
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదైన మొత్తం క్లయింట్ ఖాతాల సంఖ్య 20 కోట్ల మార్కును దాటింది. డిజిటల్ పరివర్తన, నూతన సాంకేతిక ఆవిష్కరణలు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. ఎనిమిది నెలల క్రితం 16.9 కోట్ల స్థాయిలో ఉండగా స్వల్ప వ్యవధిలోనే ఈ మైలురాయిని దాటినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: ఎన్‌ఎస్‌ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్‌సైట్
భారత వృద్ధి గాథపై ఇన్వెస్టర్లకున్న పటిష్టమైన విశ్వాసానికి ఇది నిదర్శనమని ఎన్‌ఎస్‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 3.6 కోట్ల ఖాతాలు ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్ (2.2 కోట్లు), గుజరాత్ (1.8 కోట్లు), చెరి 1.2 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment