జిల్లాలో 3.77 లక్షల మందికి చంద్రన్నబీమా
జిల్లాలో 3.77 లక్షల మందికి చంద్రన్నబీమా
Published Wed, Feb 1 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
మెప్మా ఏడీఎంసీ మోహన్ కుమార్
పిఠాపురం : జిల్లాలో 3.77 లక్షల మందికి చంద్రన్న బీమా కల్పించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచినట్టు మెప్మా ఏడీఎంసీ కె.మోహన్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో బీమా రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 576 చంద్రన్న బీమా క్లెయిమ్‌లు నమోదు కాగా 441 క్లెయిమ్‌లు ఎల్‌ఐసీకి అప్పగించామన్నారు.
వీటిలో 331 మందికి సొమ్ములు అందజేసినట్లు ఆయన తెలిపారు. జనవరి 31 నుంచి లబ్ధిదారుల ఎంపిక నిలిపివేశామన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులు ఎవరైనా మృతి చెందితే 48 గంటలలోపు సంబంధిత కార్యాలయంలో మరణ వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. అలా కాకుండా ఆలస్యం అయితే క్లెయిమ్‌లు రావడం ఆలస్యం అవుతుందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే నియమించిన బీమామిత్రల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. అభయహస్తం పథకంలో గతంలో ఇచ్చే దహన సంస్కార ఖర్చులు రూ.5 వేలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అభయహస్తం లబ్ధిదారులు రూ.385 చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు అభయహస్తంలో 2,61,600 మంది ఉండగా విద్యార్థులకు రూ.1200 చొప్పున స్కాలర్‌షిప్పులు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 2440 విద్యార్థులకు రూ.29,28,000 స్కాలర్‌షిప్పులు ఇస్తున్నామన్నారు.
Advertisement