కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య | Compulsory education from KG to PG | Sakshi
Sakshi News home page

కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య

Published Mon, May 18 2015 2:11 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

Compulsory education from KG to PG

మారేడ్‌పల్లి: కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ, నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ‘‘తెలంగాణ లో ఉన్నత విద్య బలోపేతం- సీబీసీఎస్ అమలు’’ అంశంపై ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సెమినార్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు.

ప్రముఖ విద్యావేత్త హరగోపాల్ మాట్లాడుతూ విద్యావిధానంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలన్నారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో టీజీసీపీ అసోషియేషన్ అధ్యక్షుడు మారుతిరావు, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, టీజీసీటీ అసోషియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బ్రిజే ష్, కార్యదర్శి డాక్టర్ ఎస్.రమేశ్, టీఏఏసీటీ అసోషియేషన్ చైర్మన్ డాక్టర్ డేవిడ్‌ప్రేమ్‌రాజ్, అధ్యక్షుడు రాజరత్నం, కార్యదర్శి అర్జున్, కస్తూర్బాగాంధీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.అనితారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement