Mission Kakatiya Tasks
-
‘మిషన్’ఇన్‌కంప్లీట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పల్లెకు ఆయువుపట్టు చెరువు. ఆ చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించి చేపట్టిన మిషన్ కాకతీయ మొదట్లో ఒక ఉద్యమంలా సాగినా... చివరకు వచ్చేసరికి నిధుల కొరతతో నీరసించింది. మొదటి రెండు విడతలుగా చేపట్టిన పనులు ఉధృతంగా సాగగా, చివరి రెండు విడతల పనులు పూర్తిగా చతికిలబడ్డాయి. ప్రభుత్వం నుంచి సమగ్రంగా నిధుల కేటాయింపు లేకపోవడం, పెండింగ్ బిల్లుల నేపథ్యంలో 5 వేలకు పైగా చెరువుల పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. 22 వేల చెరువులకు తిరిగి జీవం పోసినా... ఆఖర్లో ప్రభుత్వం నుంచి మునుపటి చొరవ లేకపోవడంతో మిగిలిపోయిన 5 వేల చెరువుల పనులను ఎలా పూర్తిచేయాలో ఇరిగేషన్ శాఖకు పాలుపోవడం లేదు. బిల్లుల బకాయిలు500కోట్లు రాష్ట్రంలో నాలుగు విడతలుగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం కింద 27,625 చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించగా, అందులో 26,989 చెరువుల పనులు ఆరంభించారు. ఇప్పటి వరకు 22 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. మూడో దశలో 5,958 పనులు చేపట్టగా 2,040 చెరువుల పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వీటిని రెండేళ్ల కిందట జూన్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినా అవి ముందుకు సాగడం లేదు. ఇక 4వ విడతలో 4,214 చెరువుల పనుల్లో మరో 2,472 పనులు పూర్తి కాలేదు. ఇలా నాలుగు విడతల్లో కలిపి మొత్తం 5,553 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భారీ ప్రాజెక్టుల అవసరాలకే నిధుల మళ్లింపు జరగడంతో ఈ పనులకు అనుకున్న మేర నిధుల ఖర్చు జరగలేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖకు పదేపదే విన్నవిస్తున్నా, అరకొర నిధులను విదిల్చి చేతులు దులుపుకుంటోంది. దీంతో ఇటీవలే కల్పించుకున్న ఇరిగేషన్ శాఖ రూ.25 లక్షల కన్నా తక్కువ బిల్లులున్న వాటికి నిధులు ఇప్పించడంలో చొరవ చూపడంతో 260 చెరువులకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. అయినప్పటికీ మరో రూ.500 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయన్న దానిపై స్పష్టత లేదు. ఇరిగేషన్ పునర్ వ్యవస్థీకరణతో వీటిపై దృష్టి పెట్టేదెపుడో? ఇక శాఖ పునర్వ్యవస్థీకరణతో మైనర్ ఇరిగేషన్ విభాగం పూర్తిగా రద్దయింది. అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవడంతో మైనర్ ఆయా డివిజన్ల సీఈల పర్యవేక్షణలోకి వెళ్లింది. ఈ పునర్వ్యవస్థీకరణ మేరకు చెరువుల ఒప్పందాల పైళ్ల విభజన, పని విభజన జరగాల్సి ఉంది. అనంతరం డివిజన్ల వారీగా వీటి పురోగతిని సీఈలు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెక్‌డ్యామ్‌ల టెండర్లు, వాటి ఒప్పందాలు, పనుల కొనసాగింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ తరుణంలో పెండింగ్ చెరువుల పనులపై వీరెంత దృష్టి సారిస్తారన్నది చూడాలి. -
రెండోవిడతలో 8వేల చెరువులు
► పారదర్శకంగా ‘మిషన్ కాకతీయ’ పనులు ► రాష్ట్ర ప్రత్యేకాధికారి శంకర్‌నాయక్ తలకొండపల్లి: మిషన్ కాకతీయ పనులను మరింత పారదర్శకంగా చేపట్టాలని మిషన్ కాకతీయ రాష్ట్ర ప్రత్యేకాధికారి శంకర్‌నాయక్ సూచించారు. మిషన్ కాకతీయ మొదటి విడతలో పనులు పూర్తిచేసిన మం డలంలోని వెల్జాల్ సహదేవిసముద్రం, చంద్రధనలోని నల్ల చెరువులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కట్ట మరమ్మతు పనులు, తూం లీకేజీలు, అలుగు లెవలింగ్, ఒండ్రు లేవలింగ్, పాటుకాల్వ, పంట కాల్వలతో పాటు చెరువు పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండో విడత మిషన్ కాకతీయ పనుల వేగంగా జరుగుతన్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వేల చెరువులకు సుమారు రూ.21,600 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 7.643 చెరువులు ఉండగా 1530 చెరువులకు మిషన్ కాకతీయ నిధులు మంజూరైనట్లు చెప్పారు. రూ.200కోట్ల నిధులతో చెరువుల ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ చెరువులు పూర్తయితే సుమారు 25వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నారు. ఫలితంగా జిల్లాల్లో హరితవిప్లవం ఏర్పడి కరువు కనుమరుగవుతుందన్నారు. ఆకలికేకల వలసల జిల్లా అన్నపూర్ణ జిల్లాగా మారనుందన్నారు. జిల్లావ్యాప్తంగా 265 టీఏంసీల నీటిని సాగునీరు అందాల్సి ఉండగా, కేవలం 100 టీఏంసీల సాగునీటిని వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నామన్నారు. చెరువుల పునరుద్ధరణతో భూగర్భజలాలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో ఈఈ న ర్సింగ్‌రావు, డీప్యూటీఈఈ ఆంజనేయులు, డీఈ శం కర్‌బాబు, ఏఈలు రమణ, గంగరాజు, మాజీ ఏం పీపీ శ్రీనివాసాయదవ్, కో ఆప్షన్ సభ్యులు ఖాజాపాషా, యాదయ్య, సత్యంగౌడ్, రవి పాల్గొన్నారు. -
చెరువుల అభివృద్ధితో జలకళ
► మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ► టెంబుర్ని, అనంతపేట్లలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం దిలావర్పూర్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పనులతో రానున్న రోజుల్లో వర్షపు నీటితో చెరువులన్నీ జలకళతో ఉట్టిపడతాయని గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దిలావర్పూర్ మండలంలోని టెంబుర్ని గ్రామంలో రెండో విడత మిషన్ కాకతీయలో భాగంగా స్థానిక పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ, చెరువులను పునరుద్ధరిస్తే తెలంగాణ జళకలతో ఉట్టిపడి సస్యశామలం అవుతుందనే సంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రూపొందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. తద్వారా చెరువుల్లో పూడికతీత జరిగి, ఆ మట్టి చేలల్లో ఎరువుగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అంతేగాక చెరువుల్లో నీటి సామర్థ్యం పెరిగి భూగర్భజలాలు సైతం పెరుగుతాయని మంత్రివివరించారు. నీటిపారుదల శాఖ ఈఈ రమణారెడ్డి, పీఆర్ డీఈ తుకారం, తహశీల్దార్ స్రవంతి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ముఖ్యనేత కె.దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ పాల్దె లక్ష్మి శ్రీనివాస్, సర్పంచ్ లక్ష్మీసాయారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎన్.జీవన్‌రావు, నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, నిర్మల్ పట్టణ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, నాయకులు పీవీ రమణారెడ్డి, ఇప్ప నర్సారెడ్డి, కోడె రాజేశ్వర్, కొండ్రు రమేశ్, ధనె రవి, విజయ్, ధని నర్సయ్య, ఆయిటి గంగారాం, సప్పల రవి, శ్రావణ్‌రెడ్డి, సాంగ్వి వినోద్, వెలుగు రాజేశ్వర్, ఒడ్నం కృష్ణ, భూమేశ్, నాగభూషణ్, భుజంగ్‌రావు, రవి, మహేశ్‌రెడ్డి, సర్పంచులు నంద అనిల్, వినోద్, పీరన్న పాల్గొన్నారు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం నిర్మల్ టౌన్ : తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో ఆదివారం మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. రూ.70 లక్షలతో గ్రామంలోని చెరువు పూడికతీత పనులను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీంతో గ్రామంలోని 100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 63 చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా పూడికతీత పనులను చేపడుతున్నామన్నారు. అనంతపేట్ గ్రామానికి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు. సీసీ రోడ్లు, డ్రెరుునేజీ నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని తెలిపారు. గ్రామానికి 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే లక్ష లీటర్ల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మిస్తామన్నారు. మిషన్ భగీరథలో భాగంగా దిలావర్పూర్ మండలం మాడేగాం వద్ద వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీటి సరఫరా చేపడుతామని పేర్కొన్నారు. జైపూర్‌లో నిర్మిస్తున్న 1800 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రం త్వరలోనే పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తుందని తెలిపారు. గ్రామస్తులు కోరిన విధంగా అనంతపేట్ నుంచి డ్యాంగాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ అల్లోల సుమతి, తహశీల్దార్ నారాయణ, ఎంపీడీవో గజ్జారాం, సర్పంచులు నర్సయ్య, గాండ్ల విలాస్, నరేశ్, ఎంపీటీసీ పంతులు, నాయకులు ముత్యంరెడ్డి, జీవన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
► ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ► ‘మిషన్’ పనులపై కలెక్టరేట్లో సమీక్ష హన్మకొండ అర్బన్ : రెండో దశ మిషన్ కాకతీయ పనులు గడువులోగా నాణ్యతతో పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మిషన్ కాకతీయకు అంతర్జాతీయ స్థారుు గుర్తింపు వచ్చిందని, దీన్ని దృష్టి లో ఉంచుకొని అధికారులు మరింత బాధ్యతగా పనిచేయూలన్నారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరం లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌తో కలిసి మిషన్ కాకతీయ పనులపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రెండో దశ పనులు ఆశించిన మేరకు వేగంగా జరగడంలేదన్నారు. క్షేత్రస్థారుులో సాంకేతిక సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మొదటి విడతలో 1075 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదించగా 1063 చెరువులకు పరిపాలనా అనుమతులు వచ్చాయని, ఇందులో 483 చెరువుల పనులు పూర్తిస్థారుులో బిల్లులు చెల్లించామని, 355 చెరువుల పనులు పూర్తి కాగా బిల్లులు చెల్లించాల్సి ఉందని వివరించారు. రెండో దశలో 1268 చెరువులకు ప్రతిపాదనలు పంపగా 824 చెరువులకు అనుమతులు లభించాయని తెలిపారు. వీటిలో 266 చెరువులకు టెండర్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 94 చెరువుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అదేవిధంగా మొదటి దశ పెండింగ్ పనులు ఈ సీజన్లో పూర్తి చేయాలని సూచించారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ మిషన్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈలకు వాహనం, కంప్యూటర్ ఆపరేటర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏజేసీ తిరుపతిరావు, ఎస్ఈ విజయభాస్కర్, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
‘మిషన్’ గుట్టు రట్టు
చిత్రంలో.. తాడ్వాయి మండలం కామారం గ్రామంలోని కుమ్మరికుంట చెరువు. ఈ చెరువు మత్తడి, తూములు మంచిగా ఉన్నా మిషన్ కాకతీయలో రూ.95 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో కొత్త మత్తడి నిర్మించేందుకు ఉన్న పాత మత్తడిని తొలగించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మించిన మట్టితోపాటు మత్తడి కోతకు గురైంది. తాడ్వాయి మండలంలో పలు చెరువుల కట్టలు వెడల్పు కోసం మట్టిని పోసి సరైన రోలింగ్ చేయకపోవడం వల్ల వర్షాలకు పగుళ్లు వచ్చాయి. మరో వర్షం పడితే ఉన్న మట్టికాస్తా కొట్టుకుపోరుు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది. - బయటపడుతున్న నిర్మాణాల గుట్టు - ఇలా అయితే చెరువుల్లో నీటినిల్వ ప్రశ్నార్థకమే.. - అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం - రూ.కోట్ల నిధులు నీటిపాలు - ‘మిషన్’ లోపాల పుట్ట - నాణ్యత లేక కోతకు గురవుతున్న మత్తళ్లు - పగుళ్లు చూపుతున్న చెరువు కట్టలు వరంగల్ : తొలకరి వర్షాలకే ‘మిషన్ కాకతీయ’ పనుల గుట్టు రట్టయింది. జిల్లాలో చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో మరమ్మతులు చేయూల్సి వస్తోంది. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం లోపభురుుష్టంగా ఉండటంతో ఈ పరిస్థితి దాపురించింది. జిల్లాలో 5,836 చెరువులు ఉండగా.. అందులో 20 శాతం మొదటి ఏడాదిలో చేపట్టేందుకు 1,173 చెరువులు ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం పలు విడతలుగా 1,061 చెరువుకు నిధులు కేటాయిస్తూ పరిపాలన మంజూరు ఇచ్చింది. టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నేతలు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తప్పా ప్రారంభించలేక పోయారు. ఏజెన్సీలో అటవీశాఖ అధికారులు అడ్డుగా నిలవడంతో వారిని ప్రసన్నం చేసుకుకోవడంతో పుణ్యకాలం గడిచింది. వర్షాలు వస్తాయని అధికారులు ముందస్తు హెచ్చరికలు చేయడంతో పనులు తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తూ.తూ. మంత్రంగా పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నారుు. పాటించని నిబంధనలు చెరువులు పనులు సక్రమంగా చేయకపోవడంతో మొదటి ఏడాదే తెగుతున్నారుు. చెరువు కట్టలను పటిష్టపర్చేందుకు పోసే మట్టి ఇతర ప్రాంతాల నుంచి తేవాలి. కానీ, కాంట్రాక్టర్లు చెరువులోని చౌడు మట్టిని కట్టపై పోయడం, రోలింగ్ చేయకపోవడంతో కట్టలు మొదటి వర్షానికే పగుళ్లు బారుతున్నాయి. మట్టి పోసిన సమయంలో 9 నుంచి 12 అంగళాల మట్టి పోసి రోలింగ్ చేసిన తర్వాతే నీళ్లు చల్లుకుంటూ రోలింగ్ చేయాలి. అలా చేయక ట్రాక్టర్లతో తొక్కించడం వల్ల కట్టలు బలహీనంగా మారుతున్నారుు. అరుునా అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. గండ్లతో కడగండ్లు ‘మిషన్ కాకతీయ’లో చెరువులకు అవసరం లేకున్నా.. రూ.లక్షలు వెచ్చించి పటిష్టంగా ఉన్న తూములు తొలగించి కొత్తవి నిర్మిస్తున్నారు. వర్షాలతో కాకుండా కాంట్రాక్టర్లు పెట్టిన గండ్లతో రైతులు ఈ ఏడాది ఇబ్బందులు తప్పెటట్లు లేదు. మంగపేట మండలం రామచంద్రునిపేట సమీపంలోని సంఘంపల్లి చెరువుకు రూ.45.50 లక్షలు కేటాయించారు. పూడికతీతకు రూ.9.67 లక్షలు, కట్టకు రూ.2.79 లక్షలు, తూము, మత్తళ్ల నిర్మాణానికి రూ.16.58 లక్షలు కేటాయించారు. నిధులు ఎక్కువగా ఉండడంతో తూముల నిర్మిస్తున్నారు. తూములు తొలగించే సమయంలో రింగ్‌బండ్‌లు వేసి కొత్తవి నిర్మించాల్సి ఉంటుంది. వర్షాలు ఆలస్యంగా వస్తాయని భావించిన కాంట్రాక్టర్లు జిల్లాలోని పలు చెరువుల తూములను తీసి వేయడంతో ఇటీవల పడిన వర్షపు నీరు నిల్వ ఉండడం లేదు. చెరువులో నీటి అపుకునేందుకు రైతులు రింగ్‌బండ్‌లు వేస్తున్నా లాభం లేని పరిస్థితులు నెలకొన్నాయి. తూముల నిర్మాణానికి వాడుతున్న కాంక్రిట్‌లో నిర్ధేశించిన మేరకు సిమెంటు మిక్స్ చేయకపోవడంతో వర్షాలకు సిమెంటు పోయి కంకర కనిపిస్తోంది. గుట్టు రట్టు.. చెరువుల మరమ్మతుల్లో అక్రమాలు జరుగుతున్నా చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూ.తూ. మంత్రంగా పూడికతీతలు తీసినా బిల్లులు చేయాలని ఒత్తిడి తెస్తున్న కాంట్రాక్టర్లకు వర్షాలు పడడం జీర్ణించుకోలేక పోతున్నారు. నీరు చేరవడం వల్ల ఎంత మేరకు పూడిక తీసారన్న కొలతలు తీయడం కష్టంగా మారనుంది. అందువల్ల పనులు చేపట్టక ముందు రిమోట్ సెన్సింగ్‌తో తీసిన కొలతలతో ఇప్పటి కొలతలు పరిగణలోకి తీసుకుని బిల్లు చేస్తారని అధికారులు అంటున్నారు. అందువల్ల లేని కొలతలతో బిల్లులు చేస్తే చర్యలు తప్పవన్న భయం ఇంజనీరింగ్ అధికారులను వెంటాడుతోంది. వర్షాలు ఇప్పట్లో పడకుంటే పూడికతీతలు మళ్లీ దర్శనం ఇచ్చే అవకాశాలున్నాయి.