వెబ్‌సైట్‌లో ఇంజనీరింగ్ సీట్లు,కాలేజీల జాబితాలేవీ? | The website of the seats in the engineering colleges where is a list? | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో ఇంజనీరింగ్ సీట్లు,కాలేజీల జాబితాలేవీ?

Published Wed, Jul 1 2015 12:23 AM | Last Updated on Thu, May 24 2018 2:02 PM

The website of the seats in the engineering colleges where is a list?

అన్ని కాలేజీలకు అందని వివరాలు 
అందుబాటులోకి తేకపోవడంపై అనుమానాలు

 
 సాక్షి, హైదరాబాద్ : జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ సోమవారమే పూర్తయినా మంగళవారం రాత్రి వరకు కూడా కాలేజీలు, సీట్ల వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రాలేదు. జేఎన్‌టీయూహెచ్ మాత్రం మంగళవారం సాయంత్రానికే అన్ని కాలేజీ యాజమాన్యాలకు అనుబంధ గుర్తింపునకు సంబంధించిన వివరాలను తెలియజేశామని పేర్కొన్నా.. మంగళవారం రాత్రి వరకు కొన్ని కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపు వివరాలు అందడంతో మిగిలిన కాలేజీ యాజమాన్యాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.

మళ్లీ ఏమైనా మార్పులు చేస్తున్నారేమోనని ఆందోళన చెందుతున్నాయి. కొన్ని కాలేజీల్లో సీట్ల పెంపునకు ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రిపై ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాలేజీల అనుబంధ గుర్తింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయకపోవడంపట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌కు 2, 3 రోజుల ముందు వెబ్‌సైట్‌లో జాబితాను పెట్టాలన్న యోచనలో వర్సిటీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకవేళ కోర్టుకెళ్లినా తమకు ఆటంకాలు అడ్డుకావని, కౌన్సెలింగ్ సజావుగా సాగుతుందని వారు యోచిస్తున్నారు.

 6 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు!
 ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 6 నుంచి 9 వరకు చేపట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. 10న ఆప్షన్లలో మార్పులకు, 12 లేదా 13న సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 13 నుంచి రెండో దశ, 19 నుంచి తుది దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలిని భావిస్తోంది. ఈ షెడ్యూల్‌ను బుధవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
 
 4 వరకు అభ్యంతరాల స్వీకరణ: కడియం
 జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం సచివాలయం లో విలేకరులతో కడియం మాట్లాడుతూ నిర్ణీత నిబంధనల మేరకు ప్రమాణాలు పాటించే కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇచ్చినట్లు చెప్పా రు. కాలేజీల యాజమాన్యాలకు  ఏమైనా అభ్యం తరాలుంటే ఈ నెల 4 వరకూ జేఎన్‌టీయూహెచ్‌కు అప్పీల్ చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement