రైతును కొట్టి చంపిన ఎన్డీ చంద్రన్న వర్గం | ND Chandranna group who killed the farmer | Sakshi
Sakshi News home page

రైతును కొట్టి చంపిన ఎన్డీ చంద్రన్న వర్గం

Published Thu, Aug 17 2017 2:18 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

ND Chandranna group who killed the farmer

పాల్వంచ రూరల్‌ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన సాయుధ నక్సల్స్‌ ఓ రైతును కొట్టి చంపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నర్సంపేటలో బుధవారం జరిగింది. నర్సంపేటకు చెందిన రైతు, టీడీపీ నేత రాయల భాస్కర్‌రావు (53) బుధవారం ఉదయం తన ఇంటి బయట ఉండగా నాలుగు వైపుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి చుట్టుముట్టారు. అనుమా నం వచ్చిన భాస్కర్‌రావు ఇంట్లోకి పరుగెత్తాడు.

ఆ సమయంలో 20 మంది సాయుధులు వచ్చి భాస్కర్‌రావును పట్టుకున్నారు. సమీపంలోని  జామాయిల్‌ తోటలోకి భాస్కర్‌రావును ఈడ్చు కుంటూ తీసుకెళ్లి ఛాతీపై తీవ్రంగా కొట్టారు. అడ్డుకోబోయిన ఇద్దరు గ్రామస్తులను సైతం చితకబాదారు. ఛాతీ భాగంలో దెబ్బలు తగిలి భాస్కర్‌రావు మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement