లాయర్ ను కాల్చిచంపిన క్లయింట్ | Lawyer shot dead by murder-accused client | Sakshi
Sakshi News home page

లాయర్ ను కాల్చిచంపిన క్లయింట్

Published Mon, Sep 7 2015 5:51 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

లాయర్ ను కాల్చిచంపిన క్లయింట్

లాయర్ ను కాల్చిచంపిన క్లయింట్

చెన్నై: పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి  న్యాయవాదిని హత్య చేసిన ఘటన చెన్నైలోని మమల్లాపురంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తనపై ఉన్న కేసులకు సంబంధించి న్యాయవాది కామేష్ ను హత్య కేసుల నిందితుడు ఈశ్వర్ కలిశాడు. అయితే వీరిద్దరూ కలిసి మమల్లాపురంలోని ఓ బార్ లో మద్యం సేవించారు. అటుతరువాత ఇద్దరు కలిసి కారులో వస్తుండగా వారి మధ్య మాటా మాటా పెరిగింది.  దీంతో కోపాద్రిక్తుడైన ఈశ్వర్ తన వద్దనున్న పిస్టోల్ ను తీసి కాల్పులు జరిపాడు. 

 

ఈ ఘటనలో న్యాయవాది కామేష్ తీవ్రంగా గాయపడగా. . నిందితుడు ఈశ్వర్ అక్కడ్నుంచి జారుకున్నాడు. అనంతరం న్యాయవాది ఫోన్ ద్వారా తన స్నేహితులకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న స్నేహితులు న్యాయవాదిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే న్యాయవాది మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా?అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement