వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం!
♦ అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోని 58 ఇంజనీరింగ్ కాలేజీలు
♦ వాటిలోని విద్యార్థులకు చదువుకు ‘గుర్తింపు’ సమస్య
♦ చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ జేఎన్‌టీయూహెచ్ ప్రకటన
♦ ఆందోళనలో విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) పరిధిలోని 58 ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న దాదాపు 7 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా జేఎన్‌టీయూ నుంచి పొందాల్సిన అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) కోసం ఈసారి 58 ఇంజనీరింగ్ కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో విద్యార్థుల చదువుకు ‘గుర్తింపు’ సమస్య ఏర్పడనుంది. అనుబంధ గుర్తింపు లేకపోతే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదు. యూనివర్సిటీ వారికి పరీక్షలను నిర్వహించదు కూడా. దీంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు.
అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోని కాలేజీల జాబితాను జేఎన్‌టీయూ గురువారం విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు అవకాశం కల్పించామని.. అయినా ఈ కాలేజీలు పట్టించుకోలేదని తెలిపింది. ఆయా కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. వాస్తవానికి ఒకవేళ ఏదైనా కాలేజీలో విద్యార్థులు తక్కువగా ఉండి, తరగతులు నిర్వహించలేకపోతే... వారిని మరో కాలేజీకి తరలించేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోలేదు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు వద్దనుకున్నా... ద్వితీయ, తృతీయ, నాలుగో ఏడాది విద్యార్థుల కోసమైనా ‘గుర్తింపు’ పొందాలి. దీనినీ ఖాతరు చేయలేదు.
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం
‘‘దరఖాస్తు చేసుకునేందుకు కాలేజీలకు అవకాశం ఇచ్చాం. మొదట సాధారణంగా, తరువాత ఆలస్య రుసుముతో దరఖాస్తుల గడువు పెంచాం. అయినా అఫిలియేషన్ల కోసం 58 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. ఆయా కాలేజీలపై మాత్రం కఠిన చర్యలు ఉంటాయి..’’
- జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య
అఫిలియేషన్‌కు దరఖాస్తు చేసుకోని కాలేజీలు
రంగారెడ్డి జిల్లాలోని.. అన్వర్ ఉలూమ్ కాలే జ్ ఆఫ్ ఇంజనీరింగ్, యెన్నేపల్లి; ఆర్యభట్ట ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మొహబ్బత్‌నగర్; అసిఫియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చింతుల; అవేర్ మాధవన్‌జీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, భగవతిపురం; భారత్ ఇంజనీరింగ్ కాలేజ్, మంగళపల్లి; చిలుకూరి బాలజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అజీజ్‌నగర్; సీఆర్‌వీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్, లాల్‌గడిమలక్‌పేట; హస్విత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ, కీసర; హస్విత ఇనిస్టిట్యూట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కీసర; హైపాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చిలుకూరు; హోలీమేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, భోగారం; జ్యోతిష్మతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తుర్కపల్లి; కేఎస్ రాజు ఇనిస్టిట్యూ ట్ టెక్నాలజీ అండ్ సైన్స్, కనకమామిడి; కైట్ కాలేజ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సెన్సైస్, షాబాద్; ఎంఆర్‌ఆర్ కాలేజీ ఆఫ్ బీ ఫార్మసీ, నాదర్‌గుల్; ప్రజ్ఞా భార తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముద్మియాల్; సింబియాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, షామీర్‌పేట్; ఎస్‌పీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-టెక్నాలజీ, అంకుషాపూర్; ఉషోదయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-టెక్నాలజీ, సీతారాంపేట్; శ్రీనివాస ఫార్మాస్యూటికల్ ఇనిస్టిట్యూట్ అండ్ సెంటర్ ఫర్ రీసెర్చ్, బురుగుపల్లి; విశ్వభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నాదర్‌గుల్; వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, బాటసింగారం.
మెదక్ జిల్లాలోని.. ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్, పటేల్‌గూడ; ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్, చిన్నగుండవల్లి; గోపాల్‌రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పెద్ద కంజర్ల; పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, గౌరారం; పుల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వర్గల్; ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పసల్‌వాడి, సంగారెడ్డి; మహేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, ఇస్నాపూర్; మహేశ్వరరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, చిత్కుల్; శ్రీవైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హవేలి ఘన్‌పూర్; సుశృత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, తడ్డనపల్లి; టీఆర్‌ఆర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ, పటాన్‌చెరు.
ఖమ్మంలోని.. కవిత మెమోరియల్ పీజీ కాలేజ్ (ఎంబీఏ), వెలుగుమట్ల; కవిత మెమోరియల్ పీజీ కాలేజ్ (ఎంసీఏ) వెలుగుమట్ల; పులిపాటి ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శ్రీబాలాజీ నగర్; సింగరేణి కాలరీస్ విమెన్స్ కాలేజ్, కొత్తగూడెం; ట్రినిటీ పీజీ కాలేజ్, బల్లేపల్లి.
కరీంనగర్ జిల్లాలోని.. లోటస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎంబీఏ), శ్రీనగర్ కాలేజీ, గోదావరిఖని; వాగీశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్, రామకృష్ణా కాలనీ; వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మల్కాపూర్ శివారు, గోదావరిఖని.
నల్లగొండ జిల్లాలోని.. మేధ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, లక్ష్మిదేవీగూడెం, బీబీనగర్; మోనా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గొల్లగూడ; శ్రీవాన్మయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అన్నంపట్ల.
వరంగల్ జిల్లాలోని.. ఆరుషి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, పున్నేల్; అపెక్స్ ఇంజనీరింగ్ కాలేజ్, విశ్వనాథపురం; పాత్‌ఫైండర్‌ఇంజనీరింగ్ కాలేజ్, తిమ్మాపూర్; ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజ్, శామీర్‌పేట్, జనగాం; సహస్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్, వంగపహడ్; సెయింట్ జాన్ ఎంబీఏ కాలేజ్, ఎల్లాపూర్; సెయింట్ జాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఎల్లాపూర్; సుప్రజ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేమాలిగొండ; వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, వికాస్‌నగర్.
హైదరాబాద్‌లోని.. గ్రీన్‌ఫోర్ట్ ఇంజనీరింగ్ కాలేజీ, బండ్లగూడ; శ్రీమాధవన్‌జీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శాంతివనం.
నిజామాబాద్ జిల్లాలోని.. విజయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్, మానిక్ బండార్.
మహబూబ్‌నగర్ జిల్లాలోని.. శ్రీనాగోజీరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (విమెన్), తిరుమల హిల్స్, అప్పన్నపల్లి.
ఆదిలాబాద్ జిల్లాలోని.. ఏఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మావల్ల.