Ontimitta Ram temple
-
Vontimitta: కమనీయం.. సీతారాముల కల్యాణం
సాక్షి, ఒంటిమిట్ట: పండు వెన్నెల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం శుక్రవారం రాత్రి కమనీయంగా, కనులపండువగా జరిగింది. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయం సమీపంలో అత్యంత సుందరంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కల్యాణ వేదికలో ఈ వేడుక సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణోత్సవాన్ని ఆద్యంతం తిలకించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి కల్యాణాన్ని తిలకించి పులకించారు. సాయంత్రం 5.48 గంటలకు విమానంలో కడప విమానాశ్రయానికి వచ్చిన సీఎం జగన్ రోడ్డుమార్గాన ఒంటిమిట్టకు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం సీఎం వైఎస్ జగన్ టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి రాత్రి 7.35 గంటలకు శ్రీకోదండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదపండితులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం 8.07 గంటలకు ముఖ్యమంత్రి శ్రీసీతారామస్వామి కల్యాణవేదిక వద్దకు చేరుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీతారాములకు సీఎం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ జగదభిరాముడి కల్యాణవేడుక వైభవంగా సాగింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణం జరిపిస్తున్న పండితులు 9.28 గంటలకు మంగళసూత్రధారణ, 9.30 గంటలకు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కల్యాణోత్సవం 9.40 గంటల వరకు కొనసాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. సుదూరం నుంచి కూడా కల్యాణాన్ని వీక్షించేందుకు టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ అందజేశారు. స్వామి కల్యాణోత్సవంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోదండరాముడికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు శ్రీ కోదండరామయ్య కల్యాణోత్సవం సందర్భంగా తిరుమల నుంచి సుమారు 400 గ్రాముల బరువున్న కిరీటాలు, పట్టువస్త్రాలు కానుకగా పంపారు. మూలమూర్తికి ఒకటి, ఉత్సవమూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టువస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వీటిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్లి అర్చకులకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. సీతారాములకు గవర్నర్ దంపతుల పట్టువస్త్రాలు ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహించిన కల్యాణోత్సవంలో వధూవరులు సీతారాములకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు రాజ్‌భవన్ తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. రాజ్‌భవన్ ఉప కార్యదర్శి విశ్వనాథ సన్యాసిరావు శుక్రవారం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆలయ అర్చకులకు అందజేశారు. -
నేడే ఒంటిమిట్టలో సీతారాములు కల్యాణం..పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
-
సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే భాగ్యానికి భక్తజనం నోచుకోలేదు. ఈసారి లక్షలాదిమంది భక్తుల సమక్షంలో భారీ ఎత్తున కల్యాణోత్సవం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరగనున్న జగనానందకారకుడి జగత్కల్యాణానికి మిథిలా మండపం ముస్తాబైంది. గరుడవాహనంపై శ్రీరామచంద్రుడు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు గురువారం ఉదయం మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన కోదండరాముడు రాత్రి 8 నుంచి 9:30 గంటల వరకు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కోదండరాముడు శివధనుర్భంగాలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. -
వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. 15వ తేదీ సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఒంటిమిట్టకు వెళ్లి, శ్రీ సీతారాముల వారిని దర్శించుకుంటారు. పట్టువస్త్రాలను సమర్పించి కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. రాత్రి కడపలో బస చేస్తారు. 16వ తేదీ ఉదయం రెండు వివాహ వేడుకల్లో పాల్గొని, అక్కడి నుంచి కర్నూలు చేరుకుంటారు. అక్కడ ఓ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. -
ఒంటిమిట్ట ఘటనలో బాధితులకు పరిహారం
వైఎస్సార్ జిల్లా : ఒంటిమిట్ట ఘటనపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షబీభత్సానికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మృతిచెందిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి అధికారులు బాధితులకు పరిహారం వివరాలు వెల్లడించారు. సుమారు 6.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనలో 32 మందికి గాయాలు అయ్యాయని, మృతులకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో రూ.10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, మరో రూ.5 లక్షలు చంద్రన్న బీమా నుంచి ఇస్తున్నట్లు వివరించారు. క్షతగాత్రులకు లక్ష రూపాయలు, బాధితులకు మొత్తం 70 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించనుంది. 825 హెక్టర్లలో అరటి, బొప్పాయి పంటల నష్టం జరిగింది. రూ.11.72.కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. -
హనుమంత వాహనంపై శ్రీవారి ఊరేగింపు
సాక్షి, తిరుపతి : తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం శ్రీరామస్వామి వారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. స్వామి వారి ఊరేగింపును తిలకించేందుకు భక్తులు అశేషంగా తిరుమలకు చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లోని ఒంటిమిట్ట, భద్రాచల దేవస్థానాల్లో సీతారామ కళ్యాణం కన్నులపండువగా జరగనుంది. -
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
వైభవంగా ధ్వజారోహణ ఒంటిమిట్ట రామాలయం (రాజంపేట): వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట (ఏకశిలానగరం)లో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. ముత్యాల తలంబ్రాల ఊరేగింపు శ్రీసీతారాముల కల్యాణానికి టీటీడీ తీసుకొ చ్చిన ముత్యాల తలంబ్రాలను ఊరేగించారు. టీటీడీ చైర్మన్ చదల వాడ కృష్ణమూర్తి, ప్రభు త్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ముత్యాల తలంబ్రా లను ఆలయంలోని మూలవర్ల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. 10న కల్యాణోత్సవం ఒంటిమిట్ట రామాలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. ఆలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విçస్తృతంగా ఏర్పాట్లు చేసిందన్నారు. ఈనెల 10న సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కల్యాణానికి గవర్నర్, ముఖ్యమంత్రి హాజరవుతారని చెప్పారు.