లభించని కడియం అపాయింట్‌మెంట్..
కలవలేకపోయిన కోదండరాం
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యు కేషన్‌లో (బీఎడ్) ప్రవే శాల కోసం రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించే విషయమై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో చర్చించేందుకు బుధవారం సచివాలయానికి వచ్చిన టీజే ఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి అపాయింట్‌మెంట్ లభించలేదు. బీఎడ్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో సచివాలయానికి బయలుదేరిన ఆయన ఫోన్‌లో కడియం శ్రీహరి పేషీకి ఫోన్ చేసి, అపాయింట్‌మెంట్ కావాలని కోరారు. అయితే అప్పటికే డిప్యూటీ సీఎం.. వీసీల సమావేశంలో ఉండటంతో అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆ తరువాత సచివాల యంలోని ఉప ముఖ్యమంత్రి పేషీకి బీఎడ్ కాలేజీ ప్రతినిధులు వచ్చి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. అప్పుడూ వీసీల సమావేశంలోనే కడియం ఉండ టంతో కలిసేందుకు అవకాశం కుదరలేదు. దీంతో కోదండరాం సచివాలయంలోని ఇతర విభాగాల అధికారులను వేరే సమస్యలపై కలిసి వెళ్లిపోయారు.