్యే సహకారం.. కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు మావోయిస్టుల అవసరాలను అప్పుడప్పుడు తీరుస్తున్నారని రాష్ట్ర స్థాయి నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని విశ్వనీయ వర్గాల సమాచారం. మావోయిస్టులకు అవసరమైన సామగ్రిని వారి కొరియర్ల ద్వారా అవ సరమైన మేరకు పంపిస్తున్నారని, ఇది గతేడాది నుంచి కొనసాగుతోదని నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. దీనిపై మరింత లోతుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిఘా వర్గాలు విచారణ చేస్తున్నట్టు సమాచారం. -
లొంగిపోండి..!
ఇల్లెందు: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అజ్ఞా త దళాలపై పోలీసుల వైఖరి మారుతోందా..? లొంగిపోవాల్సిందిగా ఈ దళాల నేతలను, సభ్యులను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారా? ఏజెన్సీలోని పరిణామాలను పరిశీలిస్తే.. ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది. ఇల్లెందు సబ్ డివిజన్లో న్యూడెమోక్రసీ పార్టీ రాయల, చంద్రన్న వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలోనే పోలీసుల నుంచి ఇలా ఒత్తిడి పెరిగినట్టు తెలిసింది. అజ్ఞాత దళ నేతలు మధు, లింగన్న, అశోక్, రాము, ఐలయ్య, యాకన్న ఇళ్లకు పోలీసులు వెళ్లారని, ‘లొంగిపోవాల్సిందిగా మీ వాళ్లతో చెప్పండి’ అని, వారి కుటుంబీకులను హెచ్చరించారని సమాచారం. ఇదే విషయాన్ని న్యూడెమోక్రసీ నేత గుమ్మడి నర్సయ్య ఇటీవల విలే కరుల సమావేశంలోనూ చెప్పారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోగల అజ్ఞాత దళ నేతలు, సభ్యుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారని సమాచారం. అసలు కారణాలు ఇవేనా... లొంగిపోవాలంటూ అజ్ఞాత దళాలపై పోలీసు లు ఒత్తిడి పెంచడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.ఒక కారణం- న్యూడెమోక్రసీ పార్టీ రెండు గ్రూపులు(రాయల, చంద్రన్న)గా విడిపోయిన నేపథ్యంలోనే పోలీసుల ఒత్తిడి పెరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు మరింత ము దిరిందని, పరస్పరం శతృత్వ భావం ఏర్పడుతోందని, ఇది మున్ముందు శాంతి భద్రతల సమస్యకు దారితీయవచ్చని పోలీసులు అంచ నా వేశారు. ఈ నేపథ్యంలోనే.. అజ్ఞాత దళాల సభ్యులను, నేతలను లొంగదీసేందుకు ఏక కాలంలో ఒత్తిడి పెంచారు. రెండో కారణం- ఇల్లెందు మండలంలోని నెహ్రూనగర్‌లో అడవిని కొందరు నరికివేసి పోడు చేస్తున్నారు. వీరికి న్యూడెమోక్రసీలోని అజ్ఞాత దళాలు అండగా నిలుస్తున్నాయి. అటవీ అధికారులకు ఇది తలనొప్పి వ్యవహారంగా మారింది. అడవిని నరుకుతున్న వారికి అజ్ఞాత దళాలు అండగా నిలుస్తున్నాయని, తమ విధి నిర్వహణకు ఇవి ఆటంకంగా ఉన్నాయని, అంతిమంగా.. శాంతిభద్రతల సమస్య ఏర్పడే ప్రమాదముందని పోలీసులకు అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రధానం గా ఈ రెండు కారణాల నేపథ్యంలోనే అజ్ఞాత దళాల లొంగుబాటుకు పోలీసులు ఒత్తిడి పెం చినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. -
చంద్రన్న నేతృత్వంలో ‘మావో’ తెలంగాణ కమిటీ
బండి ప్రకాష్, శివారెడ్డి, చొక్కారావు కీలకం {పస్తుతం కమిటీలో 80 మంది సమాచారం సేకరించిన రాష్ట్ర నిఘా వర్గాలు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (ఎన్టీఎస్జెడ్సీ) తాజాగా తెలంగాణ స్టేట్ కమిటీ (టీఎస్సీ)గా మారింది. పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రెటరీగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న దీనికి నేతృత్వం వహిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కమిటీలో ప్రస్తుతం 80 మంది వరకు కేడర్ ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ అడవులు కేంద్రంగా ఖమ్మం జిల్లాపై దృష్టి సారించిన టీఎస్సీ ప్రస్తుతం ద్వితీయ స్థాయిలో నేతృత్వం వహించే కేడర్‌ను సమీకరించుకోవడంపై దృష్టి పెట్టింది. ఎన్నికల నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి ముమ్మరంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నిఘా వర్గాలు కీలక ఆధారాలు సేకరించాయి. ఖమ్మంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్లోనూ అవకాశం ఉన్నచోట ఉనికిని ప్రదర్శించాలని టీఎస్సీ ప్రయత్నిస్తోంది. దీనికి చెక్ చెప్పేందుకు నిఘా వర్గాలు సైతం పక్కా వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం వడకాపూర్కు చెందిన చంద్రన్న అసలు పేరు పుల్లూరి ప్రసాదరావు. ఈయనకు శంకరన్న, శంకర్రావు, మల్కాపురం భాస్కర్ అనే మారుపేర్లూ ఉన్నాయి. ఎన్టీఎస్జెడ్సీతో పాటు సెంట్రల్ కమిటీకి సెక్రెటరీగా వ్యవహరించిన ఇతడిపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం మదగూడకు చెందిన యాప నారాయణ అలియాస్ లక్ష్మ అలియాస్ హరిభూషణ్, వరంగల్ జిల్లా తాడ్వాయ్ మండలం నార్లపూర్‌కు చెందిన ఇ.శివారెడ్డి అలియాస్ కిరణ్, కల్వపల్లికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాష్ అలియాస్ బండి బడా అలియాస్ క్రాంతి టీఎస్‌సీలో కీలక భూమిక పోషిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం టీఎస్సీ దృష్టంతా ఆపరేషన్లు నిర్వహించడం కంటే కేడర్‌ను పెంచుకోవడం పైనే ఉందని చెప్తున్నాయి. -
ఏ..బీసీ..డీ ఎన్నికల గారడీ!
‘‘పచ్చనయ్యా... చందమామ... ఎక్కడున్నావూ... నీవు లేక బీసీలంతా గొల్లుమన్నారు, దిగులుపడ్డారు...’’ అంటూ పాడుకుంటూ ఒకాయన కిలకిలా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఆయనను చూసి ఆశ్చర్యపడి మరొకాయన అడిగాడు. ‘‘అదేంట్సార్... ఏదో విషాదగీతం పాడుతున్న ఫీలింగ్ ఇస్తూ... అంతలోనే మళ్లీ అలా నవ్వుతూ వెళ్తున్నారు?’’ అని అడిగాడు. దానికి ఆయన జవాబు చెబుతూ ఇలా అన్నాడు... ‘‘ఇటీవల రాజకీయాల్లో ఒకాయన బీసీనే సీఎం చేస్తాననీ, అలా చేసేదాకా వదలనని, ఎవరడ్డొస్తారో చూస్తా అని... ఇలా రకరకాలుగా రంకెలేశాడు. దాంతో నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. అందుకే ఇలా విషాదగీతాన్నీ పాడుతూ, ఆనందలాస్యాన్నీ ప్రదర్శిస్తూ రెండు ఫీలింగ్‌నూ ఏకకాలంలో చూపిస్తున్నా. సదరు పచ్చనయ్యగారు మాట్లాడిన మాటలు వినగానే నేనెప్పుడో చదివిన... లోకంలో అందరికీ తెలిసిన ఒక కథ గుర్తొచ్చింది’’ ‘‘ఏంట్సార్ ఆ కథ’’ ‘‘ఒక ఊళ్లో చంద్రన్న, కిట్టన్న అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. కిట్టన్న అవసరాల కోసం ఎప్పుడైనా పదివేల వరహాలు ఇస్తానని చంద్రన్న వాగ్దానం చేశాట్ట. ఒకరోజున వారిద్దరూ కలిసి అడవి అవతల ఉన్న పొరుగూరికి ప్రయాణం కట్టారట. అప్పుడు చంద్రన్న దగ్గర చాలా రొక్కం ఉండటం చూసి కిట్టన్న అడిగాట్ట. ‘‘అన్నా... ఇప్పుడు నీ దగ్గర చాలా రూకలు ఉన్నాయి కదా. ఎలాగూ నీతో పాటు పొరుగూరు వస్తున్నా కదా. అక్కడి సంతలో నాకు అవసరమైన సరుకులు తెచ్చుకుని బాగుపడతా. ఆ డబ్బు ఇప్పుడివ్వు అన్నా’’ అడి అడిగాట్ట. దానికి చంద్రన్న ‘‘ఇప్పుడు నాకు సొమ్మెంతో అవసరం. తర్వాత ఎప్పుడైనా ఇస్తాన్లే’’ అన్నాట్ట. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలో దూరంగా బందిపోట్లు వస్తున్న అలికిడిని ఇద్దరూ గమనించార్ట. ఆ వెంటనే చంద్రన్న చాలా జాలిగుండె గలవాడిగా ముఖం పెట్టి... ‘‘కిట్టన్నా... నువ్వు పదివేల వరహాలు అడిగావు కదా. ఇదిగో తీస్కో. నీకు వీలైనప్పుడే తిరిగి ఇద్దువుగానీ’’ అన్నాట్ట. బందిపోట్లు వస్తున్న విషయం గమనించి కూడా... ‘హయ్యో... ఈ పాడులోకాన ఇలా పదివేల వరహాలు అడిగీ అడగగానే ఇచ్చే మంచివాడెవడయ్యా... ఇంత అమాయకుడివి ఎలా బాగుపడతావయా చంద్రన్నా’’ అంటూ అతడి దయాగుణానికీ, వితరణశీలత్వానికీ కిట్టన్న ఎంతో ఆనందించాట్ట. ఈ కథ వినీ వినగానే అప్పటివరకూ కథ వింటున్న వ్యక్తి చర్రుమన్నాడు. ‘‘అసలు కథలో ఇలా ఉండదు. ఆ సమయంలో అప్పు ఇవ్వజూపుతున్న చంద్రన్న కుటిల బుద్ధిని కిట్టన్న అసహ్యించుకుని, అప్పు తీసుకోడానికి నిరాకరిస్తాడు కదా. అయినా మీ కథలో కిట్టన్న... సదరు చంద్రన్నను అమాయకుడంటున్నాడుగానీ అసలు బందిపోట్ల అలికిడి గమనించాక కూడా అప్పు తీసుకోదలచుకుంటున్న కిట్టన్నే కదా అమాయకుడు’’ అన్నాడా శ్రోత. ‘‘ఈ విషయం లోకంలో అందరికీ అర్థమైంది ఒక్క కిట్టన్నకు తప్ప. మరి కిట్టన్న మదిలో ఏముందో! అప్పుడెప్పుడో జరిగిందంటున్న కథ ఇప్పుడు మళ్లీ కొత్తగా జరుగుతోంది నాయనా. ఇప్పుడు లోకంలో అందరికీ తెలుసు ఆ అతితెలివి చంద్రన్న ఎవరో, ఈ అమాయక కిట్టన్న ఎవరో!’’ అంటూ కథ ముగించాడు ఏకకాలంలో నవ్వుతూ, ఏడుస్తూ కనిపించిన వ్యక్తి. ‘‘అవును. అపర దాతృత్వం నటిస్తూ, ఆపన్న హస్తం చాస్తున్నట్టున్న ఆ చంద్రన్న లాంటి మహాకుటిలాత్ముల వ్యవహారశైలికి నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు. నేనైతే ఏం చేస్తానో తెలుసా?’’ ‘‘ఏం చేస్తారు సార్?’’ ‘‘నవ్వుతూ నాకిస్తున్న ఆఫర్ మళ్లీ ఎవ్వరికీ ఇవ్వలేని విధంగా ఆ చంద్రన్న ముఖాన నవ్వు చెరిపేలా చేస్తా. ఎప్పుడూ ప్రజలంతా నవ్వుతూ ఉండేలా చూడాలనుకుంటున్న సిన్సియర్ నేతలకే నా సహకారమందిస్తా’’ -
మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శిగా చంద్రన్న
ఏఓబీ స్పెషల్ జోన్ కమిటీతో పాటు ఏపీ కమిటీ ఇన్చార్జిగా ఆర్కే సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రానికి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీకి కార్యదర్శిగా పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్నను కేంద్ర కమిటీ నియమించింది. ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఆయన వ్యవహరించాడు. అయితే, ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణపై కూడా పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా ఆయనకు పేరుంది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఉత్తర తెలంగాణలో తిరిగి పట్టును సాధించేందుకు చంద్రన్నకు తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యతలను అప్పగించినట్లు చెప్తున్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ బాధ్యునిగా చంద్రన్నను నియమించటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక ఇప్పటివరకు ఆంధ్రా - ఒడిశా స్పెషల్ జోన్ కమిటీకి ఇన్చార్జిగా ఉన్న రామకృష్ణకు అదనంగా ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కమిటీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ స్థానంలో కొత్త నేతను నియమించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి.