ఇల్లెందు: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అజ్ఞా త దళాలపై పోలీసుల వైఖరి మారుతోందా..? లొంగిపోవాల్సిందిగా ఈ దళాల నేతలను, సభ్యులను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారా? ఏజెన్సీలోని పరిణామాలను పరిశీలిస్తే.. ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది. ఇల్లెందు సబ్ డివిజన్‌లో న్యూడెమోక్రసీ పార్టీ రాయల, చంద్రన్న వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలోనే పోలీసుల నుంచి ఇలా ఒత్తిడి పెరిగినట్టు తెలిసింది. అజ్ఞాత దళ నేతలు మధు, లింగన్న, అశోక్, రాము, ఐలయ్య, యాకన్న ఇళ్లకు పోలీసులు వెళ్లారని, ‘లొంగిపోవాల్సిందిగా మీ వాళ్లతో చెప్పండి’ అని, వారి కుటుంబీకులను హెచ్చరించారని సమాచారం. ఇదే విషయాన్ని న్యూడెమోక్రసీ నేత గుమ్మడి నర్సయ్య ఇటీవల విలే కరుల సమావేశంలోనూ చెప్పారు. ఏజెన్సీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోగల అజ్ఞాత దళ నేతలు, సభ్యుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారని సమాచారం.
అసలు కారణాలు ఇవేనా...
లొంగిపోవాలంటూ అజ్ఞాత దళాలపై పోలీసు లు ఒత్తిడి పెంచడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.ఒక కారణం- న్యూడెమోక్రసీ పార్టీ రెండు గ్రూపులు(రాయల, చంద్రన్న)గా విడిపోయిన నేపథ్యంలోనే పోలీసుల ఒత్తిడి పెరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలు మరింత ము దిరిందని, పరస్పరం శతృత్వ భావం ఏర్పడుతోందని, ఇది మున్ముందు శాంతి భద్రతల సమస్యకు దారితీయవచ్చని పోలీసులు అంచ నా వేశారు. ఈ నేపథ్యంలోనే.. అజ్ఞాత దళాల సభ్యులను, నేతలను లొంగదీసేందుకు ఏక కాలంలో ఒత్తిడి పెంచారు.
రెండో కారణం- ఇల్లెందు మండలంలోని నెహ్రూనగర్‌లో అడవిని కొందరు నరికివేసి పోడు చేస్తున్నారు. వీరికి న్యూడెమోక్రసీలోని అజ్ఞాత దళాలు అండగా నిలుస్తున్నాయి. అటవీ అధికారులకు ఇది తలనొప్పి వ్యవహారంగా మారింది. అడవిని నరుకుతున్న వారికి అజ్ఞాత దళాలు అండగా నిలుస్తున్నాయని, తమ విధి నిర్వహణకు ఇవి ఆటంకంగా ఉన్నాయని, అంతిమంగా.. శాంతిభద్రతల సమస్య ఏర్పడే ప్రమాదముందని పోలీసులకు అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రధానం గా ఈ రెండు కారణాల నేపథ్యంలోనే అజ్ఞాత దళాల లొంగుబాటుకు పోలీసులు ఒత్తిడి పెం చినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
లొంగిపోండి..!
Published Sat, Jun 28 2014 1:29 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement