bheema
-
'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం!
సాక్షి, ఆదిలాబాద్: గోండు వీరుడు కుమురంభీం వర్ధంతి కార్యక్రమం నిర్మల్ జిల్లాలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని గొండుగూడలో ఆదివారం భీం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జెండా గద్దె వద్ద భీం చిత్రపటాన్ని పెట్టి జెండా ఎగురవేసేందుకు ఇనుప పైపు అమరుస్తుండగా అది సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగకు తగిలింది. విద్యుత్ సరఫరా కావడంతో పైపును పట్టుకున్న మోహన్, భీంరావు, వెంకట్రావు షాక్‌కు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు బాధితులను విద్యుత్ సరఫరా నిలిపివేయించి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పెంద్రం మోహన్(25) మార్గమధ్యలో మరణించాడు. ఆత్రం భీంరావు(26) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో బాధితుడు వెడ్మ వెంకట్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్రం భీంరావుకు భార్య గంగామణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంద్రం మోహన్ బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇద్దరు యువకుల మృతితో చిన్నబెల్లాల్ గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్ది భుక్యా జాన్సన్‌నాయక్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి.. -
గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు
టాలీవుడ్ మెచో స్టార్ గోపీచంద్ రీసెంట్గా వచ్చిన 'రామబాణం' గురితప్పింది. దీంతో చాలా రోజుల నుంచి కమ్ బ్యాక్ అయ్యేందుకు ఆయన ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నాడు. రొటీన్ కథలతో వస్తున్నడంతో ఆయనకు ఏదీ సెట్ కాలేదనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది! కన్నడ దర్శకుడు ఏ హర్షతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేడు(జూన్ 12) తన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఖరారు చేసి, పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. పోస్టర్లో పొడవైన మీసకట్టుతో రగడ్ లుక్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నాడు. పోస్టర్‌తోనే భారీ అంచనాలు పెంచేశాడు. (ఇదీ చదవండి: Jr NTR: ఒక్క యాడ్ కోసం అన్ని కోట్లు.. ఇదీ తారక్ రేంజ్!) 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్‌గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్ట్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. #BHIMAA pic.twitter.com/a4R9gQb6mK — Gopichand (@YoursGopichand) June 12, 2023 (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
‘గీత కార్మికుల బీమా’పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బీమా నగదు వారం రోజుల్లో నేరుగా వారి ఖాతాలో జమచేయనున్నట్లు పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంగళవారం దీనికి సంబంధించి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లుగీత సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నప్పటికీ.. ఇది బాధితులకు అందడంలో ఆలస్యమౌతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత రేపే నీరా కేఫ్ ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో అధునాతన హంగులతో నిర్మించిన నీరాకేఫ్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ప్రారంభించనున్నారు. గౌడ కులస్థులకు ఉపాధి కల్పించడంతోపాటు తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతిసిద్ధమైన నీరాను అందించాలని నిర్ణయించింది. రూ.12.20 కోట్లతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో నీరా కేఫ్‌ను సుందరంగా నిర్మించింది. ఇదే స్ఫూర్తితో భువనగిరిలోని నందనం, రంగారెడ్డిలోని ముద్విన్, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్లగొండలోని సర్వేల్లో నాలుగు నీరా సేకరించే కేంద్రాల కోసం ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 319 మంది గీత కార్మికులను గుర్తించి, వారికి శిక్షణ ఇప్పించింది. -
బకాసుర వధ
హిడింబాసుర వధ తర్వాత పాండవులు హిడింబవనం నుంచి బయలుదేరి శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. శాలిహోత్ర ముని వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇంతలో అక్కడకు వ్యాస మహర్షి వచ్చాడు. అందరూ ఆయనకు పాదభివందనం చేశారు. పాండవుల దుర్గతికి వ్యాసుడు జాలిపడ్డాడు. ‘కొడుకు మాట విని ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. దుర్మార్గుల పట్ల ఏమరుపాటు తగదు. కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా మీరు ఇక్కడే కాలక్షేపం చేసి, తర్వాత ఏకచక్రపురం వెళ్లండి. అక్కడ బ్రాహ్మణ వేషంలో బ్రాహ్మణుల ఆశ్రయంలో తలదాచుకోండి. అంతా మంచే జరుగుతుంది’ అని చెప్పాడు. శాలిహోత్ర మహాముని ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపిన తర్వాత వ్యాసుడి సూచనపై పాండవులు అక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్లడానికి బయలుదేరారు. విదర్భ, మత్స్య, త్రిగర్త దేశాలు దాటి ఏకచక్రపురం చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట ఆశ్రయం పొంది, భిక్షాటనతో కాలం గడపసాగారు. ఒకనాడు నలుగురు సోదరులూ భిక్షాటనకు వెళ్లగా, భీముడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇంతలో ఇంటి యజమానుల భాగం వైపు నుంచి ఏడుపులు పెడబొబ్బలు వినిపించసాగాయి. ఎవరికి ఏ ఆపద ఎదురైందోనని కుంతి అటువైపు హుటాహుటిన వెళ్లింది. భార్యాబిడ్డలను పట్టుకుని అదేపనిగా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు బ్రాహ్మణుడు. ‘నిస్సారమైనది ఈ జీవితం. ఎంతటి వాళ్లకైనా కర్మఫలం తప్పదు. అగ్నిసాక్షిగా పెళ్లాడాను దీన్ని. రాక్షసుడి తిండికి దీన్నెలా పంపను? లోకం తెలియని పసికూన కూతురు. రాక్షసుడికి ఆహారంగా వెయ్యడానికి నాకు చేతులెలా వస్తాయి? కొడుకు– ఒక్కగానొక్క వంశాంకురం. తిలోదకాలన్నా లేకుండా వీణ్ణి మాత్రం ఎలా పంపను? నేనే వెళతాను’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు. ‘వద్దు, వద్దు. మీరు వెళ్లకండి. మీరు లేకుండా నేనీ సంసారాన్ని ఈదలేను. అసలు బతకలేను. పునిస్త్రీ చావు కన్న పుణ్యం లేదు. నన్ను పంపండి. ఆ రాక్షసుడికి ఆహారంగా నేనే వెళతాను’ ఏడుస్తూ అంది ఆ ఇల్లాలు. ‘ఏనాటికైనా పరాయి ఇంటికి వెళ్లవలసిన దాన్నే. నన్ను పంపండి’ అంది కూతురు బిగ్గరగా రోదిస్తూ.ఊహ తెలియని కొడుకు ఇదంతా చూస్తూ, ‘ఎందుకు మీరంతా ఏడుస్తారు? నేనెళతాను. ఆ రాక్షసుణ్ణి చంపేసి వస్తా’ అంటూ దగ్గరే ఉన్న ఒక కర్రనందుకున్నాడు. ‘అసలేమైందమ్మా! మీరంతా ఎందుకో బాధపడుతున్నారు. రాక్షసుడంటున్నారు. ఆ రాక్షసుడు ఎవరు? మీకొచ్చిన ఆపద ఏమిటి? మీకు ఆపద వస్తే, మాకు వచ్చినట్లే. సందేహించకుండా చెప్పండి’ అంది కుంతి. ‘ఏం చెప్పేది తల్లీ! ఈ ఊరికి ఆమడ దూరంలో బకాసురుడి గుహ ఉంది. ఇదివరకు వాడు ఊళ్లో వాళ్లందరినీ మింగేస్తూ ఉండేవాడు. అప్పుడు ఊళ్లో వాళ్లంతా ఆలోచించి, బకాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజూ ఒక మనిషి, రెండు పోతులు, వంటకాలతో బండెడు ఆహారం వాడికి పంపుతామని, వాడు ఊరి మీద పడకుండా ఉండాలని ఆ ఒప్పందం. మా రాజుకు ఆ రాక్షసుణ్ణి ఎదిరించే బలం లేదు. అందుకే రోజూ వంతుల వారీగా ఒక్కో ఇంటి నుంచి ఒక మనిషి అతడికి ఆహారంగా వెళుతున్నాం’ అని చెప్పాడా బ్రాహ్మణుడు. ‘విచారించకండి. దీనికి తగిన ఉపాయం చెబుతాను’ అంది కుంతి. ‘మీకు ఒక్కడే కొడుకు. పైగా పసివాడు. నాకు ఐదుగురు కొడుకులు. వాళ్లలో ఒకణ్ణి పంపుతాను.’ అంది. ‘శివ శివా’ అంటూ చెవులు మూసుకున్నాడు బ్రాహ్మణుడు. ‘అతిథిని చావుకు ఎరగా వేయడం మహా పాతకం. నా ప్రాణం కోసం అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి రాక్షసుడికి బలి చెయ్యాలా? నేను ఇంతటి పాతకానికి సమ్మతించలేను తల్లీ!’ అన్నాడు. ‘అయ్యా! మీరు అనవసరంగా బాధపడకండి. మరేమీ భయపడకండి. నా కొడుకు సంగతి మీకు తెలీదు. వాడు మహా బలసంపన్నుడు. వందమంది బకాసురులైనా వాణ్ణేమీ చెయ్యలేరు. ఏ తల్లికైనా కన్నకొడుకు చేదుకాదు కదా, నేను నా కొడుకును ఎలా బలి పెడతాననుకున్నారు? జరిగేది చూస్తూ ఉండండి’ అంటూ భీముణ్ణి కేకేసి పిలిచింది. బకాసురుడికి బండితో భోజనం తీసుకువెళ్లమని చెప్పింది. ఉత్సాహంగా సిద్ధపడ్డాడు భీముడు. త్వర త్వరగా పంచభక్ష్యాలతో భోజనం తయారు చేయించి, పోతులు పూన్చిన బండికెక్కించాడు బ్రాహ్మణుడు. బండి పైకెక్కి భీముడు బయలుదేరాడు. బకాసురుడి గుహ అల్లంత దూరం ఉందనగా, యమున ఒడ్డున బండిని నిలిపాడు. నదిలో కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని, వచ్చి బకాసురుణ్ణి కేకలేసి పిలిచాడు. వాడు రాలేదు. ఈలోగా భోంచేద్దామని, బండిలోని పదార్థాలను ఆరగించడం ప్రారంభించాడు. గుహ ముందుకు భోజనం బండి వచ్చే జాడ కనిపించకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్న బకాసురుడు బయటకు వచ్చాడు. కొద్ది దూరం వచ్చేసరికి బండి మీద భోంచేస్తున్న భీముడు కనిపించాడు. బకాసురుడికి కోపం నసాళానికెక్కింది. ‘నాకోసం తెచ్చిన తిండి నువ్వు తినేస్తున్నావేమిటి? ఒళ్లు కొవ్వెక్కిందా?’ అంటూ భీముడి వీపు మీద ఒక గుద్దు గుద్దాడు. ఏమాత్రం చలించకుండా, భీముడు తింటూనే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు బకాసురుడు. కాస్త దూరంలో ఉన్న చెట్టును పెరుక్కు రావడానికి వెళ్లాడు. వాడు చెట్టు పెరుక్కుని తెచ్చేలోగా భీముడు భోజనం పూర్తి చేశాడు. బండి దిగి, మరో చెట్టును ఊడబెరికి బకాసురుడి ఎదురుగా వెళ్లాడు. ఇద్దరూ చెట్లతో కొట్టుకున్నారు. చుట్టు పక్కల చెట్లన్నీ అయిపోయే వరకు వారి మధ్య చెట్ల యుద్ధం సాగింది. చెట్టనేది ఏదీ కనిపించకపోవడంతో మల్లయుద్ధానికి కలబడ్డారు. భీముడు బకాసురుణ్ణి కిందకు పడదోసి, కాలితో తన్నాడు. వాడు చప్పున లేచి భీముణ్ణి గుండెలపై గుద్దాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకుని భీముడు వాడి మీదకు మెరుపులా దూకాడు. ఒక చేత్తో నడుము దొరకబుచ్చుకుని, ఒక చేత్తో వాడి మెడను వంచాడు. మోకాలితో వీపు విరగబొడిచాడు. నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు వాడు. బకాసురుడు చచ్చాడని తెలుసుకుని, వాణ్ణి చంపిన భీముణ్ణి చూడటానికి ఏకచక్రపుర వాసులంతా తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. బకాసురుడి పీడ విరగడ చేసిన భీముణ్ణి, ధైర్యంగా అతడిని పంపిన కుంతిని వేనోళ్ల పొగిడారు. -
విషాదం: 'మహాభారత్' భీముడు కన్నుమూత
Mahabharat Bheem Actor Praveen Kumar Sobti Passes Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత మహాభారత్ సీరియల్లో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ (75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె నికునికా అధికారికంగా ధృవీకరించారు. గతరాత్రి 9.30నిమిషాలకు హార్ట్ ఎటాక్ కారణంగా ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆమె పేర్కొంది. కాగా మభాభారత్ సిరీయల్లో భీముడి పాత్రతో ప్రవీణ్‌కుమార్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. రెండు దశాబ్దాల పాటు యాభైకి పైగా సిరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల పలువురు బీటౌన్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
‘వైఎస్సార్ బీమా పథకం’ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
‘వైఎస్సార్ బీమా పథకం’ ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలతో ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ మరో కీలక ముందడుగు వేసింది. నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలిచేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ‘వైఎస్సార్ బీమా పథకం’ ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కోవిడ్ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేసినట్టు సీఎం జగన్ తెలిపారు. (చదవండి: ఏపీ: తుడాలో మరో 13 మండలాల విలీనం) ఆయన మాట్లాడుతూ.. ‘నిరుపేదల కోసం వైఎస్సార్ బీమా పథకం తెచ్చాం. కేంద్రం తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం భరిస్తుంది. ఏడాదికి రూ.510 కోట్లు ప్రీమియం చెల్లిస్తున్నాం. ఈ పథకంతో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్ జాబితా పెడతాం. ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా కవరేజీ ఉంటుంది. 18-50 ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు బీమా. సహజ మరణానికి రూ.2లక్షల బీమా. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.50 లక్షల బీమా. 51-70 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3లక్షలు బీమా. ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు తక్షణం రూ.10వేలు అందిస్తాం. గ్రామ సచివాలయం నుంచే రూ.10వేలు ఇస్తాం’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
ఆ రైతుల పుట్టినతేదీ.. జూలై ఒకటి
సాక్షి, హైదరాబాద్: రైతు బీమాకు సంబంధించి పుట్టినతేదీని పేర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో.. ఆధార్‌కార్డులో పుట్టినతేదీ లేని రైతులందరికీ ప్రభుత్వమే ఒక తేదీని నిర్ధారించింది. ఆధార్‌కార్డులో పుట్టిన సంవత్సరం తప్ప తేదీ నమోదు కాకుంటే.. ఆ రైతులందరికీ ‘జూలై 1వ తేదీ’ని పుట్టినతేదీగా పరిగణించేలా నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. చదువుకోకపోవడం, పలు ఇతర కారణాలతో పెద్ద సంఖ్యలో రైతుల ఆధార్ కార్డుల్లో పుట్టినతేదీ నమోదు కాలేదు. కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే నమోదైంది. అయితే పుట్టినతేదీ నమోదుకాని రైతులు ఎంతమంది ఉంటారన్న దానిపై స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. ఇక రైతు బీమా కోసం ఆధార్ నంబర్ నమోదును తప్పనిసరి చేశారు. దీనివల్ల ఒకటికి మించి పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతుల విషయంలో క్రమబద్ధీకరణ చేయడానికి వీలవుతుందని చెబుతున్నారు. ‘రైతు బంధు గ్రూప్ బీమా’ పథకం రైతు బీమాకు ‘తెలంగాణ రాష్ట్ర గ్రూప్ రైతుబంధు బీమా పథకం’గా నామకరణం చేశారు. రైతులకు పెట్టుబడి సొమ్ము ఇచ్చే పథకానికి ‘రైతుబంధు’గా పేరు పెట్టిన విషయం తెలిసిందే. అదే పేరును బీమా పథకానికి కూడా పెట్టడం గమనార్హం. ఈ పథకాన్ని కేవలం పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతులకే వర్తింపజేస్తారు. పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవసాయశాఖ వ్యవహరిస్తుంది. వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల నుంచి నామినీ నమోదు పత్రాలను సేకరిస్తారు. బీమా ధ్రువపత్రాలను ఆగస్టు 15 నుంచి రైతులకు అందజేయనున్నారు. ఆగస్టు 15 నుంచి బీమా.. ఏటా ఆగస్టు 15 నుంచి తదుపరి ఏడాది ఆగస్టు 14వ తేదీ వరకు బీమా కాలంగా పరిగణిస్తారు. బీమా ప్రీమియాన్ని ఏటా సవరిస్తారు. ఎవరైనా రైతు చనిపోతే.. పది రోజుల్లోగా వారి నామినీలకు ఆన్లైన్ పద్ధతిన సొమ్ము అందుతుంది. ఇక ఇప్పటివరకు భూములు లేకుండా.. కొత్తగా భూములు కొనుగోలు చేసి, పాస్ పుస్తకం పొందిన రైతుల పేర్లతో ప్రతీ నెల జాబితా తయారుచేస్తారు. పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ ఆ జాబితాలను ఎల్ఐసీకి అందజేస్తుంది. ప్రభుత్వం ఇలా అదనంగా చేరే రైతులకు సంబంధించి బీమా ప్రీమియాన్ని ప్రతి మూడు నెలలకోసారి ఎల్ఐసీకి చెల్లిస్తుంది. ప్రీమియం సొమ్మును వ్యవసాయశాఖ కమిషనర్ ద్వారా ఏటా ఆగస్టు ఒకటో తేదీలోపు ఎల్ఐసీకి చెల్లించాల్సి ఉంటుంది. తొలి ఏడాదికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై వ్యవసాయ శాఖ అధికారులకు అవసరమైన సమాచారాన్ని, శిక్షణను ఎల్ఐసీ ఇస్తుంది. ఇక బీమా నమూనా ధ్రువీకరణ పత్రాలను ఎల్ఐసీ వర్గాలు వ్యవసాయశాఖకు అందజేశాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులకూ ఇదేనా? రైతులు ఏ కారణంతో చనిపోయినా.. వారి కుటుంబాలకు బీమా పరిహారం అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూడా వర్తిస్తుందన్న అర్థం వస్తుందని అధికారవర్గాలు అంటున్నాయి. కానీ బీమా నిబంధనల ప్రకారం ఆత్మహత్యకు పాల్పడితే.. బీమా పరిహారం ఇవ్వరు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకునే రైతులకు సంబంధించి ఎలా పరిహారం చెల్లిస్తారనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు. ఒకవేళ రైతులెవరైనా ఆత్మహత్య చేసుకుంటే... కొత్త రైతు బీమా పథకం కింద పరిహారం ఇస్తారా, లేక పాత విధానంలా ప్రభుత్వమే పరిహారం ఇస్తుందా? అన్నది తేలలేదు. ఒకసారి ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించాక.. రైతు ఎలా చనిపోయాడో నిర్ధారణ చేయాల్సిన బాధ్యత సర్కారుకు ఉండదు. అది ఎల్ఐసీకి, రైతు కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అవుతుంది. అయితే ఒకవేళ ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకున్నా.. సాధారణ మరణంగానే ధ్రువీకరణ ఇచ్చి బీమా పరిహారం చెల్లించే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఇది అత్యంత సున్నితమైన అంశం కావడంతో అధికారులెవరూ బహిరంగంగా వ్యాఖ్యానించడానికి సిద్ధంగా లేరు. రైతు బీమా కింద అందజేసే ధ్రువపత్రం నమూనా -
ఒంటిమిట్ట ఘటనలో బాధితులకు పరిహారం
వైఎస్సార్ జిల్లా : ఒంటిమిట్ట ఘటనపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షబీభత్సానికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మృతిచెందిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి అధికారులు బాధితులకు పరిహారం వివరాలు వెల్లడించారు. సుమారు 6.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనలో 32 మందికి గాయాలు అయ్యాయని, మృతులకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో రూ.10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, మరో రూ.5 లక్షలు చంద్రన్న బీమా నుంచి ఇస్తున్నట్లు వివరించారు. క్షతగాత్రులకు లక్ష రూపాయలు, బాధితులకు మొత్తం 70 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించనుంది. 825 హెక్టర్లలో అరటి, బొప్పాయి పంటల నష్టం జరిగింది. రూ.11.72.కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. -
నెలకు రూపాయితో రూ.2 లక్షల బీమా
బద్వేలు: భారత ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక సురక్ష పథకాలలో ముఖ్యమైనది ప్రధానమంత్రి సురక్ష బీమా (పీఎంఎస్బీవై) ఒకటి. ప్రమాదవశాత్తు జరిగిన మరణాలకు, వైకల్యానికి ఏడాది సమయానికి బీమా సౌకర్యం కల్పిస్తుంది. ప్రతి ఏటా దీన్ని తిరిగి పొడగించుకోవాలి. కనీస ప్రీమియం రేటు ఏడాదికి రూ.12గా ఉండే ఈ పాలసీ పేదవాళ్లకు, అల్పాదాయ వర్గాలకు వరంగా చెప్పవచ్చు. ఈ బీమా యోజనలో మరణం/శ్వాశిత వైకల్యం సంభవిస్తే రూ.రెండు లక్షల జీవిత బీమా, శాశ్విత పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ.లక్ష బీమా సౌకర్యం అందుతుంది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి ఈ బీమా సౌకర్యం పొందవచ్చు. ఈ బీమా పథకంపై పూర్తి వివరాలు ఇలా.. ప్రీమియం:ఒక వ్యకి ఏడాదికి జూన్ ఒకటిగాని లేదా అంతకంటే ముందుగాని తమ బ్యాంకుఖాతా నుంచి రూ.12 ఆటో డెబిట్ పద్ధతిలో వసూలు చేస్తారు. జూన్ ఒకటి తరువాత ప్రీమియం చెల్లిస్తే తరువాత నెల నుంచి బీమా సౌకర్యం వర్తిస్తుంది. అర్హతలు: భాగస్వామ్య బ్యాంకులో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పొదుపు ఖాతాదారులు ఆటో డెబిట్‌ను అంగీకరించి పై విధానంలో పథకంలో చేరవచ్చు. బీమా వర్తించని సందర్భాలు:70 ఏళ్ల వయస్సు దాటిన తరువాత, బ్యాం కు ఖాతా మూసివేసినప్పుడు, బీమాను కొనసాగించడానికి ఖాతాలో తగినంత సొమ్ము లేనప్పుడు బీమా వర్తించదు. ప్రీమియం పంపకం:బీమా సంస్థకు చెల్లించే వార్షిక ప్రీమియం ఒక సభ్యుడికి ఏడాదికి రూ.10 మాత్రమే. మిగిలిన రెండు రూపాయలలో బీసీ/మైక్రో/కార్పొరేట్/ఏజెంట్‌కు ఖర్చుల చెల్లింపు ఒక సభ్యుడికి ఏడాదికి రూపాయి. బ్యాంకు నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఏడాదికి ఒక రూపాయి ఇస్తారు. ♦ ఈ బీమా పథకం ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా మరణం, ప్రమాదాలు/అవిటితనం సంభవిస్తే పాలసీ కింద బీమా వర్తిస్తుంది. ఆత్మహత్యలకు వర్తించదు. హత్యలకు వర్తిస్తుంది. క్లెయిం పొందడమిలా..: అకాల మరణం/అవిటితనం పొందితే బీమా పరిహారం పొందేందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు చూపించాలి. బీమాదారుడు అకస్మాత్తుగా మరణిస్తే పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదం గురించి అతడి సంబంధీకులు రిపోర్టు ఇవ్వాలి. ఆస్పత్రి రికార్డుల ద్వారా వెంటనే ధ్రువీకరించాల్సి ఉంటుంది. పాలసీ దరఖాస్తులో పేర్కొన్న నామినీ క్లెయిం చేసుకోవచ్చు. అదే అవిటితనం గురించి క్లెయిం చేసుకోవాలంటే సూచించబడిన మొత్తాన్ని పాలసీదారుడి ఖాతాలో జమ చేస్తారు. -
కార్మికుల సంక్షేమానికి తూట్లు
చంద్రన్న బీమాకు నిధుల మళ్లింపు బాబు తీరుపై నేడు ‘చలో కలెక్టరేట్’కు కార్మిక సంఘాల పిలుపు కపిలేశ్వరపురం (మండపేట) : ఆయనో మాటల మాంత్రికుడు..చేసేవన్నీ పాత పనులే అయినా కొత్తవని చెప్పేందుకు తాపత్రయపడతాడు. అందుకు తన అనుభవాన్నంతా రంగరించి కొత్త పథకాలను తయారు చేస్తాడు. దానికి తన పేరు జోడించుకుని ప్రచారం ఊదరకొడతాడు.. అలా పుట్టుకొచ్చిందే చంద్రన్న బీమా పథకం...దీని ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ములు ప్రభుత్వం కొత్తగా కేటాయించిన సొమ్ములు కావు. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డువి. బోర్డు నిధులు ఆ కార్మికులు కోసం మాత్రమే ఖర్చు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం పక్కనపెట్టి నిధులను మళ్లింపునకు పాల్పడ్డాడు. ఇదేం ఘోరమంటూ భవన నిర్మాణ కార్మికులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో జీపు జాతా నిర్వహిస్తూ ప్రభుత్వం మోసకారితనాన్ని ఎండగడుతున్నారు. కార్మికులంతా సోమవారం ఛలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు. భవనం నిర్మాణానికి మట్టి తీసే కూలి నుంచి పూర్తయ్యాకా రంగు వేసే కార్మికుని వరకూ గల 33 రకాలు పనివారు భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి వస్తారు. జిల్లాలో ఈ పనివారు సుమారు ఐదు లక్షలు మంది ఉన్నారు. అత్యధికంగా తాపీ, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, రాడ్ బెండింగ్, టైల్స్, మార్బుల్ పనివారు, కూలీలు ఉంటారు. వీరి సంక్షేమం కోసం కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పలు విధాల ఆదుకునే ఏర్పాటు చట్టం కల్పించింది. సంక్షేమ బోర్డు నిధులు మళ్లింపు ఇలా.. 318/2011 నంబరుగల కేసులో 2013 నంబరులో సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులు వారి కోసమే ఖర్చు చేయాలని తీర్పు చెప్పింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు తగిన ఉత్తర్వులు కూడా అందాయి. రాష్ట్ర ప్రభుత్వం 2015లో ట్రాన్స్‌పోర్టు బీమా కోసం రూ.71 కోట్లను, చంద్రన్న బీమా పేరుతో రూ.241 కోట్లను ఇన్సూరెన్స్æ కంపెనీకి చెల్లించింది. చంద్రన్న బీమా పథకం ప్రచారానికి రూ.31 కోట్లు ఖర్చు చేసింది. చలివేంద్రాలు పేరుతో రూ.20 కోట్లు ఆస్పత్రుల్లో డెలివరీ కిట్లు పేరుతో మరో రూ. 20 కోట్లు మళ్లించింది. రూ.1300 కోట్ల సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం ఖజానా పీడీ అకౌంట్‌కు మళ్లించేందుకు ప్రయత్నం జరుగుతుందంటూ సీఐటీయూ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రన్న బీమా సంగతి ఇదీ.. సంక్షేమ బోర్డు చట్టపరిధిలోనిది కావడంతో శాశ్వత ప్రయోజనాలను కార్మికులు పొందే వీలుంటుంది.. చంద్రన్న బీమా కేవలం ఓ పథకం మాత్రమే. అందుకే చంద్రన్న బీమా పేరుతో సంక్షేమ బోర్డును తమకు దూరం చేయవద్దంటూ కార్మికులు ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. అందుకు వారు చెప్పే వివరాలు ఇలా ఉన్నాయి...2016 అక్టోబరు రెండున ప్రారంభమైన చంద్రన్న బీమా పథకం అమలుతో భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం ప్రారంభం కారణంగా సంక్షేమ బోర్డులో నుంచి ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత అంగవైకల్యాలకు సాయమందించడం తొలగించి చంద్రన్న బీమా పథకం ద్వారా క్లెయిం చేసుకోమని మెమో 3549ను జారీ చేశారు. సంక్షేమ బోర్డులో సహజ మరణానికి రూ.80 వేలు పొందే వీలు కాస్తా చంద్రన్న బీమా రూ.30 వేలుకు తగ్గిపోతుంది. రూ.50 వేలు నష్టపోతున్నాడు. సంక్షేమ బోర్డులో శాశ్వత అంగ వైకల్యానికి రూ.ఐదు లక్షలు వరకూ అందే సాయం కాస్తా ఈ బీమాలో రూ.3,62,500 మాత్రమే అందుకుంటాడు. అధికారుల నిర్లక్ష్యం పథకాల లబ్దికి కార్మికుడు ఉన్న సమీపంలోని లేబర్ కార్యాలయంలో తన పేరుతును నమోదు చేయించుకుని గుర్తింపు కార్డు పొందాలి . దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోగా గుర్తింపుకార్డు ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఆరేడు నెలలకు కానీ కార్డు రాని పరిస్థితి. కాన్పు ఖర్చులు పొందేందుకు బర్త్ సర్టిఫికెట్ జత చేయాలంటూ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న వాదన ఉంది. సమరానికి సన్నద్ధం సీఈటీయూ అనుబంధ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుంచి జీపు జాతాను నిర్వహిస్తూ ప్రజా వ్యతిరేక చంద్రబాబు విధానాలపై ప్రచారం చేస్తున్నారు. సోమవారం చలో కాకినాడ పేరుతో కలెక్టరు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని రూపొందించారు. కార్మికుల డిమాండ్లు ఇవే.. చంద్రన్న బీమా పథకానికి మళ్లించిన రూ.241 కోట్లను సంక్షేమ బోర్డుకు తిరిగి చెల్లించాలి. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలి. 60 ఏళ్లు నిండిన కార్మికునికి రూ.మూడు వేలు గ్యారంటీ పింఛను ఇవ్వాలి. ఈఎస్ఐ, గృహ నిర్మాణ రుణాలను అందజేయాలి. పెద్ద నోట్లు సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ. పదివేల చొప్పున సంక్షేమ బోర్డు నిధుల్లోంచి అందజేయాలి. జాతీయ కార్మిక సంఘాల దృష్టికి తీసుకెళ్తాం చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలను జాతీయ కార్మిక సంఘాల దృష్టికి తీసుకెళ్తాం. వారితో ఉమ్మడి కార్యాచరణ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చే ఆలోచన చేస్తున్నాం. సోమవారం నిర్వహించే చలో కలెక్టరేట్‌కు కార్మికులను సన్నద్ధం చేస్తున్నాం. - చెక్కల రాజ్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ -
జిల్లాలో 3.77 లక్షల మందికి చంద్రన్నబీమా
మెప్మా ఏడీఎంసీ మోహన్ కుమార్ పిఠాపురం : జిల్లాలో 3.77 లక్షల మందికి చంద్రన్న బీమా కల్పించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచినట్టు మెప్మా ఏడీఎంసీ కె.మోహన్ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో బీమా రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 576 చంద్రన్న బీమా క్లెయిమ్‌లు నమోదు కాగా 441 క్లెయిమ్‌లు ఎల్ఐసీకి అప్పగించామన్నారు. వీటిలో 331 మందికి సొమ్ములు అందజేసినట్లు ఆయన తెలిపారు. జనవరి 31 నుంచి లబ్ధిదారుల ఎంపిక నిలిపివేశామన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులు ఎవరైనా మృతి చెందితే 48 గంటలలోపు సంబంధిత కార్యాలయంలో మరణ వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. అలా కాకుండా ఆలస్యం అయితే క్లెయిమ్‌లు రావడం ఆలస్యం అవుతుందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే నియమించిన బీమామిత్రల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు. అభయహస్తం పథకంలో గతంలో ఇచ్చే దహన సంస్కార ఖర్చులు రూ.5 వేలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అభయహస్తం లబ్ధిదారులు రూ.385 చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు అభయహస్తంలో 2,61,600 మంది ఉండగా విద్యార్థులకు రూ.1200 చొప్పున స్కాలర్షిప్పులు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 2440 విద్యార్థులకు రూ.29,28,000 స్కాలర్షిప్పులు ఇస్తున్నామన్నారు. -
చంద్రన్న బీమా జీవో కాపీలు దహనం
ప్రభుత్వ ఆదేశాలపై భగ్గుమన్న భవన నిర్మాణ కార్మికులు పెద్దాపురంలో నిరసన ప్రదర్శన పెద్దాపురం : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును చంద్రన్న బీమా పథకంలో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై పెద్దాపురం అర్బన్, రూరల్ ప్రాంతాల భవన నిర్మాణ కార్మికులు మండిపడుతున్నారు.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కార్మికులంతా రోడెక్కారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనం నుంచి శోభా థియేటర్, నువ్వులగుంట వీధి, పాత ఆసుపత్రి మీదుగా మెయిన్ రోడ్డు వరకూ వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గడిగట్ట సత్తిబాబు, సీపీఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఎత్తివేసేందుకే ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసిందన్నారు. సంక్షేమ బోర్డును చంద్రన్న బీమాలో కలిపితే భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను వారు దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, కంచుమర్తి కాటంరాజు, మాగాపు నాగు, రాజమహేంద్రపు రామారావు, సిద్ధాంతపు వెంకటరమణ, పాలిపర్తి భద్రరావు, కర్రి వీరశివ, ముమ్మన శ్రీను, బల్ల రాంబాబు, బుడత రవీంద్ర, గంగాధర్ పాల్గొన్నారు. -
సంగమస్నానం..పుణ్యఫలం
-భీమా, కష్ణా కలిసేది తంగిడి వద్దే.. - శ్రీపాదవల్లభుడు స్నానం ఆచరించిన క్షేత్రం ∙ నివత్తి సంగమంగా ప్రసిద్ధి నదులు కలిసేచోట సంగమ స్నానం చేస్తే పాపాలు నశించి పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.. జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి.. మాగనూర్ మండలం తంగిడి వద్ద భీమా, కష్ణానదులు కలుస్తాయి.. అలంపూర్ పుణ్యక్షేత్రానికి 10కి.మీ. దూరంలో గొందిమల్ల వద్ద, అలాగే కొల్లా మండలం సోమశిల సమీపంలో సప్త నదులు కలుస్తాయి.. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే కష్ణా పుష్కరాల్లో భాగంగా ఈ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు.. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది. మాగనూర్ : జగద్గురు దత్తాత్రేయ మహాస్వామి మొదటి అవతార పురుషుడైన శ్రీపాద వల్లభుడు తంగిడి క్షేత్రంలోని కష్ణా, భీమా నదుల సంగమ క్షేత్రంలో స్నానం ఆచరించి తపస్సును చేసినట్లు వేదాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ క్షేత్రాన్ని నివతి సంగమంగా పేరొంది. మాగనూర్ మండలంలోని తంగిడి వద్ద ఈ నదులు కలిసే చోటును సంగమ క్షేత్రంగా అభివర్ణిస్తారు. దీనికి ప్రత్యేక స్థానముందని, ఇక్కడ దేవతలు, రుషులు, మునులు తపస్సును ఆచరించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి కష్ణమ్మ అడుగిడుతున్న ఈ ప్రాంతం ఒకప్పుడు దివ్యక్షేత్రంగా వెలుగొందింది. దత్తాత్రేయ మొదటి మానవ అవతారమెత్తిన శ్రీపాదవల్లభుడు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. 16ఏళ్ల ప్రాయంలో దేశ సంచారం చేస్తూ కొన్నాళ్లకు కార్తీకపౌర్ణమి నాడు తంగిడిలోని నివతి సంగమానికి చేరుకున్నారు. ఇక్కడ కొన్నేళ్లపాటు తపస్సు ఆచరించి అనంతరం కర్ణాటకలోని కుర్మగడ్డకు వెళ్లారు. ఇప్పటికీ ఈ సంగమంలో శ్రీపాదుడు తపస్సును చేసిన వినాయక విగ్రహం, ఆయన పాదుకలు, శివలింగం ఉన్నాయి. ఆయన ఇక్కడి నుండి కుర్మగడ్డకు నడుచుకుంటు వెళ్లిన మార్గంలో నదిలోని రాళ్లు నల్లరాయితో రోడ్డు వేసినట్లు కన్పిస్తాయి. ఈ విషయం తెలుసుకున్న విఠల్‌బాబా ఇక్కడే ఐదేళ్ల క్రితం ఇక్కడ దత్తభీమేశ్వర ఆలయం నిర్మించారు. ఈ నివత్తి సంగమంలో స్నానం ఆచరించిన వారికి పాపాలు నివత్తి అవుతాయని అంటారు. ఇలాంటి క్షేత్రం మరెక్కడా లేదని, ఇది ఒక మానస సరోవరమని దత్త పీఠాధిపతి నిత్యపూర్ణానంద సరస్వతి మహాస్వామి అంటున్నారు. పుష్కరాల పుట్టుక పుష్కరాల పుట్టకపై పురాణాల్లో ఓ కథ ఉంది. గౌతమ మహర్షి ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందేందుకు ఇంద్రుడు బ్రహ్మదేవున్ని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలం ద్వారా పుష్కరుడిని స్మరించి కొంత నీటిని ఒక సరస్సులో చిలకరిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఆ సరస్సులో స్నానం ఆచరించిన తర్వాత పాప విముక్తి అయ్యెను. ఇది చూసిన బహస్పతి ఇంతటి మహత్తరమైన, పాప విముక్తిని చేసే పుష్కరుడు నిరంతరం బ్రహ్మదేవుని వద్ద ఉంటే లోకకల్యాణం ఎలా అని ఆలోచించాడు. అప్పుడే బ్రహ్మదేవున్ని బహస్పతి ప్రార్థించి ఆయన వద్ద ఉన్న పుష్కరుడిని తనతో పంపించాలని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు సమ్మతించి పుష్కరుడిని బహస్పతిని అనుసరించమని తెలిపాడు. కాగా పుష్కరుడు బ్రహ్మదేవున్ని సాన్నిహిత్యం వదులడం ఇష్టపడలేదు. నీవూ వస్తే బహస్పతి వెంట వెళ్తానని పుష్కరుడు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఓ తీర్థమహారాజా బహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు ఏడాదిలో 12రోజులపాటు తాను, సకల దేవతలు ఉంటారని అన్నాడు. అప్పటి నుంచి బహస్పతి ఏరాశిలో ప్రవేశిస్తే ఆనదికి పుష్కరాలు వచ్చినట్లు సంప్రదాయం ఉంది. ఈ12రోజులు సకల దేవతలు పుష్కరం వచ్చే నదిలో కొలువై ఉంటారు. కాబట్టి ప్రజలు పుష్కర సమయంలో స్నానం ఆచిరిస్తే సకలపాపాలు, దోషాలు పోయి, పుణ్యం లభిస్తుందని చెబుతారు. సోమశిల వద్ద సప్తనదీ సంగమం భక్తులకు ఓ మధుర జ్ఞాపకం కొల్లాపూర్ : మండలంలోని సోమశిల సమీపంలో ప్రవహిస్తున్న కష్ణానది సప్తనదీ సంగమానికి నిలయం. ఏపీ–కర్నూలు జిల్లాలోని నదులతోపాటు మహబూబ్‌నగర్‌లో ప్రవహించే నదులు మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల సమీపంలో సంగమమవుతాయి. పుష్కరాల్లో కష్ణానదిలో స్నానమాచరించేందుకు విచ్చేసే భక్తులకు సప్తనదీ సంగమ తీరంలో స్నానం మధుర జ్ఞాపకంగా మిగలనుంది. ఇతర రాష్ట్రాల నుంచి కష్ణ, వేణి, తుంగ, భద్ర నదులు ప్రవహిస్తూ తెలుగు రాష్ట్రాల్లోకి వస్తుండగా మలపహారిని, భవనాసిని, భీమరథి అనేవి కష్ణానదిలో కలుస్తాయి. భవనాసిని నది కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద ఉద్భవిస్తుంది. సప్త నదుల సంగమ ప్రాంతం కావడంతో ఇక్కడి ప్రాంతానికి సంగమేశ్వరం పేరు వచ్చింది. ఇక్కడ మహాభారత కాలంనాటి ధర్మరాజు ప్రతిష్టించిన వేప లింగం నేటికీ సంగమేశ్వరునిగా పూజలందుకుంటోంది. ఈ గుడి సోమశిల సమీపంలో ప్రవహిస్తున్న కష్ణానది అవతల కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం నది నీళ్లు గుడి చుట్టూ చేరుకున్నాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్ పెరిగితేఇది నీటిలో మునిగిపోతుంది. సంగమేశ్వరం వద్ద స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ గుడికి ప్రస్తుతం చేరుకోవడం సాధ్యం కాదు. దీంతో సప్తనదుల నీళ్లు ప్రవహించే మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిలలోనే కష్ణానది పుణ్య స్నానాలు ఆచరించినా పుణ్యఫలం లభిస్తుందని వేదపండితులు చెబుతున్నారు. సప్తనదుల సమాహారం గొందిమల్ల అలంపూర్ రూరల్ : కష్ణా, తుంగభద్రా నదుల సంగమ క్షేత్రమే గొందిమల్ల. అలంపూర్ పుణ్యక్షేత్రానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్లమల ప్రాంతమే నేడు గొందిమల్లగా ప్రసిద్ధిగాంచింది. తుంగ సాక్షత్ నారాయణదేహ–భద్ర సాక్షత్ రుద్రదేహ అని శాస్త్రం చెబుతోంది. అంటే తుంగ అనేది నారాయణుడి దేహం, భద్ర అనేది ఈశ్వరుడి దేహమని అర్థం. ఈ రెండు శివకేశవులకు ప్రతిరూపం. వీటి సంగమమే తుంగభద్రగా పిలుస్తున్నారు. కాగా పూర్వం ఈ ప్రాంతం అనేక గుండ్లమలతో నిండి ఉండేది. అంటే రాళ్లదిబ్బతో అలరాలేది. ఆ ప్రాంతంలో కష్ణ, వేణి, భీమ, ఘటప్రభ, మలప్రభ నదులు, తుంగ–భద్ర అన్నీ కలిపి ఏడు నదుల సంగమ క్షేత్రంగా ఏర్పడింది. గుండ్లమల దగ్గర పూర్వం నది పరీవాహక ప్రాంతంలో అలనాటి రాజుల కోటలు ఉండేవి. అయితే అవి వరదలో కొట్టుకుపోయి కాలగర్భంలో కలసిపోయాయి. ప్రస్తుతం జోగుళాంబ ఘాట్‌గా నిర్మిస్తున్న ఈ ప్రాంతంలో కొత్తపేట ఉండేది. పూర్వం చాలా మంది కష్ణా తుంగభద్రానదికి వరదలు ఎక్కువగా వస్తాయని సంగమేశ్వరం వెళ్లడానికి అవకాశం లేక గొందిమల్ల దగ్గరే ఉండి జప తపాదులు, స్నానాలు ఆచరించేవారు. తుంగభద్ర ఇక్కడ ఉత్తర వాహినిగా, కష్ణా తూర్పుముఖంగా ప్రవహించేది. ఇలాంటి సప్తనది సంగమ క్షేత్రాల్లో ఎంతోమంది ఉపాసకులు ఈ నది తీరంలోని గుండ్లపై కూర్చుని అనుష్టానాలు చేసేవారు. అంతేగాక మాణిక్‌నగర్ సంస్థానం ముఖ్య పీఠాధిపతి అప్పదేశ్పాండే, మానిక్‌ప్రభు మహరాజ్ లాంటి మహాపురుషులు చాతుర్మాస దీక్షలో భాగంగా అప్పట్లో అక్కడ అనుష్టానాదులు చేసినవారే. -
పెన్షన్... ఎలా కావాలంటే అలా..
పదవీ విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే తగినంత రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవాలి. ఇందుకు బీమా పథకాలు సరైనవి. బీమా కంపెనీలు అందించే పథకాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఇమీడియెట్ పెన్షన్, డిఫర్డ్ పెన్షన్ ప్లాన్స్. ఇందులో ఇమీడియెట్ పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకుంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత నుంచి పెన్షన్ రావడం మొదలవుతుంది. అదే డిఫర్డ్ యాన్యుటీ తీసుకుంటే ఒక పరిమిత కాలానికి ఇన్వెస్ట్ చేసు కుంటూ పోతే కాలపరిమితి తీరిన తర్వాత పెన్షన్ రావడం మొదలవుతుంది. ఇలా ఇన్వెస్ట్ చేస్తున్న సమయంలో ఆ మొత్తంపై సెక్షన్ 80సీ ప్రకారం పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. డిఫర్డ్ యాన్యుటీ పథకాల్లో కాలపరిమితి తీరిన తర్వాత అవసరమైతే గరిష్టంగా మూడో వంతు మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తం యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు పథకాల్లో దేనిని ఎంచుకున్నా చేతికి వచ్చే పెన్షన్ మాత్రం మీరు ఎంచుకున్న యాన్యుటీ పథకంపైనే ఆధారపడి ఉంటుంది. బీమా కంపెనీలు అనేక రకాల యాన్యుటీ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. జీవిత కాలం పెన్షన్: పాలసీదారుడు జీవించినంత కాలం పెన్షన్ వస్తుంది. మరణానంతరం ఆగిపోతుంది. ఇక నామినీలకు ఎటువంటి చెల్లింపులు ఉండవు. అందుకే ఈ ఆప్షన్ ఎంచుకుంటే మిగిలిన వాటికంటే పెన్షన్ ఎక్కువ లభిస్తుంది. నామినీకి కావాలంటే: ఇన్వెస్ట్ చేసిన మొత్తం నామినీకి రావడమే కాకుండా జీవిత కాలం పెన్షన్ వచ్చే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని ఎంచుకుంటే పాలసీదారుడు మరణించే వరకు పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత నామినీకి ఇన్వెస్ట్ చేసిన మొత్తం వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. కాని పై ఆప్షన్‌తో పోలిస్తే ఈ ఆప్షన్లో నెలవారీ అందుకునే పెన్షన్ మొత్తం తగ్గుతుంది. పరిమిత కాలానికి పెన్షన్: జీవిత కాలం కాకుండా ముందుగా నిర్దేశించుకున్న కాలానికి పెన్షన్ లభించే విధంగా కూడా ఎంచుకోవచ్చు. ఇందులో కాలపరిమితి తీరిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉన్నా పెన్షన్ రాదు. అలా కాకుండా ఎంచుకున్న కాలపరిమితి లోపే పాలసీదారుడు మరణిస్తే కాలపరిమితి ముగిసేవరకు నామినీకి పెన్షన్ లభిస్తుంది. జీవిత భాగస్వామికి: పాలసీదారుడు జీవించినంత కాలం పెన్షన్ రావడమే కాకుండా మరణం తర్వాత తనపై ఆధారపడిన జీవిత భాగస్వామికి పెన్షన్ లభించే యాన్యుటీ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ కార్బన్ క్రెడిట్ కార్డు ఆన్లైన్ లావాదేవీలపై ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా పూర్తి సురక్షితమైన అధునాతన టెక్నాలజీతో కూడిన క్రెడిట్ కార్డును ఐసీఐసీఐ బ్యాంక్ ప్రవేశపెట్టింది. ‘కార్బన్’ పేరుతో విడుదల చేసిన ఈ కార్డు వీసా కోడ్సెక్యూర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. కార్డు వెనుక భాగంలో ఆల్ఫాన్యూమరిక్ ఎల్సీడీ స్క్రీన్, 12 అంకెల టచ్ బటన్ కీప్యాడ్, పవర్ బటన్స్ ఉంటాయి. ఈ కార్డును ఉపయోగించే ముందు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్లో కోడ్ సెక్యూర్ పిన్ను పొందాలి. ఈ కోడ్ సెక్యూర్ పిన్ను వినియోగించి వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను జనరేట్ చేయడం ద్వారా కార్డుపై లావాదేవీలు జరుపుకోవచ్చు. యూబీఐలో రెలిగేర్ పాలసీలు యూనియన్ బ్యాంకులో రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలను విక్రయించే విధంగా ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన వైద్య బీమా పథకాలు యూనియన్ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి.