జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
► ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
► ‘మిషన్’ పనులపై కలెక్టరేట్‌లో సమీక్ష
హన్మకొండ అర్బన్ : రెండో దశ మిషన్ కాకతీయ పనులు గడువులోగా నాణ్యతతో పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మిషన్ కాకతీయకు అంతర్జాతీయ స్థారుు గుర్తింపు వచ్చిందని, దీన్ని దృష్టి లో ఉంచుకొని అధికారులు మరింత బాధ్యతగా పనిచేయూలన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరం లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌తో కలిసి మిషన్ కాకతీయ పనులపై సమీక్షించారు.
ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రెండో దశ పనులు ఆశించిన మేరకు వేగంగా జరగడంలేదన్నారు. క్షేత్రస్థారుులో సాంకేతిక సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మొదటి విడతలో 1075 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదించగా 1063 చెరువులకు పరిపాలనా అనుమతులు వచ్చాయని, ఇందులో 483 చెరువుల పనులు పూర్తిస్థారుులో బిల్లులు చెల్లించామని, 355 చెరువుల పనులు పూర్తి కాగా బిల్లులు చెల్లించాల్సి ఉందని వివరించారు.
రెండో దశలో 1268 చెరువులకు ప్రతిపాదనలు పంపగా 824 చెరువులకు అనుమతులు లభించాయని తెలిపారు. వీటిలో 266 చెరువులకు టెండర్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 94 చెరువుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అదేవిధంగా మొదటి దశ పెండింగ్ పనులు ఈ సీజన్‌లో పూర్తి చేయాలని సూచించారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ మిషన్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈలకు వాహనం, కంప్యూటర్ ఆపరేటర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ తిరుపతిరావు, ఎస్‌ఈ విజయభాస్కర్, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.