* 22 రకాల సేవలు అందించేందుకు బోర్డు సిద్ధం
* జూలై 1 నుంచి అందుబాటులోకి..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు ద్వారా విద్యార్థులు, యాజమాన్యాలకు అందించే వివిధరకాల సేవలన్నింటిని ఇకపై ఆన్‌లైన్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు బోర్డు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా 22 రకాల సేవలను ఆన్‌లైన్ ద్వారానే అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.
ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ (www.tsbie.cgg.gov.in)ను ఏర్పాటు చేశారు. జూలై 1వ తేదీ నుంచే ఈ ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. బోర్డు కార్యాలయానికి వచ్చినపుడు ఏ పని కావాలన్నా లంచం అడుగుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కడియం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించే ఏర్పాటు చేశామని, పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. సేవలు పొందే వారు చెల్లించాల్సిన నిర్ణీత మొత్తాన్ని కూడా అన్‌లైన్‌లోనే చెల్లించే ఏర్పాట్లు చేశారు.
ఇంటర్‌లో అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే
Published Thu, Jun 25 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM
Advertisement