Client
-
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన మొత్తం క్లయింట్ ఖాతాల సంఖ్య 20 కోట్ల మార్కును దాటింది. డిజిటల్ పరివర్తన, నూతన సాంకేతిక ఆవిష్కరణలు ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. ఎనిమిది నెలల క్రితం 16.9 కోట్ల స్థాయిలో ఉండగా స్వల్ప వ్యవధిలోనే ఈ మైలురాయిని దాటినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్భారత వృద్ధి గాథపై ఇన్వెస్టర్లకున్న పటిష్టమైన విశ్వాసానికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 3.6 కోట్ల ఖాతాలు ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్ (2.2 కోట్లు), గుజరాత్ (1.8 కోట్లు), చెరి 1.2 కోట్ల ఖాతాలతో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
షేర్ల దుర్వినియోగానికి చెక్
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను స్టాక్ బ్రోకర్లు సొంతానికి వాడుకున్నా, ఇన్వెస్టర్ల నిధులను పక్కదారి పట్టించినా సత్వరం గుర్తించేందుకు ప్రత్యేక ఆన్లైన్ సిస్టమ్‌ను రూపొందించినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో స్టాక్ ఎక్సే్చంజీలను ఈ సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేస్తుందని పేర్కొంది. క్లయింట్లు తనఖాగా ఉంచిన షేర్లను కొన్ని బ్రోకింగ్ సంస్థలు.. సొంత అవసరాల కోసం లేదా ఇతర క్లయింట్ల అవసరాల కోసం దుర్వినియోగం చేసిన ఉదంతాలు వెలుగుచూసిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు తీసుకుంది. ఈ వ్యవస్థ కింద.. బ్రోకర్లు వారంవారీ స్టాక్ ఎక్సే్చంజీలకు సమర్పించే క్లయింట్ల షేర్ల డేటా వివరాలను సెబీ ఆన్లైన్ సిస్టమ్ సేకరిస్తుంది. క్లయింట్ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న షేర్లు, మరుసటి రోజున బ్రోకరు చూపించిన షేర్ల పరిమాణాన్ని పోల్చి చూస్తుంది. ఏవైనా వ్యత్యాసాలు కనిపించిన పక్షంలో ఎక్సే్చంజీలను అప్రమత్తం చేస్తుంది. ప్రతీవారం ఈ నివేదికలు విడుదల చేస్తామని, ఇప్పటికే ఇలాంటి మూడు కేసులను ఎక్సే్చంజీలకు తెలియజేశామని సెబీ ఒక ప్రకటనలో తెలిపింది. -
మమ్మల్ని క్షమించండి : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఇదొక అరుదైన సందర్భం. విచారణ పదేళ్లపాటు ఆలస్యమైనందుకు భారత అత్యున్నత న్యాయస్థానం ఒక మహిళకు క్షమాపణ తెలిపింది. ఝార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకే కేసులో పరస్పర విరుద్ధ తీర్పులు ఇవ్వడం వల్ల మొత్తం వ్యవహారం గందరగోళంగా మారిందని పేర్కొంది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరాఖండ్ నగరం రూర్కీకి చెందిన శ్యామ్‌లత.. తన సోదరులు పత్రాలను ఫోర్జరీ చేసి తన దుకాణాన్ని ఆక్రమించుకున్నారని స్థానిక కోర్టుకు 2004లో ఫిర్యాదు చేశారు. ఈమె సోదరుల్లో ఒకరు కూడా అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ దుకాణం ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరారు. దీనిపై దర్యాప్తు జరపాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. అద్దె రశీదులపై ఉన్న సంతకాలు లతవేనా కావా అనే విషయాన్ని నిర్ధారించడం కోసం సంతకాల నిపుణుడి అభిప్రాయం కోరడానికి అనుమతి ఇవ్వాలని దర్యాప్తు అధికారి కోరారు. ఇందుకు న్యాయస్థానం సమ్మతించింది. అయితే సంతకాల నిపుణుడు కోర్టుకు రాగా, సంతకాలను ఫొటో తీసుకోవడానికి న్యాయమూర్తి తిరస్కరించారు. దీనిపై లత సెషన్స్ కోర్టుకు ఫిర్యాదు చేయగా, న్యాయమూర్తి సంతకాల సేకరణకు అనుమతిస్తూ కేసు రికార్డు జ్యుడీషియల్ మెజిస్ట్రేటుకు పంపారు. సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లత సోదరుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించగా, లత కూడా ఇదే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మొదటి కేసులో లత అనుకూలంగా తీర్పు ఇస్తూ సంతకాల నిపుణుడిని తీసుకురావాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. సోదరుడి పిటిషన్‌పై స్పందిస్తూ జ్యుడీషియల్ కోర్టు నిర్ణయాన్ని తిరస్కరించింది. మళ్లీ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసు 2009లో సుప్రీంకోర్టుకు రాగా, మొదటి తీర్పునే సమర్థించింది. అయితే కేసు వేసిన కొన్ని రోజులకే లత మరణించారు. -
క్లయింట్‌ని చితకబాధిన లాయర్..!
ఉత్తరప్రదేశ్: ప్రస్తుతం ఏ పని జరగాలన్నా పైసలివ్వాల్సిందే. అలా అని డబ్బు ఇచ్చినంత మాత్రనా పని జరుగుతుందనుకుంటే పోరపాటే. ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తన చలానా సమస్యను పరిష్కరించాలని ఓ వ్యక్తి లాయర్‌కి రూ. 5000 చెల్లించారు. లాయర్ పని చేయకపోవడంతో క్లయింట్ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగాడు. దీనికి ఆగ్రహించిన లాయర్ ఆ వ్యక్తిని చితకబాదాడు. న్యాయం చేయాల్సిన న్యాయవాదే ఇలా ఉంటే నా దేశంలో ఇంకెక్కడుంది న్యాయం.. అని క్లైంట్ మెరపెట్టుకుంటున్నాడు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
లాయర్ ను కాల్చిచంపిన క్లయింట్
చెన్నై: పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి న్యాయవాదిని హత్య చేసిన ఘటన చెన్నైలోని మమల్లాపురంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తనపై ఉన్న కేసులకు సంబంధించి న్యాయవాది కామేష్ ను హత్య కేసుల నిందితుడు ఈశ్వర్ కలిశాడు. అయితే వీరిద్దరూ కలిసి మమల్లాపురంలోని ఓ బార్ లో మద్యం సేవించారు. అటుతరువాత ఇద్దరు కలిసి కారులో వస్తుండగా వారి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోపాద్రిక్తుడైన ఈశ్వర్ తన వద్దనున్న పిస్టోల్ ను తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో న్యాయవాది కామేష్ తీవ్రంగా గాయపడగా. . నిందితుడు ఈశ్వర్ అక్కడ్నుంచి జారుకున్నాడు. అనంతరం న్యాయవాది ఫోన్ ద్వారా తన స్నేహితులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న స్నేహితులు న్యాయవాదిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే న్యాయవాది మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా?అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
'విటుడు ఐపీసీ సెక్షన్ 370ఏ పరిధిలోకి వస్తాడు'
హైదరాబాద్: వ్యభిచారానికి పాల్పడే విటుడు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లో కొత్తగా చేర్చిన సెక్షన్ 370ఎ పరిధిలోకి వస్తారని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అన్నీ తెలిసీ వ్యభిచార గృహాలకు వెళ్లి లైంగిక దోపిడీకి పాల్పడే వ్యక్తిపై వ్యభిచార నిరోధక చట్టం (పీఐటీ యాక్ట్) కింద మాత్రమే కేసు నమోదు చేస్తే సరిపోదని, అతనిపై 370ఎ కింద కూడా కేసు నమోదు చేసి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. వ్యభిచారానికి పాల్పడుతూ దొరికిపోయిన ఓ విటుడిపై పీఐటీ చట్టంలోని సెక్షన్ 4 కింద పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది. అతనిపై ఐపీసీ సెక్షన్ 370ఎ కింద కేసును విచారణ స్వీకరించాలని సంబంధిత కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ ఇటీవల ఈ తీర్పునిచ్చారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు నిర్వాహకులు, ఓ విటుడు ఉన్నారు. నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్ 370 ఎ కింద, పీఐటీ చట్టంలోని సెక్షన్లు 3,4,5,6 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, విటుడిపై మాత్రం పీఐటీ సెక్షన్ 4 కిందే కేసు నమోదు చేసి సంబంధిత కోర్టులో పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విటుడు హైకోర్టును ఆశ్రయించి, తనపై పెట్టిన కేసును కొట్టివేయాలన్నారు. వ్యభిచారం ద్వారా వచ్చే సంపాదనపై బతికే వారిపై మాత్రమే పీఐటీ సెక్షన్ 4 కింద కేసు నమోదు చేస్తారని, కాబట్టి తనకు ఆ సెక్షన్ వర్తించదని తెలిపారు. సెక్షన్ 4 కింద పెట్టిన కేసు చెల్లనప్పటికీ, పిటిషనర్‌పై సెక్షన్ 370ఎ కింద కేసు పెట్టవచ్చునని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) తెలిపారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు, పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ అతనిపై సెక్షన్ 4 కింద పోలీసులు పెట్టిన కేసును కొట్టేశారు. నిర్వాహకులపై పీఐటీ చట్టం కింద, ఐపీసీ సెక్షన్ కింద 370 ఎ కింద కేసు పెట్టిన పోలీసులు విటుడిపై కేవలం పీఐటీ చట్టం సెక్షన్ 4 కింద మాత్రమే కేసు పెట్టడం ఆశ్చర్యకరంగా ఉందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. విటుడు 370ఎ పరిధిలోకి ఓ మైనర్‌పై గానీ, ఓ మహిళపై గానీ లైంగిక దోపీడీకి పాల్పడుతున్నామని తెలిసీ కూడా వ్యభిచారానికి పాల్పడితే ఆ వ్యక్తి సెక్షన్ 370 ఎ పరిధిలోకి వస్తారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం, తరువాత జరిగిన పరిణామాలు, పలు చట్టాలకు చేసిన సవరణల గురించి న్యాయమూర్తి తన తీర్పులో చర్చించారు. సవరణల నిర్ణయంలో భాగంగానే ప్రభుత్వం ఐపీసీలో సెక్షన్ 370కి అదనంగా సెక్షన్ 370 ఎ ని తీసుకొచ్చిందన్నారు. వ్యభిచారం విషయంలో విటుడిని అమాయక బాధితుడిగా చూడటం ఈ సవరణల ప్రధాన ఉద్దేశం ఎంత మాత్రం కాదని తెలిపారు. కాబట్టి విటుడు కూడా సెక్షన్ 370ఎ పరిధిలోకి వచ్చి తీరుతాడన్నారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే, పిటిషనర్ సెక్షన్ 370 ఎ కింద కేసు ఎదుర్కొనేందుకు అర్హుడేనని తెలిపారు. కాబట్టి హైకోర్టుకున్న స్వతఃసిద్ధ అధికారాల ఆధారంగా పిటిషనర్‌పై పీఐటీ చట్టంలోని సెక్షన్ 4 కింద కాకుండా ఐపీసీలోని సెక్షన్ 370ఎ కింద కేసును విచారణకు స్వీకరించాలని కింద కోర్టును ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.