హైదరాబాద్: చంద్రన్న సంక్రాంతి కానుకలో అవినీతి నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 400 నమూనాలను పరిశీలించిన అధికారులు భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు నిర్థారించారు. నాసిరకం సరుకులు, తూకంలో మోసాలతో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు తొమ్మిది జిల్లాల్లో 40 కేసులు నమోదు చేశారు.
పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునిత సొంత జిల్లా అనంతపురంతో సహా కృష్ణ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరులలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తిచారు. కందిపప్పు, గోదుమపిండి, శేనగపప్పు, నెయ్యిలో నాణ్యత మరీ నాసి రకంగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.