
టాలీవుడ్ మెచో స్టార్ గోపీచంద్ రీసెంట్‌గా వచ్చిన 'రామబాణం' గురితప్పింది. దీంతో చాలా రోజుల నుంచి కమ్ బ్యాక్ అయ్యేందుకు ఆయన ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నాడు. రొటీన్ కథలతో వస్తున్నడంతో ఆయనకు ఏదీ సెట్ కాలేదనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది! కన్నడ దర్శకుడు ఏ హర్షతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేడు(జూన్ 12) తన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్‌ను ఖరారు చేసి, పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. పోస్టర్లో పొడవైన మీసకట్టుతో రగడ్ లుక్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నాడు. పోస్టర్‌తోనే భారీ అంచనాలు పెంచేశాడు.
(ఇదీ చదవండి: Jr NTR: ఒక్క యాడ్ కోసం అన్ని కోట్లు.. ఇదీ తారక్ రేంజ్!)
2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్‌గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్‌లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్ట్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు.
#BHIMAA pic.twitter.com/a4R9gQb6mK
— Gopichand (@YoursGopichand) June 12, 2023
(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment