పేదలు..అనాథ పిల్లలకు రక్షణగా ప్రభుత్వం | government efforts on Orphan children | Sakshi
Sakshi News home page

పేదలు..అనాథ పిల్లలకు రక్షణగా ప్రభుత్వం

Published Thu, Jun 4 2015 5:34 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

పేదలు..అనాథ పిల్లలకు రక్షణగా ప్రభుత్వం - Sakshi

పేదలు..అనాథ పిల్లలకు రక్షణగా ప్రభుత్వం

- 2016-17 నుంచి కేజీ టు పీజీ విద్య
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
- ఉద్యమాల ఖిల్లా.. ఓరుగల్లు :  నాయిని నర్సింహారెడ్డి
- ఎస్సెస్సీ, ఇంటర్ ప్రతిభా విద్యార్థులకు ప్రజ్ఞాపురస్కారాల అందజేత
కరీమాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలోని పేద, అనాధ పిల్లలకు రక్షణగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం క డియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లాలో ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన ప్ర భుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వి ద్యార్థులకు ప్రజ్ఞా పురస్కారాలను బుధవా రం అందజేశారు. వరంగల్ నగరంలోని రంగశాయిపేట గణపతి ఇంజనీరింగ్ కళాశాలలో లర్న్ టు లైవ్ ఫౌండేషన్ చైర్మన్, కీ సాఫ్ట్‌వేర్  సొల్యూషన్స్ సీఈఓ జ్యోతిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016-17 సంవత్సరం నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్య  అందించనున్నట్లు చెప్పారు.

కామన్ స్కూల్  విధానం తీసుకురానున్నట్లు వివరించారు. అనాథలు, పేద పిల్లలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి పాటుపడుతున్న జ్యోతిరెడ్డి అభినందనీయురాలన్నారు. రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఓరుగల్లు పోరుగల్లు అని, ఉద్యమ ఖిల్లా అన్నారు. అలాంటి గడ్డమీద  కష్టపడి చిదివి ఉన్నత స్థాయికెదిగిన జ్యోతిరెడ్డి అమెరికాకు వెల్లినా ఇక్కడి అనాధ, పేద పిల్లల కోసం పాటుపడుతుండడం ఆదర్శనీయమన్నారు. అనాథ పిల్లలకు అడ్రస్ ఏర్పాటు చేయడం, వారి భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. విద్యావ్యవస్థ బాగుపడితేనే అంతా బాగుపడుతుందన్నారు. లర్న్ టు లైవ్ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ పేదల కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో తాను ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామన్నారు.

దేశంలో 3 కోట్ల మంది అనాథలున్నారని, వారికి విద్య, భవిష్యత్, చిరునామా, హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. ఇలాంటి అనాథలు, పేద పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ సందర్బంగా టెన్త్‌లో ఒకరు, ఇంటర్‌లో ఇద్దరు విద్యార్ధులకు రూ.10 వేల చొప్పున రూ.30 వేల నగదుతో పాటు బ్యాగు, మెమొంటో, సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి  చేతుల మీదుగా అందించారు. మరో 85 మంది విద్యార్థులకూ మెమొంటోలు, సర్టిఫికెట్లు, బ్యాగులు అందించారు. ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ బాస్కర్, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ అంబర్‌కిషోర్‌జా, టీఆర్‌ఎస్ జిల్లా, అర్బన్ అధ్యక్షులు టి.రవీందర్‌రావు, నన్నపునేని నరేందర్, వాగ్దేవి విద్యాసంస్థల అధినేత దేవేందర్‌రెడ్డితోపాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయూలి
కరీమాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ మేరకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నారుుని నర్సంహారెడ్డిని చేర్యాల జెడ్పీఎస్‌ఎస్ విద్యార్థిని ఎ.సమత కోరింది. వారు నవ్వుతూ... కచ్చితంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement