‘మిషన్’ గుట్టు రట్టు | No perfect works of Mission Kakatiya | Sakshi
Sakshi News home page

‘మిషన్’ గుట్టు రట్టు

Published Sun, Jun 28 2015 4:09 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

‘మిషన్’ గుట్టు రట్టు - Sakshi

‘మిషన్’ గుట్టు రట్టు

చిత్రంలో.. తాడ్వాయి మండలం కామారం గ్రామంలోని కుమ్మరికుంట చెరువు.  ఈ చెరువు మత్తడి, తూములు మంచిగా ఉన్నా మిషన్ కాకతీయలో రూ.95 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో కొత్త మత్తడి నిర్మించేందుకు ఉన్న పాత మత్తడిని తొలగించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మించిన మట్టితోపాటు మత్తడి కోతకు గురైంది. తాడ్వాయి మండలంలో పలు చెరువుల కట్టలు వెడల్పు కోసం మట్టిని పోసి సరైన రోలింగ్ చేయకపోవడం వల్ల వర్షాలకు పగుళ్లు వచ్చాయి. మరో వర్షం పడితే ఉన్న మట్టికాస్తా కొట్టుకుపోరుు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది.
 
- బయటపడుతున్న నిర్మాణాల గుట్టు
- ఇలా అయితే చెరువుల్లో నీటినిల్వ ప్రశ్నార్థకమే..
- అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం
- రూ.కోట్ల నిధులు నీటిపాలు
- ‘మిషన్’ లోపాల పుట్ట
- నాణ్యత లేక కోతకు గురవుతున్న మత్తళ్లు
- పగుళ్లు చూపుతున్న చెరువు కట్టలు
వరంగల్ :
తొలకరి వర్షాలకే ‘మిషన్ కాకతీయ’ పనుల గుట్టు రట్టయింది. జిల్లాలో చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో మరమ్మతులు చేయూల్సి వస్తోంది. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం లోపభురుుష్టంగా ఉండటంతో  ఈ పరిస్థితి దాపురించింది. జిల్లాలో 5,836 చెరువులు ఉండగా.. అందులో 20 శాతం మొదటి ఏడాదిలో చేపట్టేందుకు 1,173 చెరువులు ఎంపిక చేశారు.

ఇందులో ఇప్పటివరకు ప్రభుత్వం పలు విడతలుగా 1,061 చెరువుకు నిధులు కేటాయిస్తూ పరిపాలన మంజూరు ఇచ్చింది. టెండర్లలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నేతలు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తప్పా ప్రారంభించలేక పోయారు. ఏజెన్సీలో అటవీశాఖ అధికారులు అడ్డుగా నిలవడంతో వారిని ప్రసన్నం చేసుకుకోవడంతో పుణ్యకాలం గడిచింది. వర్షాలు వస్తాయని అధికారులు ముందస్తు హెచ్చరికలు చేయడంతో పనులు తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తూ.తూ. మంత్రంగా పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నారుు.
 
పాటించని నిబంధనలు
చెరువులు పనులు సక్రమంగా చేయకపోవడంతో మొదటి ఏడాదే తెగుతున్నారుు. చెరువు కట్టలను పటిష్టపర్చేందుకు పోసే మట్టి ఇతర ప్రాంతాల నుంచి తేవాలి. కానీ, కాంట్రాక్టర్లు చెరువులోని చౌడు మట్టిని కట్టపై పోయడం, రోలింగ్ చేయకపోవడంతో కట్టలు మొదటి వర్షానికే పగుళ్లు బారుతున్నాయి. మట్టి పోసిన సమయంలో 9 నుంచి 12 అంగళాల మట్టి పోసి రోలింగ్ చేసిన తర్వాతే నీళ్లు చల్లుకుంటూ రోలింగ్ చేయాలి. అలా చేయక ట్రాక్టర్లతో తొక్కించడం వల్ల కట్టలు బలహీనంగా మారుతున్నారుు. అరుునా అధికారులు ఏమి చేయలేకపోతున్నారు.
 
గండ్లతో కడగండ్లు

‘మిషన్ కాకతీయ’లో చెరువులకు అవసరం లేకున్నా.. రూ.లక్షలు వెచ్చించి పటిష్టంగా ఉన్న తూములు తొలగించి కొత్తవి నిర్మిస్తున్నారు. వర్షాలతో కాకుండా కాంట్రాక్టర్లు పెట్టిన గండ్లతో రైతులు ఈ ఏడాది ఇబ్బందులు తప్పెటట్లు లేదు. మంగపేట మండలం రామచంద్రునిపేట సమీపంలోని సంఘంపల్లి చెరువుకు రూ.45.50 లక్షలు కేటాయించారు. పూడికతీతకు రూ.9.67 లక్షలు, కట్టకు రూ.2.79 లక్షలు, తూము, మత్తళ్ల నిర్మాణానికి రూ.16.58 లక్షలు కేటాయించారు. నిధులు ఎక్కువగా ఉండడంతో తూముల నిర్మిస్తున్నారు. తూములు తొలగించే సమయంలో రింగ్‌బండ్‌లు వేసి కొత్తవి నిర్మించాల్సి ఉంటుంది.

వర్షాలు ఆలస్యంగా వస్తాయని భావించిన కాంట్రాక్టర్లు జిల్లాలోని పలు చెరువుల తూములను తీసి వేయడంతో ఇటీవల పడిన వర్షపు నీరు నిల్వ ఉండడం లేదు. చెరువులో నీటి అపుకునేందుకు రైతులు రింగ్‌బండ్‌లు వేస్తున్నా లాభం లేని పరిస్థితులు నెలకొన్నాయి. తూముల నిర్మాణానికి వాడుతున్న కాంక్రిట్‌లో నిర్ధేశించిన మేరకు సిమెంటు మిక్స్ చేయకపోవడంతో వర్షాలకు సిమెంటు పోయి కంకర కనిపిస్తోంది.
 
గుట్టు రట్టు..
చెరువుల మరమ్మతుల్లో అక్రమాలు జరుగుతున్నా చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూ.తూ. మంత్రంగా పూడికతీతలు తీసినా బిల్లులు చేయాలని ఒత్తిడి తెస్తున్న కాంట్రాక్టర్లకు వర్షాలు పడడం జీర్ణించుకోలేక పోతున్నారు. నీరు చేరవడం వల్ల ఎంత మేరకు పూడిక తీసారన్న కొలతలు తీయడం కష్టంగా మారనుంది. అందువల్ల పనులు చేపట్టక ముందు రిమోట్ సెన్సింగ్‌తో తీసిన కొలతలతో ఇప్పటి కొలతలు పరిగణలోకి తీసుకుని బిల్లు చేస్తారని అధికారులు అంటున్నారు. అందువల్ల లేని కొలతలతో బిల్లులు చేస్తే చర్యలు తప్పవన్న భయం ఇంజనీరింగ్ అధికారులను వెంటాడుతోంది. వర్షాలు ఇప్పట్లో పడకుంటే పూడికతీతలు మళ్లీ దర్శనం ఇచ్చే అవకాశాలున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement