
వైఎస్సార్ జిల్లా : ఒంటిమిట్ట ఘటనపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షబీభత్సానికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మృతిచెందిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి అధికారులు బాధితులకు పరిహారం వివరాలు వెల్లడించారు. సుమారు 6.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనలో 32 మందికి గాయాలు అయ్యాయని, మృతులకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వీటిలో రూ.10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, మరో రూ.5 లక్షలు చంద్రన్న బీమా నుంచి ఇస్తున్నట్లు వివరించారు. క్షతగాత్రులకు లక్ష రూపాయలు, బాధితులకు మొత్తం 70 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించనుంది. 825 హెక్టర్లలో అరటి, బొప్పాయి పంటల నష్టం జరిగింది. రూ.11.72.కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment