
Mahabharat Bheem Actor Praveen Kumar Sobti Passes Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత మహాభారత్ సీరియల్‌లో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ (75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె నికునికా అధికారికంగా ధృవీకరించారు. గతరాత్రి 9.30నిమిషాలకు హార్ట్ ఎటాక్ కారణంగా ఇంట్లోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆమె పేర్కొంది.
కాగా మభాభారత్ సిరీయల్‌లో భీముడి పాత్రతో ప్రవీణ్‌కుమార్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. రెండు దశాబ్దాల పాటు యాభైకి పైగా సిరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రవీణ్ కుమార్ మృతి పట్ల పలువురు బీటౌన్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment